Home » Entertainment » Esther Anil Gym Photos Video In Social Media
Entertainment

Esther Anil : చిన్న పిల్ల అనుకున్నాం కాని, చిచ్చ‌ర పిడుగే.. దృశ్యం పాప ఆ అందాల ఆరబోత ఏంది?

Authored By
Sam C
The Telugu News | Published on: September 9, 2022, 3:30 pm
Advertisement

Esther Anil: చైల్డ్ ఆర్టిస్ట్‌గా బుల్లితెర‌పై సంద‌డి చేసిన అందాల ముద్దుగుమ్మలు పెరిగి పెద్ద‌య్యాక చేస్తున్న సంద‌డి మాములుగా లేదు. సోష‌ల్ మీడియాలో వీరి అందాల ర‌చ్చ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంది. దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన ఎస్తేర్ అనిల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎస్తేర్ ఊహించని విధంగా గ్లామర్ డోస్ కూడా పెంచుతోంది. అస‌లు స్టార్ హీరోయిన్స్ సైతం ఆశ్చ‌ర్య‌పోయేలా ఎస్తేర్ అందాల ఆర‌బోత సాగుతుండ‌డం విశేషం. తాజాగా ఎస్తేర్‌కి సంబంధించిన జిమ్ వీడియో ఒక‌టి నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తుంది.
ఎస్తేర్ ఆర‌బోత‌..

Advertisement

ఇందులో త‌న న‌డుము అందాల‌ను చూపిస్తూ ర‌చ్చ చేస్తున్న ఎస్తేర్ అనీల్ కేక పెట్టిస్తుంది. ఇందులో ఎస్తేర్ ని చూసి అసలు దృశ్యం సినిమాలో ఈ పాపేనా అని ఆశ్చర్య పోతున్నారు. సినిమా లో ఎంతో క్యూట్ గా ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు అంతా బోల్డ్‌గా క‌నిపించ‌డంతో న‌మ్మ‌లేక‌పోతున్నారు. ప్ర‌స్తుతం ఎస్తేర్ పిక్స్ నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. 2001 లో జన్మించిన ఎస్తేర్‌కి 2010 లో బాల‌న‌టిగా త‌ను ఏడవ త‌ర‌గ‌తి చ‌దివేట‌ప్పుడు సినిమా అవ‌కాశం వ‌చ్చింది. అజి జాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన న‌ల్ల‌వ‌న్ సినిమా అంత ఆక‌ట్టుకోలేక‌పోయినా, ఎస్తేర్ మాత్రం త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. దాంతో ఎస్తేర్ కి బాల‌ న‌టిగా వ‌రుసగా కొన్ని సినిమాల్లో అవ‌కాశం వ‌చ్చింది.

Esther Anil Gym Photos Video In Social Media

Advertisement

పదేళ్ల వయసులోకి రాకముందే వెండితెరకు పరిచయమైన ఎస్తేర్ అనిల్ ఆ తర్వాత చాలా తొందరగానే ఇతర ఇండస్ట్రీలలో కూడా నటిగా మంచి గుర్తింపు అందుకుంది. 2010 నుంచి సౌత్ ఇండస్ట్రీలో చాలా బిజీగా కనిపిస్తున్న ఎస్తేర్ అనిల్ భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల మనసును గెలుచుకుంటుంది. ఇక ఇప్పుడు అయితే సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో కూడా కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. 2014లో తెలుగులో మొదట దృశ్యం సినిమాలో ఈ బ్యూటీ నటించింది. వెంకటేష్ చిన్న కూతురుగా అందులో చాలా అమాయకంగా కనిపించిన ఎస్తేర్ అనిల్ అంతకు ముందు ఒరిజినల్ మలయాళం వెర్షన్ లో కూడా తన నటనతో ఎంతగానో మెప్పించింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి