Fathima sana shake : దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ కరోనా కారణంగా నేను నిరుద్యోగినయ్యానంటోంది. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది దాదాపు 8 నెలలు సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీస్‌తో పాటు అన్నీ ఇండస్ట్రీలు నడవక నిరుద్యోగులయ్యారు. చేతిలో పనిలేక తిండి దొరకక రకరకాల ఇబ్బందులు ఎదుర్కున్న వారు లెక్కకు మించే ఉన్నారు. వారిలో సామాన్యుల నుంచి సినీ తారల వరకు సంపాదన లేక అవస్థలు పడిన సంగతి తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ నుంచి కాస్త పరిస్థితులు అదుపులోకి వచ్చి మళ్ళీ షూటింగ్స్ మొదలై..అందరికీ మళ్ళీ ఉపాది లభించింది. హమ్మాయ్యా అనుకునే లోపే మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ అంటూ ఉధృతి మొదలై గత ఏడాది కంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
దేశంలో అంతటా లాక్ డౌన్ విధించడంతో మళ్ళీ గత మూడు నాలుగు నెలలుగా ఉపాది కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారెందరో. ఈ నేపథ్యంలో అటు సౌత్ ఇటు నార్త్ సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులందరు సినీ కార్మీకులను..కోవిడ్ బారిన పడుతున్న వారిని..ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఆక్సిజన్ ప్లాంట్స్ ఊరూరా ఏర్పాటు చేస్తున్నారు. ఉపాది కలిపించే అన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోని నటీ, నటులు ఇతర 24 విభాగాలకు చెందిన కార్మీకులు..టెక్నీషియన్స్ చాలా ఇబ్బందులు ఎదురుకొంటున్న సంగతి తెలిసిందే.
వారిలో నేను కూడా ఉన్నాని వాపోతోంది యంగ్ హీరోయిన్ దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్. అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాలో కూడా నటించింది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వరుసగా సినిమాలు చేయలేకపోతోంది. చేస్తున్నదే తక్కువ సినిమాలు. వాటికి కరోనా అడ్డుకట్ట వేసిందని గత ఏడాదిగా సరిగ్గా పనిలేక ఇబ్బందులు పడుతున్నాని తాజాగా తెలిపింది. ఈమె చేతిలో ప్రస్తుతం రెండు మూడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.