ETV Dasara Event 2022 : ఈటీవీలో ప్రతి పండగకు ప్రత్యేక కార్యక్రమంగా జబర్దస్త్ కమెడియన్స్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ కమెడియన్స్ తో మల్లెమాల వారు చేయడం పరిపాటిగా వస్తుంది. చిన్న చిన్న ప్రత్యేక రోజులకు కూడా ఈవెంట్స్ చేస్తూ రేటింగ్ పెంచుకుంటున్నారు. ఈ టీవీ తాజాగా దసరాకు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దసరా ఉత్సవంలో భాగంగా రోజమ్మ ఇంటికి వచ్చాం అంటూ శ్రీముఖి ఓ రేంజ్ లో యాంకరింగ్ చేసేందుకు ప్రయత్నించింది. ఆమె దసరా ఉత్సవంలో దాదాపుగా సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. దసరా వైభవం అంటూ దాదాపు మూడు నాలుగు గంటల ఎపిసోడ్ ని నిర్వహించారు. చాలా నెలల తర్వాత మంత్రి రోజా గారు ఈటీవీ స్క్రీన్ పై కనిపించడంతో ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేశారు.
అయితే వారం రోజుల క్రితం విడుదలైన ప్రోమోలో రోజా నన్ను పిలిచి అవమానిస్తారా అంటూ కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఎందుకు అలా చేసింది, అసలు ఆమె కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది ఎవరు అంటూ ఎపిసోడ్ చూసేందుకు కొద్ది మంది ఆసక్తి చూపించారు. అసలు విషయం ఏంటంటే నూకరాజు మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో మీరు జబర్దస్త్ వల్లే ఈ స్థాయిలో ఉన్నాను, ఈ విజయాలకు కారణం జబర్దస్త్ అంటూ వ్యాఖ్యలను చేశారు. మరి ఇప్పుడేమో ఆ మాటను నిలబెట్టుకోకుండా మంత్రి పదవి రాగానే జబర్దస్త్ ని వదిలి వెళ్లి పోయారు అన్నాడు. ఆ మాటలకు రోజా కాస్త బాధ పడ్డట్లుగా నటించిందో మరి నిజంగానే బాధపడ్డదో తెలియదు కానీ కన్నీళ్లు పెట్టేస్తుంది. చాలా మంది ఆమె కన్నీళ్లు అయ్యో పాపం అంటారు.. దాంతో రేటింగ్ బాగా వస్తుందని భావించారేమో కానీ ఆ స్కిట్ అంతగా వర్క్ అవుట్ అవ్వలేదు.
రోజా గారు బాగానే నటించిన కూడా ఇలాంటివి చాలా చూశాం కచ్చితంగా ఇది నిజమై ఉండదు అంటూ ఆమె యాక్టింగ్ ని రోజా అభిమానులతో పాటు ఏ ఒక్కరు నమ్మలేదు. సరదాగా నవ్వించకుండా ఈ ఏడుపు ఎందుకు అంటూ కొందరు కామెంట్ చేస్తే మరి కొందరు మాత్రం రోజాని నిజంగానే పిలిచి అవమానించారని కొందరు అభిప్రాయం చేశారు. కొందరు మాత్రం మంత్రి అయినంత మాత్రాన రోజా జబర్దస్త్ ఎందుకు వదిలేయాలంటూ నూకరాజు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి దసరా వైభవం ఎపిసోడ్ లో రోజమ్మ ఎపిసోడ్ సో సో గానే సాగింది. అది పెద్దగా రక్తి కట్టలేదు, ప్రేక్షకులు నిరాశ చెందారు. ఓవరాల్ గా దసరా వైభవం కార్యక్రమం ప్రేక్షకులకు వినోదాన్ని పండించింది.. పండగపూట హాయిగా చూసుకుని నవ్వేలా ఉందంటూ కామెంట్స్ వచ్చాయి.
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…
Tollywood Actors : టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకే ఫ్రేములో కనిపించడం చాలా అరుదు. ప్రత్యేక సందర్భాలలో వారు కలిసి…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌజ్‌లోని కంటెస్టెంట్స్‌ని చూస్తుంటే వారు సెలబ్రిటీల మాదిరిగా కనిపించడం లేదు.…
RBI : ఆర్ధిక అవసరాల దృష్ట్యా చూస్తే చాలామంది తమ బ్యాంక్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ ను ఉంచడంలో విఫలమవుతున్నారు.…
Coconut Oil : కొబ్బరి చెట్టును కల్ప వృక్షం అని అంటారు. ఎందుకు అంటే ఈ చెట్టు నుండి దొరికే అన్ని…
Airport Jobs : ఏ.ఐ ఎయిర్ పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ (ఏ.ఐ.ఏ.ఎస్.ఎల్) అనే సంస్థ ఎయిర్ పోర్ట్ సర్వీసుల కోసం…
This website uses cookies.