Anchor Sowmya : ‘రేయ్ .. బంగారం .. ఛీ పోరా’ ఈ పిల్ల గురించి మీకు తెలియని నిజాలు !
Anchor Sowmya : బుల్లితెరపై జబర్దస్త్ షో కు ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మల్లెమాల ఫస్ట్ టైం కామెడీ షో ను డిజైన్ చేసి, స్కిట్ వేసి జనాలు నవ్వించే విధంగా ప్లాన్ చేసిన మల్లె మాల భారీ టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటుంది. కాగా ఈ క్రమంలో ఎక్స్ట్రా జబర్దస్త్ అంటే మరో షోను పెట్టి గురువారం, శుక్రవారం టెలికాస్ట్ అయ్యేలా చేసి జనాలను కడుపుబ్బ నవ్వించేలా ప్లాన్ చేసింది. టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న జబర్దస్త్ ఇటీవల నెగిటివ్ కామెంట్స్ తో ట్రోల్ అవుతుంది.
జబర్దస్త్ లో కమెడియన్స్ ఒక్కొక్కరుగా జబర్దస్త్ విడిచి వెళ్ళిపోతున్నారు. దీంతో రెమ్యూనరేషన్ ఆశ చూపించి మళ్లీ జబర్దస్త్ లోకి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో జబర్దస్త్ మరింత ఆసక్తికరంగా మారింది. ఎవరు ఎలా పోయినా సరే నా దారే వేరు అంటూ దూసుకుపోతున్నాడు హైపర్ ఆది. ఈమధ్య అతను ప్రవర్తించే తీరు జనాలకు నచ్చట్లేదు. ఎప్పుడు ఒకే విధమైన స్కిట్స్ చేస్తూ డబల్ మీనింగ్ డైలాగులతో వల్గర్ పంచులతో స్కిట్ లు వేయడం హైపర్ ఆదికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఉంది.
ఇటీవల విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో హైపర్ ఆది మరొక్కసారి కొత్త యాంకర్ సౌమ్య ను గెలికాడు. ఇక ఆ స్కిట్ లో ఒక్క ముద్దు అంటూ పైపైకి వెళ్తూ ఆమెతో హద్దులు మీరి ప్రవర్తించే విధంగా ఉండిపోయాడు. ఈ క్రమంలో సౌమ్యరావు ఛీ పోరా అని వెనక్కి నెట్టేస్తుంది. జబర్దస్త్ చూస్తున్న జనాలకే కాదు, అక్కడ ఉన్న కంటెస్టెంట్లకు సైతం షాకింగ్ గా అనిపించి ఉంటుంది. ఇదంతా స్కిట్ లో భాగం అన్న సంగతి తెలిసిందే. ప్రతివారం జరిగే తతంగమే కానీ ఒక ఆడపిల్లపై హైపర్ ఆది అలా పైకి వెళ్లడం జనాలకు నచ్చలేదు. ఈ క్రమంలో జనాలు హైపర్ ఆదిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.