Sridevi Drama Company : ఈటీవీలో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్ గడచిన మూడు నాలుగు వారాలుగా బాగా తగ్గినట్లుగా సమాచారం అందుతోంది. అందుకు కారణం ఆదివారం మద్యాహ్నం సమయంలో జీ తెలుగు మరియు స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్యక్రమాలు అంటూ వార్తలు వస్తున్నాయి. గతంలో జబర్దస్త్ కి ఏమాత్రం తగ్గకుండా భారీ ఎత్తున రేటింగ్ నమోదు అయ్యేది. కాని ఇప్పుడు మాత్రం శ్రీదేవి డ్రామా కంపెనీకి రేటింగ్ చాలా తక్కువ నమోదు అవుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
జబర్దస్త్ లో సుధీర్ వెళ్లి పోయిన తర్వాత రష్మి యాంకర్ గా చేసేందుకు ముందుకు వచ్చింది. సుధీర్ స్థానం ను ఎవరైతే భర్తీ చేయగలరో వారికే ఈ అవకాశం ఇవ్వడంతో రేటింగ్ అప్పుడు ఏమాత్రం తగ్గలేదు. పై పెచ్చు రష్మి యాంకర్ గా చేసిన మొదటి ఎపిసోడ్ కు ఒకింత రేటింగ్ ఎక్కువ వచ్చింది. అలాంటిది ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ యొక్క రేటింగ్ తగ్గడంతో ఈటీవీ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు ఏం జరుగబోతుంది అంటూ ఆందోళనతో ఉన్నారు.
స్టార్ మా మరియు జీ తెలుగు లో ప్రసారం అవుతున్న వారం స్పెషల్ కార్యక్రమాల వల్ల రేటింగ్ తగ్గింది తప్పితే రెగ్యులర్ రేటింగ్ అలాగే ఉంటుందని.. వచ్చే వారం నుండి మళ్లీ శ్రీదేవి డ్రామా కంపెనీ యొక్క రేటింగ్ కుమ్మేయడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా లో శ్రీదేవి డ్రామా కంపెనీకి ఉన్న ఆధరణ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా యూట్యూబ్ లో ఈ షో కి వస్తున్న వ్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆది మరియు రామ్ ప్రసాద్ ల జోరుకు అంతా కూడా ఫిదా అవుతున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.