Health Benefits : మన శరీరానికి రోగ నిరోధక శక్తి చాలా అవసరం. రోగనిరోధకశక్తి లేకపోతే మన శరీరం అనేక రోగాలు బారిన పడుతుంది. ఈ ఇమ్యూనిటీ పవర్ హానికరమైన బ్యాక్టీరియాలు, ఇన్స్పెక్షన్ నుంచి మన శరీరాన్ని కాపాడుతాయి. కానీ కొంతమందిలో నిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. దీనివలన వారు అనేక రోగాల బారిన పడతారు. ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండాలంటే మేము పరిచయం చేయబోయే ఈ డ్రింక్ ను కనుక తాగినట్లయితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే కొన్ని వ్యాధులకు చికిత్స చేయడం కష్టమే. అలాగే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు వర్షాకాలం మొదలైంది. ఇంకా దగ్గు, జలుబు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటి నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే మన శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి.
అయితే ఇప్పుడు ఆ డ్రింక్ ను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మూడు మిరియాలను వేసుకోవాలి. తర్వాత అందులో 5,6 తులసి ఆకులను వేయాలి. అలాగే మూడు లవంగాలను వేసుకోవాలి. ఆ తర్వాత తిప్పతీగ కాడను రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత అర టి స్పూన్ శొంఠిపొడి, ఒక స్ఫూన్ సోంపు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒకటిన్నర గ్లాస్ నీటిని పోసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించడం వలన మనం వేసుకున్న వాటి అన్ని పోషకాలు నీటిలోకి దిగుతాయి. ఇలా మీరు మరిగించిన కాసేపటికి తిప్పతీగ ఆకులను వేసి బాగా మరగనివ్వాలి. ఇలా బాగా మరిగించిన నీళ్లలో కొద్దిగా బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. డయాబెటిస్ సమస్య ఉన్నవారు బెల్లంను వేసుకోకుండా ఉండటం మంచిది.
బెల్లం వేసుకున్న తర్వాత ఆ నీళ్లను సగం అయ్యేవరకు మరిగించుకోవాలి. అప్పుడు ఇది కషాయం లాగా తయారవుతుంది. తర్వాత ఆ నీళ్లను ఒక గ్లాసులోకి వడ కొట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున తాగాలి. అలాగే సాయంత్రం భోజనం చేయకముందు తాగాలి. ఇలా తాగడం వలన మంచి ఫలితం దక్కుతుంది. ఈ కషాయంలో ఉపయోగించినవన్ని సాధారణంగా మన ఇంట్లో ఉండేటివి. ఈ డ్రింకును కనుక ప్రతిరోజు తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇందులో వినియోగించిన బెల్లం కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ డ్రింకు మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తుంది. ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే దగ్గు, జలుబు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.