Home » Entertainment » Faima Is Not Going To Jabardasth After Bigg Boss 6 Telugu
Entertainment

Jabardasth Faima : ఫైమా జబర్దస్త్‌కి వెళ్లేందుకు బిగ్‌బాస్ అనుమతి కావాలా…?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 13, 2022, 1:00 pm
Advertisement

Jabardasth Faima : పటాస్ మరియు జబర్దస్త్ కార్యక్రమాలతో ఫైమా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. బుల్లి తెర యాంకర్ లు మరియు హీరోయిన్స్ స్థాయిలో ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. జబర్దస్త్ కారణంగా ఆమెకు బిగ్ బాస్ లో ఛాన్స్ దక్కింది. ఆమె జబర్దస్త్ వీడి వెళ్లడం ను చాలా మంది తప్పు పట్టారు. కానీ ఆమె జబర్దస్త్ లో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి అంటూ ఆ మధ్య కాలంలో ప్రచారం జరిగింది. ఇటీవల ఫైమా బిగ్ బాస్ నుండి బయటకు వచ్చేసింది.

Advertisement

ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత మళ్లీ జబర్దస్త్ లో ఎప్పుడు జాయిన్ కాబోతుంది అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే బిగ్బాస్ లో చేసిన వారు కచ్చితంగా సంవత్సరం పాటు స్టార్‌ మా కార్యక్రమాల్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. మరే ఇతర కార్యక్రమాల్లో కూడా చేయకూడదు. కనీసం ఇతర చానల్స్ లో కనిపించకూడదు. అందుకే ఫైమా ఈటీవీలో కనిపించడానికి కనీసం సంవత్సరం టైం పడుతుంది అంటున్నారు. అదే నిజమైతే జబర్దస్త్ లో ఫైమా మళ్లీ కనిపించక పోవచ్చు అంటూ ఆమె అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

faima is not going to jabardasth after Bigg Boss 6 Telugu

Advertisement

జబర్దస్త్ ఫైమా బిగ్ బాస్ కి వెళ్లి చాలా పెద్ద తప్పు చేసింది అంటూ విశ్లేషిస్తున్నారు. ఆమె కు జబర్దస్త్‌ లో చాలా మంచి అవకాశాలు వచ్చాయి. ఆమె కావాలి అనుకుంటే టీమ్‌ లీడర్ గా కూడా చేసేందుకు మల్లెమాల వారు ఓకే చెప్పే వారు. కానీ ఆమె మాత్రం బిగ్‌ బాస్ కు వెళ్లింది. అక్కడ సంపాదించింది ఎంతో కానీ ఆమె కు నిరాశే మిగిలింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బిగ్‌ బాస్ కు వెళ్లి ఫైమా నష్టపోయింది అంటూ కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం ఆమెకు లాభం దక్కిందని అంటున్నారు. మరి ఆమె ఉద్దేశ్యం ఏంటో అనేది చూడాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి