Ration Card : తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల పథకం వారికే..!
Ration Card - తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం కీలక గుడ్‌న్యూస్ ప్రకటించింది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రేవంత్ సర్కార్.. ఈ నెలలో మరో…
Ration Card : తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం కీలక గుడ్‌న్యూస్ ప్రకటించింది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రేవంత్ సర్కార్.. ఈ నెలలో మరో కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. కుటుంబానికి అండగా నిలిచేలా రూపొందించిన ఈ పథకం ద్వారా కుటుంబ పెద్ద మరణిస్తే, ఆ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా అందనుంది. అంతేకాదు.. ఈ బీమా కోసం లబ్ధిదారులు తమ జేబు నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకమే ఇందిరమ్మ బీమా పథకం. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనుంది. ఇందుకు ప్రభుత్వం ముహూర్తాన్ని కూడా ఖరారు చేసింది. సిద్దిపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు.రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కుటుంబ పెద్ద ఏ కారణంతో మరణించినా.. కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల బీమా సొమ్ము అందేలా పథకాన్ని రూపొందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందిరమ్మ బీమా అమలు కోసం ఇప్పటికే ఇన్సూరెన్స్ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సాధారణంగా జీవిత బీమా తీసుకోవాలంటే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆరోగ్య పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పథకంలో లబ్ధిదారులపై అలాంటి ఆర్థిక భారం ఉండదు.ముఖ్యంగా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు జీవిత బీమా ప్రీమియం చెల్లించడం కొంత భారంగా మారే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొస్తున్న ఇందిరమ్మ బీమా పథకం ద్వారా అర్హత ఉన్న కుటుంబాలకు ఎలాంటి ప్రీమియం భారం లేకుండానే బీమా రక్షణ లభించనుంది. ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించాల్సిన బీమా మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.
Ration Card : తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల పథకం వారికే..!
Ration Card నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ బీమా.. 20 నుంచి ఇంటింటికీ దరఖాస్తులు
ఇందిరమ్మ బీమా పథకాన్ని నవంబర్ 19వ తేదీన ప్రారంభించిన అనంతరం.. నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు ఇందిరమ్మ కమిటీలు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తులను స్వీకరించనున్నాయి. ఈ ప్రక్రియలో అర్హులైన కుటుంబాలను గుర్తించి పథకంలో లబ్ధిదారులుగా చేర్చేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఇందిరమ్మ కమిటీలు సేకరించిన దరఖాస్తులను ఎమ్మార్వోలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పరిశీలించి అర్హత ఉన్న వారిని గుర్తించనున్నారు. అనంతరం వారిని ఇందిరమ్మ బీమా పథకంలో లబ్ధిదారులుగా చేర్చే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కవరేజీ కల్పించనున్నారు. ఇక ఇందిరమ్మ బీమా పథకంతో పాటు నవంబర్ 19వ తేదీ నుంచి మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కూడా ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా అదే రోజు నుంచి చీరలను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు ఇందిరమ్మ చీరలను పంపించారు. ప్రస్తుతం అవి పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ఇందిరమ్మ చీరల రంగుల్లో కూడా ప్రభుత్వం మార్పులు చేసింది. గతంలో ఉన్న విధానానికి భిన్నంగా వివిధ రకాల రంగుల్లో చీరలను తయారు చేయించారు. సాధారణంగా బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఈ చీరలను అందించేవారు. అయితే చీరల తయారీలో జాప్యం చోటుచేసుకోవడంతో బతుకమ్మ సమయంలో పంపిణీ చేయలేకపోయారు. ఇప్పుడు నవంబర్ 19వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వీటి పంపిణీ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read : Sai Dharam Tej kiranmayi : టాలీవుడ్‌లో పెళ్లి సందడి.. సాయి దుర్గ తేజ్ – కిరణ్ నిశ్చితార్థం..!
ఇందిరమ్మ బీమాతో ప్రీమియం భారం లేకుండా రూ.5 లక్షల రక్షణ
ఇందిరమ్మ బీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. సాధారణంగా ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే వయసు, ఆరోగ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆరోగ్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఏడాది నిర్ణీత మొత్తంలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఇలాంటి బీమా ప్రీమియం చెల్లింపులు ఆర్థికంగా భారంగా మారే అవకాశం ఉంటుంది. కుటుంబాన్ని నడిపించే వ్యక్తికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే.. ఆ కుటుంబంపై ఆర్థిక భారం మరింత పెరిగే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ బీమా పథకాన్ని తీసుకొస్తోంది. ఈ పథకం ద్వారా రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు. ముఖ్యంగా కుటుంబ పెద్ద మరణించినప్పుడు కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల బీమా మొత్తం అందనుంది. ఈ బీమా పొందేందుకు లబ్ధిదారులు ప్రత్యేకంగా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం స్వయంగా ఇన్సూరెన్స్ కంపెనీలకు బీమా మొత్తాన్ని చెల్లించనుంది. అందువల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఈ పథకం ద్వారా భవిష్యత్తులో కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో ఆర్థికంగా కొంత అండ లభించే అవకాశం ఉంటుంది. నవంబర్ 19న సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పథకం ప్రారంభం కానుండటంతో.. ఇందిరమ్మ బీమాపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. Telangana News, Indiramma Bima Scheme, Telangana Ration Card, Revanth Reddy, Telangana Government Schemes







