Faria Abdullah : ఆ ఒక్కటి అడక్కు"ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రెచ్చిపోయిన ఫరీయా అబ్దుల్లా...!
Faria Abdullah : చాలా సంవత్సరాల తర్వాత అల్లరి నరేష్ మళ్లీ ఓ కామెడీ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. “ఆ ఒక్కటి అడక్కు” అనే కామెడీ సినిమా ద్వారా అల్లరి నరేష్ ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ఈ సినిమాలో జాతి రత్నాలు హీరోయిన్ ఫరీయా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్ ను ఆడియన్స్ ముందుకు తీసుకురాగా మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఇటీవల ట్రైలర్ ను కూడా మూవీ టీమ్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రానికి ముఖ్య అతిథిగా నాచురల్ స్టార్ నాని విచ్చేశారు.
ఆ ఒక్కటి అడక్కు సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇటీవల ఏప్రిల్ 22న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యాచురల్ స్టార్ నాని మూవీ ట్రైలర్ ను లాంచ్ చేశారు. దీంతో ప్రస్తుతం సినిమా ట్రైలర్ కు కూడా మంచి స్పందన లభిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ….ఈ వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. అల్లరి నరేష్ సాధారణంగా ఇలాంటి వేడుకలకు నన్ను ఆహ్వానించడని , ఆహ్వానించాడు అంటే ఈ సినిమా అతనికి ఎంత బాగా నచ్చిందో అర్థం అవుతుందని తెలిపారు. నరేష్ నాన్నగారు డైరెక్ట్ చేసిన టైటిల్ “ఆ ఒక్కటి అడక్కు” మళ్లీ ఇప్పుడు వాడటం స్పెషల్ కనెక్షన్ ఉందని నాని అన్నారు. నరేష్ అద్భుతమైన నటుడు బ్యాక్ టూ బ్యాక్ కామెడీ సినిమాలు చేస్తున్న సమయంలో అలాంటి సినిమాలకు కాస్త బ్రేక్ ఇవ్వమని నేనే చెప్పాను. కానీ ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఇన్ని రోజులు నరేష్ కామెడీ మిస్ అయ్యానని అనిపించింది. ఈ సినిమాలో ఉన్న పెళ్లి కంటెంట్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు సినిమాని కుటుంబ సమేతంగా వెళ్లి చూడాల్సిందిగా నాని కోరారు.
Faria Abdullah : ఆ ఒక్కటి అడక్కు”ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రెచ్చిపోయిన ఫరీయా అబ్దుల్లా…!
ఇది ఇలా ఉండగా ఈ సినిమాను మే 3న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి థియేటర్ హక్కులను టాలీవుడ్ బిగ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్ఎల్ పి సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ , ఫరీయా అబ్దుల్లా తో పాటు వెన్నెల కిషోర్ , జామీ లివర్ , వైవా హర్ష , అరియానా గ్లోరీ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.
ఇక ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ జానీ లివర్ కూతురు జామీ లివర్ కూడా నటిస్తున్నారు. అలాగే బిగ్ బాస్ బ్యూటీ నిత్యం సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలతో పుర్రకారులకు మత్తెక్కించే అరియానా గ్లోరీ కూడా నటిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోలతో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తుందో వేచి చూడాలి.
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
This website uses cookies.