Railway Ticket Price : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 47 రైళ్ల టికెట్ ధరలు తగ్గింపు
Railway Ticket Price - రైల్వే ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ కీలక గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన వసతులు…
Railway Ticket Price : రైల్వే ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ కీలక గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించడంపై దృష్టి సారిస్తున్న రైల్వే.. ఇప్పటికే నడుస్తున్న కొన్ని రైళ్ల విషయంలోనూ కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కొన్ని రైళ్లను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు, మరికొన్ని రైళ్లకు ఉన్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హోదాను తొలగించి సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చనుంది. ఈ మార్పుల కారణంగా ఆయా రైళ్లలో ప్రయాణించే వారికి టికెట్ ధరలు కూడా తగ్గనున్నాయి. దాదాపుగా 47 రైళ్లలో 2027 జనవరి 1వ తేదీ నుంచి టికెట్ ఛార్జీలు తగ్గే అవకాశం ఉంది. ప్రయాణించే తరగతిని బట్టి ఒక్కో టికెట్‌పై సుమారు రూ.15 నుంచి రూ.75 వరకు ధర తగ్గనుంది. దీంతో తరచుగా రైలులో ప్రయాణించే వారికి కొంత మేరకు ప్రయాణ ఖర్చు తగ్గే అవకాశం ఉంది. రైల్వే శాఖ తాజాగా ఎంపిక చేసిన రైళ్ల విషయంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లుగా కొనసాగుతున్న కొన్ని రైళ్లు.. నిర్దేశిత మార్గంలో రైల్వే నిబంధనలకు అనుగుణంగా సూపర్‌ఫాస్ట్ వేగాన్ని అందుకోలేకపోతున్న నేపథ్యంలో ఈ మార్పులు చేస్తున్నట్లు వెల్లడించింది. అందుకే 2027 జనవరి 1 నుంచి ఆయా రైళ్లకు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హోదాను తొలగించి రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చనున్నారు.
Railway Ticket Price : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 47 రైళ్ల టికెట్ ధరలు తగ్గింపు
Railway Ticket Price జనవరి 1 నుంచి తగ్గనున్న టికెట్ ధరలు.. రూ.15 నుంచి రూ.75 వరకు ఆదా
సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు టికెట్ ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. సూపర్‌ఫాస్ట్ రైళ్లకు అదనంగా సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జీ కూడా వసూలు చేస్తారు. అయితే ఆయా రైళ్లను రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చడంతో ఇకపై సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు వర్తించే టికెట్ ఛార్జీలే అమలులోకి రానున్నాయి. దీంతో ప్రయాణికులపై పడుతున్న అదనపు సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జీ భారం తగ్గనుంది. ప్రయాణించే తరగతిని బట్టి ఒక్కో టికెట్‌పై రూ.15 నుంచి రూ.75 వరకు తగ్గింపు ఉండవచ్చని రైల్వే శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఈ రైళ్లలో ఇకపై రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు తగ్గిన ధరలతోనే టికెట్లు జారీ చేయనున్నారు. ఇదిలా ఉండగా, రైళ్లను రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చినప్పటికీ వాటి నిర్వహణ వేళల్లో ఎలాంటి మార్పు ఉండదని అధికారులు స్పష్టం చేశారు. అంటే ప్రయాణికుల టికెట్ ఛార్జీలలో మార్పు వచ్చినా.. ఆయా రైళ్ల రాకపోకల సమయాలు మాత్రం యథావిధిగా కొనసాగనున్నాయి. మొత్తం 18 రైళ్లకు ఉన్న ‘సూపర్‌ఫాస్ట్’ హోదాను తొలగించి సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చాలని నిర్ణయించినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ మార్పుతో ప్రయాణికులు చెల్లించాల్సిన సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జీ పూర్తిగా తగ్గిపోనుంది. ఫలితంగా ఆయా రైళ్లలో ప్రయాణించే వారికి టికెట్ ధరలు మరింత అందుబాటులోకి రానున్నాయి.
Also Read : Aadhaar Card , Voter ID : ఆధార్ ఔట్.. ఓటర్ ఐడీ ఇన్..! సంక్షేమ పథకాలపై కేంద్రం సంచలన నిర్ణయం..!
కొత్త రైలు నంబర్లు.. అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు చెక్ చేసుకోవాలి
ఈ మార్పులతో పాటు కొన్ని రైళ్లకు కొత్త నంబర్లను కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. అందువల్ల జనవరి 1, 2027 నుంచి ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునే ముందు రైలు నంబర్, ఛార్జీలు తదితర వివరాలను ముందుగానే పరిశీలించుకోవాలని సూచించారు. ముఖ్యంగా రిజర్వేషన్ చేసుకునే సమయంలో అధికారిక రైల్వే వెబ్‌సైట్‌లో తాజా వివరాలను చెక్ చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. టికెట్ ధరలు తగ్గనున్న రైళ్ల జాబితాలో సెంట్రల్ రైల్వే పరిధిలోని CSMT–పూణే ప్రగతి, LTT–అయోధ్య కంటోన్మెంట్ తులసి వంటి రైళ్లతో కలిపి 18 సర్వీసులు ఉన్నాయి. అలాగే ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో సప్త క్రాంతి సహా 20 సర్వీసులు ఉన్నట్లు వెల్లడించారు. ఇకపై ఈ రైళ్లలో రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు తగ్గించిన ధరల ప్రకారం టికెట్లు జారీ చేయనున్నారు. దీంతో సూపర్‌ఫాస్ట్ హోదా తొలగింపు వల్ల అదనపు సర్‌ఛార్జీ భారం తగ్గడంతో పాటు, కొన్ని తరగతుల్లో టికెట్ ధర కూడా రూ.15 నుంచి రూ.75 వరకు తగ్గే అవకాశం ఉంది. అయితే ప్రయాణికులు తమ ప్రయాణ తేదీకి సంబంధించిన రైలు నంబర్, టికెట్ ఛార్జీ, ఇతర వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ముందుగానే నిర్ధారించుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. Indian Railways, Train Ticket Price, Railway Ticket Fare, Superfast Express, Railway News







