etv mallemala Sridevi Drama Company shooting update
Sridevi Drama Company : వారం వారం విభిన్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం నాన్నకు పెళ్లి అనే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్నటి ఎపిసోడ్ లో బుల్లెట్ భాస్కర్ తండ్రి పెళ్లి అంటూ హడావిడి చేశారు. ప్రోమో విడుదలైనప్పటి నుండి ఈ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రోమోలో సుడిగాలి సుదీర్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అనే విషయాన్ని చూపించడంతో పాటు ఆర్.ఆర్.ఆర్ సినిమా కు సంబంధించిన సన్నివేశాలను కూడా చూపించబోతున్నాం అని అందులో చూపించారు. దాంతో అంచనాలు మరింతగా పెరిగాయి. ప్రోమోలో చూపించిన దాని కంటే ఎక్కువగానే కామెడీని ఎపిసోడ్లో చేశారు.
అయితే ఎప్పటిలాగే హైపర్ ఆది కామెడీ ఓవర్ యాక్షన్ ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించినా ఓవరాల్గా మాత్రం ఆకట్టుకుంది అనడంలో సందేహం లేదు. పంచ్ ప్రసాద్ పంచులు మరియు రోహిణి తండ్రి ఎంట్రీ ఇచ్చి ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వడం ఇలా పలు విషయాలు నిన్నటి ఎపిసోడ్ లో ప్రత్యేకం గా నిలిచాయి. తండ్రి యొక్క గొప్పతనం తెలియజేస్తూ నిన్నటి ఎపిసోడ్ లో కామెడీ స్కిట్ లు మరియు ఆసక్తికర డాన్స్ పెర్ఫార్మెన్స్ జరిగాయి. బుల్లెట్ భాస్కర్ తండ్రి వేసిన పంచ్ ఆకట్టుకున్నాయి. సుడిగాలి సుదీర్ 20 మంది అమ్మాయిలతో కలిసి వేసిన డాన్స్ లకు ఆయన అభిమానులు ఫిదా అయ్యారు.
etv sridevi drama company latest episode updates
సుడిగాలి సుధీర్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ ఆనంద పడిపోయారు. అదే సమయం లో సుడిగాలి సుధీర్ పెళ్లి ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాను అని తెలియజేస్తాడు అంటూ ఎదురుచూసిన ప్రేక్షకులకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. ఈ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని సుడిగాలి సుదీర్ ప్రకటించాడు. పెళ్లి ఎప్పుడు అనే విషయాన్ని ఆయన చెప్పకుండా పెళ్లి వద్దు ఫ్యాన్స్ ముద్దు అంటూ గతంలో చెప్పినట్లు గానే ఈసారి కూడా డైలాగ్ చెప్పేసి తప్పించుకున్నాడు. సుధీర్ పెళ్లి గురించి ఏదో ఆసక్తికర విషయాన్ని చెప్తాడు అని అంతా నోరెళ్ళబెట్టి చూస్తే చివరికి ఆయన సమాధానం ఆ నోరు వెళ్లబెట్టేలాగే ఉంది. మొత్తంగా ప్రతి ఎపిసోడ్ మాదిరిగానే నవ్వించడంతో ఈ ఎపిసోడ్ కూడా పాటు కన్నీళ్లు పెట్టించింది.
కూకట్ పల్లి (Kukatpally) బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
This website uses cookies.