Sridevi Drama Company : ఏప్రిల్‌ 10 శ్రీదేవి డ్రామా కంపెనీ షో గురించి ముచ్చట

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: April 11, 2022, 7:00 pm

Sridevi Drama Company : వారం వారం విభిన్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం నాన్నకు పెళ్లి అనే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్నటి ఎపిసోడ్ లో బుల్లెట్ భాస్కర్ తండ్రి పెళ్లి అంటూ హడావిడి చేశారు. ప్రోమో విడుదలైనప్పటి నుండి ఈ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రోమోలో సుడిగాలి సుదీర్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అనే విషయాన్ని చూపించడంతో పాటు ఆర్.ఆర్.ఆర్ సినిమా కు సంబంధించిన సన్నివేశాలను కూడా చూపించబోతున్నాం అని అందులో చూపించారు. దాంతో అంచనాలు మరింతగా పెరిగాయి. ప్రోమోలో చూపించిన దాని కంటే ఎక్కువగానే కామెడీని ఎపిసోడ్లో చేశారు.

అయితే ఎప్పటిలాగే హైపర్ ఆది కామెడీ ఓవర్ యాక్షన్‌ ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించినా ఓవరాల్గా మాత్రం ఆకట్టుకుంది అనడంలో సందేహం లేదు. పంచ్‌ ప్రసాద్ పంచులు మరియు రోహిణి తండ్రి ఎంట్రీ ఇచ్చి ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వడం ఇలా పలు విషయాలు నిన్నటి ఎపిసోడ్ లో ప్రత్యేకం గా నిలిచాయి. తండ్రి యొక్క గొప్పతనం తెలియజేస్తూ నిన్నటి ఎపిసోడ్ లో కామెడీ స్కిట్ లు మరియు ఆసక్తికర డాన్స్ పెర్ఫార్మెన్స్ జరిగాయి. బుల్లెట్ భాస్కర్ తండ్రి వేసిన పంచ్ ఆకట్టుకున్నాయి. సుడిగాలి సుదీర్ 20 మంది అమ్మాయిలతో కలిసి వేసిన డాన్స్ లకు ఆయన అభిమానులు ఫిదా అయ్యారు.

etv sridevi drama company latest episode updates

etv sridevi drama company latest episode updates

సుడిగాలి సుధీర్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ ఆనంద పడిపోయారు. అదే సమయం లో సుడిగాలి సుధీర్ పెళ్లి ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాను అని తెలియజేస్తాడు అంటూ ఎదురుచూసిన ప్రేక్షకులకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. ఈ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని సుడిగాలి సుదీర్ ప్రకటించాడు. పెళ్లి ఎప్పుడు అనే విషయాన్ని ఆయన చెప్పకుండా పెళ్లి వద్దు ఫ్యాన్స్ ముద్దు అంటూ గతంలో చెప్పినట్లు గానే ఈసారి కూడా డైలాగ్ చెప్పేసి తప్పించుకున్నాడు. సుధీర్ పెళ్లి గురించి ఏదో ఆసక్తికర విషయాన్ని చెప్తాడు అని అంతా నోరెళ్ళబెట్టి చూస్తే చివరికి ఆయన సమాధానం ఆ నోరు వెళ్లబెట్టేలాగే ఉంది. మొత్తంగా ప్రతి ఎపిసోడ్‌ మాదిరిగానే నవ్వించడంతో ఈ ఎపిసోడ్‌ కూడా పాటు కన్నీళ్లు పెట్టించింది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp