ETV Dasara Event 2022 : ఈటీవీ దసరా ఈవెంట్‌ లో ఆమె ఏడుపు రక్తికట్టలేదు.. ప్రేక్షకులు నిరాశ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ETV Dasara Event 2022 : ఈటీవీ దసరా ఈవెంట్‌ లో ఆమె ఏడుపు రక్తికట్టలేదు.. ప్రేక్షకులు నిరాశ

 Authored By prabhas | The Telugu News | Updated on :6 October 2022,9:00 pm

ETV Dasara Event 2022 : ఈటీవీలో ప్రతి పండగకు ప్రత్యేక కార్యక్రమంగా జబర్దస్త్ కమెడియన్స్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ కమెడియన్స్ తో మల్లెమాల వారు చేయడం పరిపాటిగా వస్తుంది. చిన్న చిన్న ప్రత్యేక రోజులకు కూడా ఈవెంట్స్ చేస్తూ రేటింగ్ పెంచుకుంటున్నారు. ఈ టీవీ తాజాగా దసరాకు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దసరా ఉత్సవంలో భాగంగా రోజమ్మ ఇంటికి వచ్చాం అంటూ శ్రీముఖి ఓ రేంజ్ లో యాంకరింగ్ చేసేందుకు ప్రయత్నించింది. ఆమె దసరా ఉత్సవంలో దాదాపుగా సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. దసరా వైభవం అంటూ దాదాపు మూడు నాలుగు గంటల ఎపిసోడ్ ని నిర్వహించారు. చాలా నెలల తర్వాత మంత్రి రోజా గారు ఈటీవీ స్క్రీన్ పై కనిపించడంతో ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేశారు.

అయితే వారం రోజుల క్రితం విడుదలైన ప్రోమోలో రోజా నన్ను పిలిచి అవమానిస్తారా అంటూ కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఎందుకు అలా చేసింది, అసలు ఆమె కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది ఎవరు అంటూ ఎపిసోడ్ చూసేందుకు కొద్ది మంది ఆసక్తి చూపించారు. అసలు విషయం ఏంటంటే నూకరాజు మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో మీరు జబర్దస్త్ వల్లే ఈ స్థాయిలో ఉన్నాను, ఈ విజయాలకు కారణం జబర్దస్త్ అంటూ వ్యాఖ్యలను చేశారు. మరి ఇప్పుడేమో ఆ మాటను నిలబెట్టుకోకుండా మంత్రి పదవి రాగానే జబర్దస్త్ ని వదిలి వెళ్లి పోయారు అన్నాడు. ఆ మాటలకు రోజా కాస్త బాధ పడ్డట్లుగా నటించిందో మరి నిజంగానే బాధపడ్డదో తెలియదు కానీ కన్నీళ్లు పెట్టేస్తుంది. చాలా మంది ఆమె కన్నీళ్లు అయ్యో పాపం అంటారు.. దాంతో రేటింగ్ బాగా వస్తుందని భావించారేమో కానీ ఆ స్కిట్‌ అంతగా వర్క్ అవుట్ అవ్వలేదు.

etv mallemala dasara vaibhavam show roja skit not good

etv mallemala dasara vaibhavam show roja skit not good

రోజా గారు బాగానే నటించిన కూడా ఇలాంటివి చాలా చూశాం కచ్చితంగా ఇది నిజమై ఉండదు అంటూ ఆమె యాక్టింగ్ ని రోజా అభిమానులతో పాటు ఏ ఒక్కరు నమ్మలేదు. సరదాగా నవ్వించకుండా ఈ ఏడుపు ఎందుకు అంటూ కొందరు కామెంట్ చేస్తే మరి కొందరు మాత్రం రోజాని నిజంగానే పిలిచి అవమానించారని కొందరు అభిప్రాయం చేశారు. కొందరు మాత్రం మంత్రి అయినంత మాత్రాన రోజా జబర్దస్త్ ఎందుకు వదిలేయాలంటూ నూకరాజు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి దసరా వైభవం ఎపిసోడ్ లో రోజమ్మ ఎపిసోడ్ సో సో గానే సాగింది. అది పెద్దగా రక్తి కట్టలేదు, ప్రేక్షకులు నిరాశ చెందారు. ఓవరాల్ గా దసరా వైభవం కార్యక్రమం ప్రేక్షకులకు వినోదాన్ని పండించింది.. పండగపూట హాయిగా చూసుకుని నవ్వేలా ఉందంటూ కామెంట్స్ వచ్చాయి.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది