Home » Entertainment » Two Contestants Out From Bigg Boss
Entertainment

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ నుండి ఆ ఇద్ద‌రు ఎలిమినేష‌న్.. నటరాజ్ మాస్టర్ పై నాగార్జున ఫైర్

Authored By
Sam C
The Telugu News | Published on: April 11, 2022, 6:30 pm
Advertisement

Bigg Boss OTT Telugu : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ స‌క్సెస్ ఫుల్ గా ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ప్ర‌తి వారం హౌజ్ నుండి ఒక్క‌రు మాత్ర‌మే ఎలిమినేట్ అవుతూ వ‌స్తుండ‌గా, ఈ వారం మాత్రం ఇద్ద‌రు ఎలిమినేట్ అయ్యారు. మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్‌బాస్ నాన్ స్టాప్ ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకుంది. మొదటి వారంలో ముమైత్ ఖాన్, ఆ తరువాత శ్రీరాపాక, మూడో వారంలో ఆర్జే చైతూ, నాలుగో వారం సరయు, ఐదో వారం తేజస్వి ఎలిమినేట్ అయింది. అయితే ముమైత్ ని పంపించేసినట్టే పంపించి మళ్ళీ తీసుకొచ్చారు. ఈ అమ్మ‌డిని మ‌ళ్లీ తిరిగి పంపించారు.ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా తక్కువ ఓట్లు వచ్చిన ఇద్దరు కంటెస్టెంట్స్ ని హౌస్ నుండి ఎలిమినేట్ చేశారు.

Advertisement

ఉత్కంఠగా సాగిన ఎలిమినేషన్ లో చివరికి ముగ్గురు మిగిలారు. మొమైత్ , స్రవంతి, మిత్ర లను నాగార్జున వాళ్ళ ఎదురుగా ఉన్న బాక్సుల్లో చేతులు ఉంచాలని ఆదేశించారు. ముగ్గురు చేతులు పెట్టిన అనంతరం తన కౌంట్ ఆధారంగా బయటికి తీయాలన్నారు. ఎరుపు రంగు ఉన్న కంటెస్టెంట్స్ ఎలిమినేట్, గ్రీన్ కలర్ ఉన్న కంటెస్టెంట్స్ సేవ్ అవుతారని చెప్పారని. ముమైత్, స్రవంతి చేతులకు రెడ్ కలర్ అంటి ఉండగా… మిత్ర చేతికి మాత్రమే గ్రీన్ కలర్ ఉంది. దీంతో ముమైత్, స్రవంతి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున వెల్లడించారు.ఎలిమినేట్ కావ‌డంతో స్ర‌వంతి చాలా అప్సెట్ అయ్యారు. ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. ఇక హౌస్ లో నటరాజ్ మాస్టర్ పై ఆమె నెగిటివ్ కామెంట్స్ చేశారు.

two contestants out from Bigg Boss OTT Telugu

Advertisement

Bigg Boss OTT Telugu : భ‌లే ట్విస్ట్ ఇచ్చారుగా..

అఖిల్, అజయ్, బిందు, అషురెడ్డి తనకు అత్యంత ఇష్టమైన కంటెస్టెంట్స్ ని తెలియజేశారు. అయితే ఎప్పుడూ కూల్‌గా ఉంటూ నవ్వుతూనే చురకలు అంటించే నాగార్జున ఈసారి మాత్రం విశ్వరూపం చూపించాడు. హద్దులు మీరి మాట్లాడుతూ అతి చేస్తున్న బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ కంటెస్టెంట్లపై ఫైర్‌ అయ్యాడు. ఈ క్రమంలో యాంకర్‌ శివ, నటరాజ్‌ మాస్టర్‌లకు గట్టి వార్నింగే ఇచ్చాడు. ఇదిలా ఉంటే హౌస్‌మేట్స్‌తో ఫన్నీ టాస్క్‌ కూడా ఆడించాడు . హౌస్‌లో బూతులు మాట్లాడే కంటెస్టెంట్‌ ఎవరని ప్రశ్నించగా నటరాజ్‌ అషూరెడ్డి అని ఆన్సరిచ్చాడు. అషూ పచ్చిబూతులు మాట్లాడుతుందా అని నాగ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేయగా మా మమ్మీ చూస్తే ఇంటికెళ్లాక చీపురుకట్ట తిరగేస్తుందని వాపోయింది అషూ.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి