Faria Abdullah : ఆ ఒక్కటి అడక్కు”ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రెచ్చిపోయిన ఫరీయా అబ్దుల్లా…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Faria Abdullah : ఆ ఒక్కటి అడక్కు”ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రెచ్చిపోయిన ఫరీయా అబ్దుల్లా…!

Faria Abdullah : చాలా సంవత్సరాల తర్వాత అల్లరి నరేష్ మళ్లీ ఓ కామెడీ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. “ఆ ఒక్కటి అడక్కు” అనే కామెడీ సినిమా ద్వారా అల్లరి నరేష్ ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ఈ సినిమాలో జాతి రత్నాలు హీరోయిన్ ఫరీయా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్ ను ఆడియన్స్ ముందుకు తీసుకురాగా మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఇటీవల ట్రైలర్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :23 April 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Faria Abdullah : ఆ ఒక్కటి అడక్కు"ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రెచ్చిపోయిన ఫరీయా అబ్దుల్లా...!

Faria Abdullah : చాలా సంవత్సరాల తర్వాత అల్లరి నరేష్ మళ్లీ ఓ కామెడీ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. “ఆ ఒక్కటి అడక్కు” అనే కామెడీ సినిమా ద్వారా అల్లరి నరేష్ ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ఈ సినిమాలో జాతి రత్నాలు హీరోయిన్ ఫరీయా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్ ను ఆడియన్స్ ముందుకు తీసుకురాగా మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఇటీవల ట్రైలర్ ను కూడా మూవీ టీమ్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రానికి ముఖ్య అతిథిగా నాచురల్ స్టార్ నాని విచ్చేశారు.

Faria Abdullah : టైలర్ విడుదల చేసిన నాచురల్ స్టార్ నాని…

ఆ ఒక్కటి అడక్కు సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇటీవల ఏప్రిల్ 22న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యాచురల్ స్టార్ నాని మూవీ ట్రైలర్ ను లాంచ్ చేశారు. దీంతో ప్రస్తుతం సినిమా ట్రైలర్ కు కూడా మంచి స్పందన లభిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ….ఈ వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. అల్లరి నరేష్ సాధారణంగా ఇలాంటి వేడుకలకు నన్ను ఆహ్వానించడని , ఆహ్వానించాడు అంటే ఈ సినిమా అతనికి ఎంత బాగా నచ్చిందో అర్థం అవుతుందని తెలిపారు. నరేష్ నాన్నగారు డైరెక్ట్ చేసిన టైటిల్ “ఆ ఒక్కటి అడక్కు” మళ్లీ ఇప్పుడు వాడటం స్పెషల్ కనెక్షన్ ఉందని నాని అన్నారు. నరేష్ అద్భుతమైన నటుడు బ్యాక్ టూ బ్యాక్ కామెడీ సినిమాలు చేస్తున్న సమయంలో అలాంటి సినిమాలకు కాస్త బ్రేక్ ఇవ్వమని నేనే చెప్పాను. కానీ ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఇన్ని రోజులు నరేష్ కామెడీ మిస్ అయ్యానని అనిపించింది. ఈ సినిమాలో ఉన్న పెళ్లి కంటెంట్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు సినిమాని కుటుంబ సమేతంగా వెళ్లి చూడాల్సిందిగా నాని కోరారు.

Faria Abdullah ఆ ఒక్కటి అడక్కుట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రెచ్చిపోయిన ఫరీయా అబ్దుల్లా

Faria Abdullah : ఆ ఒక్కటి అడక్కు”ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రెచ్చిపోయిన ఫరీయా అబ్దుల్లా…!

Faria Abdullah : మే 3న గ్రాండ్ రిలీజ్…

ఇది ఇలా ఉండగా ఈ సినిమాను మే 3న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి థియేటర్ హక్కులను టాలీవుడ్ బిగ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్ఎల్ పి సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ , ఫరీయా అబ్దుల్లా తో పాటు వెన్నెల కిషోర్ , జామీ లివర్ , వైవా హర్ష , అరియానా గ్లోరీ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.

Faria Abdullah : బోల్డ్ బ్యూటీ అరియానా, బాలీవుడ్ బ్యూటీ జామీ లివర్…

ఇక ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ జానీ లివర్ కూతురు జామీ లివర్ కూడా నటిస్తున్నారు. అలాగే బిగ్ బాస్ బ్యూటీ నిత్యం సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలతో పుర్రకారులకు మత్తెక్కించే అరియానా గ్లోరీ కూడా నటిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోలతో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తుందో వేచి చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది