Home » Entertainment » Fans Shows Love On Ntr
Entertainment

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇంత అభిమాన‌మా.. ఏకంగా ఫ్లైట్‌తోనే ర‌చ్చ చేశారుగా..

Authored By
Sam C
The Telugu News | Updated on: March 13, 2022 3:19 pm
Advertisement

Jr NTR : కెరీర్‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ఎన్టీఆర్ రానున్న రోజుల‌లో పాన్ ఇండియా చిత్రాలు చేయ‌బోతున్నాడు. ఇప్పుడు ఆయ‌న న‌టించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అమెరికాలో “ఆర్ఆర్ఆర్” అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఒక ఎన్టీఆర్ వీరాభిమాని ఓకే సారి 75 టికెట్లు కొనుగోలు చేసి అందరిని అందరికీ షాకిచ్చాడు.

Advertisement

అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో గెలాక్సీ స్పేస్ థియేటర్ లో 24వ తారీకున 12:30 షో కి ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు 75 టికెట్లు కొనుగోలు చేశాడు. ఇక మ‌రి కొంద‌రు అభిమానులు ఎన్టీఆర్‌పై త‌న ప్రేమ‌ను వినూత్నంగా చాటుకున్నాడు. కెన‌డాకి చెందిన అభిమానులు కార్ల‌తో ఎన్టీఆర్ పేరుని డిజైన్ చేశారు. ఇది అంద‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.ఇక తాజాగా ఎయిర్ ప్లేన్‌తో చేసిన విన్యాసాలు ఎన్టీఆర్‌పై అభిమానాన్ని క‌న‌బ‌రుస్తున్నాయి. జూనియర్ అంటే వారికి ఎంత ప్రేమ‌, అభిమానం ఉందో అర్ధ‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం వీడియో వైర‌ల్‌గా మారింది.ఎన్టీఆర్,రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

fans shows love on Jr NTR

Advertisement

 

Jr NTR : ఎన్టీఆర్‌పై అమిత‌మైన అభిమానం..

అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైనకొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. విడుదలకు ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో ఈ సినిమాను ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ కోవలోనే త్తర జెండా అనే దేశభక్తి గీతాన్ని ఈ నెల 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. ఆలియా భట్ సీత పాత్రలో నటించింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి