Home » Entertainment » Faria Abdullah Has It Become A Carafe Address
Entertainment

Faria Abdullah : అందుకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందా..?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 10, 2022, 3:30 pm
Advertisement

Faria Abdullah : మన భాషలోనే కాక తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలోనూ బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచే ఐటెం సాంగ్స్ కి మంచి క్రేజ్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో జయమాలిని, జ్యోతిలక్ష్మీ, ఆ తర్వాత సిల్క్ స్మిత..ఇలా హీరోయిన్స్ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న తారలు అన్నీ భాషలలో చాలామందే ఉన్నారు. ఇక ఐటెం సాంగ్ చేసేది మూడు లేదా నాలుగు రోజులే అయినా కూడా తారలు అందుకునే రెమ్యునరేషన్ కూడా భారీగా ఉంటుంది. అయితే, ఇటీవల కాలంలో ఐటెం సాంగ్ అనేది స్టార్ హీరోయిన్స్‌తోనే చేయిస్తున్నారు మన మేకర్స్.

Advertisement

ఒక స్టార్ హీరోయిన్ గనక సినిమాలో ఐటెం సాంగ్ చేస్తే కొన్ని ఎక్స్ట్రా టికెట్స్ తెగుతాయనేది మేకర్స్ ప్లాన్. అందుకే, భారీ చిత్రాలలో నటిస్తున్న వారిని అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ఓ ఐటెం సాంగ్ చేయమని ఒప్పిస్తున్నారు. హీరోయిన్స్ కూడా డేట్స్ ఖాళీ లేవు అంటూనే వయ్యారాలు పోతూ
మంచి రెమ్యునరేషన్ డిమాండ్ చేసి ఐటెం సాంగ్స్ చేస్తున్నారు. సమంత, పూజా హెగ్డే, తమన్నా, కాజల్ అగర్వాల్ సహా ఇటీవల కాలంలో హీరోయిన్ గా పరిచయమైన పాయల్ రాజ్ పుత్ లాంటి గ్లామర్ బ్యూటీలు ఐటెం సాంగ్స్ కి రెడీ అవుతున్నారు. ఇక కొందరు హీరోయిన్ అని ఫీలవుతున్నా కూడా ప్రేక్షకులు, మేకర్స్ వారిలో మాత్రం ఐటెం బాంబునే చూస్తున్నారు. ఇలా ఇప్పుడు మేకర్స్‌కి జాతిరత్నం బ్యూటీ ఫరియా అభ్దుల్లా కనిపిస్తోంది.

Faria Abdullah Has it become a carafe address

Advertisement

Faria Abdullah : హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది.

జాతిరత్నం సినిమాలో చిట్టిగా నటించి యువతను బాగా ఆకట్టుకున్న ఫరియా అద్భుల్లా..ఆ తర్వాత మాత్రం హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది. కానీ, అమ్మడికి ఐటెం సాంగ్స్ చేసే అవకాశం మాత్రం బాగానే వస్తుంది. ఇప్పటికే, అక్కినేని నాగ చైతన్య, నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో ఐటెం సాంగ్ చేసి క్రేజ్ తెచ్చుకున్న ఫరియా అబ్దుల్లా ఇప్పుడు మరో సారి అక్కినేని హీరో అఖిల్ సరసన ఐటెం చేయడానికి ఒప్పుకుందట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఏజెంట్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మాస్ ఆడియన్స్‌ను అలరించే ఓ ఐటెం సాంగ్ ఉందట. దీనికి ఫరియా అయితే కరెక్ట అని మేకర్స్ ఫిక్సై ఆమెను తీసుకున్నారట. దాంతో నెటిజన్స్ ఫరియా హీరోయిన్ గా కంటే ఐటెం సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని చెప్పుకుంటున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి