Nazriya Nazim : భర్త మీదకు ఎక్కి మరీ రొమాన్స్ నజ్రియా.. యాడ్ కోసం ఈ రేంజ్ లో రెచ్చిపోయారేంటి బాబోయ్..!

Authored By Rame Samhith | The Telugu News | Published on: October 8, 2022, 3:00 pm

Nazriya Nazim : మళయాళ క్రేజీ జంట ఫాహద్ ఫాజిల్, నజ్రియాలు ఆన్ స్క్రీన్ రొమాన్స్ అదిరిపోతుంది. ఇద్దరు సినిమాలో నటించి అభిరుచులు కలవడంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరు చాలా గ్యాప్ తర్వాత మళ్లీ కలిసి నటించారు. ఈసారి ఫాహద్, నజ్రియాలు కలిసి ఓ యాడ్ లో నటించారు. అది కూడా ఐస్ క్రీం యాడ్ కోసం వీరు కలిసి జత కట్టారు. రియల్ జోడీ కాబట్టి ఇద్దరు ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. నజ్రియా అయితే భర్త మీదకు ఎక్కి మరీ రొమాన్స్ చేసింది.

వేరే జోడీ అయితే ఈ యాడ్ ఎలా ఉండేదో కానీ రియల్ జోడీ అయిన ఫాహద్, నజ్రియాలు చేయడం వల్ల యాడ్ కి క్రేజ్ వచ్చింది. లవ్ యాజ్ మెనీ ఫ్లేవర్స్ అంటూ కామెరీ ఐస్ క్రీం కోసం ఫాహద్ ఫాజిల్, నజ్రియాలు కలిసి నటించారు. వారు ఇంట్లో చేసుకునే రొమాన్స్ ని యాడ్ కోసం ప్రేక్షకుల ముందుకు తెచ్చారని చెప్పొచ్చు. తన విలక్షణ నటనతో సౌత్ ఆడియన్స్ ని అలరిస్తున్నాడు ఫాహద్ ఫాజిల్.. మాతృ భాష మళయాళంతో పాటుగా తెలుగు, తమిళ భాషల్లో కూడా ఫాహద్ నటిస్తున్నాడు. పుష్ప పార్ట్ 1 లో భన్వర్ సింగ్ షెఖావత్ పాత్రలో తన నటనతో అదరగొట్టాడు ఫాహద్ ఫాజిల్. ఆ సినిమా సెకండ్ పార్ట్ లో ఫాహద్ పాత్ర హీరో పాత్రకి ఈక్వల్ గా ఉంటుందని అంటున్నారు.

Fahadh Faasil Nazriya Nazim ice cream ad

Fahadh Faasil Nazriya Nazim ice cream ad

ఇక నజ్రియా విషయానికి వస్తే.. రాజా రాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె నాని అంటే సుందరానికీ సినిమాతో తెలుగు స్ట్రైట్ సినిమా చేసింది. అయితే ఆ సినిమా ఫలితం ఆమెకు నిరాశ కలిగించింది. ఆ సినిమా హిట్ అయితే తెలుగులో వరుసగా సినిమాలు చేద్దామని అనుకున్న నజ్రియాకి నాని సినిమా షాక్ ఇచ్చింది. ప్రస్తుతం భర్తతో యాడ్స్ చేస్తూ కాలం వెళ్లదీస్తుంది అమ్మడు. ఓ విధంగా నజ్రియా ఇప్పుడు సెలెక్టెడ్ సినిమాలు చేస్తేనే బెటర్ అని చెప్పొచ్చు. ఫాహద్ మాత్రం అక్కడ ఇక్కడా అనే తేడా లేకుండా వరుస సినిమాలతో అదరగొట్టేస్తున్నాడు.

Also read

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp