
faima and praveen love story faima mother shocking comments
Faima – Praveen : ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయిన పటాస్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ప్రవీణ్ మరియు ఫైమా ప్రేమలో ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. వారు కూడా తామిద్దరం ప్రేమలో ఉన్నామంటూ జబర్దస్త్ స్టేజ్ పై పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా వారిద్దరి యొక్క ప్రేమ కహాని కనిపించింది. ఇద్దరూ వారి వారి యూట్యూబ్ ఛానల్ లో ప్రేమలో ఉన్నట్లుగానే మాట్లాడుకుంటూ.. వ్యవహరిస్తూ వీడియోలు చేయడం మనం చూశాం. నిజంగా ప్రేమలోనే ఉన్నారా అన్నట్లుగా అనిపించే ఈ జంట గురించి ఫైమా అమ్మ గారిని అడిగిన సందర్భంలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతానికి మా అమ్మాయి పూర్తి దృష్టి కెరియర్ మీదే ఉందని, ఆమె వేరే ధ్యాస లోకి వెళ్లే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చింది. మరి ప్రవీణ్ తో ప్రేమ విషయం ఏంటి అంటూ ఆమెను ప్రశ్నించగా.. జబర్దస్త్ లో సుడిగాలి సుదీర్ మరియు రష్మీ ల ప్రేమ కథ మాదిరిగానే తన కూతురు ప్రేమ కథ అన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఇమాన్యుల్ మరియు వర్ష ల యొక్క ప్రేమ ఎంత నిజమో నా కూతురు యొక్క ప్రేమ అంతే నిజం అన్నట్లుగా ఆమె కుండ బద్దలు కొట్టినట్లుగా క్లారిటీ ఇచ్చేసింది. కేవలం టిఆర్పి రేటింగ్ కోసం.. గుర్తింపు తెచ్చుకోవడం కోసం మాత్రమే ప్రవీణ్ తో తన కూతురు సన్నిహితంగా ఉంటున్నట్లు ఆమె తన సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చిందట.
faima and praveen love story faima mother shocking comments
ఈ విషయం ఆ నోట ఈ నోట పడి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం ఫైమా బిగ్ బాస్ లో ఉంది. అక్కడ ఆమె మంచి ప్రదర్శన ఇచ్చి టాప్ 5 లో నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా బిగ్ బాస్ లో జబర్దస్త్ చూపించి ఫైమా ఫైటింగ్ చేసి టాప్ లో నిలుస్తుంది అనడం ఎలాంటి సందేహం లేదు. ముందు ముందు కూడా ఈ అమ్మాయి బుల్లి తెర మరియు వెండి తెర పై తనదైన సత్తా చాటి స్టార్ గా నిలవడం ఖాయం. కనుక అలాంటి అమ్మాయి ఇప్పుడు ప్రేమ దోమ అంటూ కెరీయర్ ని నాశనం చేసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అనేది చాలా మంది అభిప్రాయం. ప్రవీణ్ కూడా మంచి కమెడియన్.. అతడు ప్రేమ అంటూ కెరియర్ ని నాశనం చేసుకోకుండా కెరీర్ పై దృష్టి పెట్టాలని అతడి సన్నిహితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.