Conductor Jhansi – Nellore Kavitha : కండక్టర్ ఝాన్సీ నెల్లూరు కవిత మధ్య గొడవ ఎందుకు వచ్చిందంటే.. అసలు నిజం బయట పెట్టిన నెల్లూరి కవిత.. వీడియో
Conductor Jhansi – Nellore Kavitha : “గాజువాక బస్ కండక్టర్ ఝాన్సీ” మరియు “నెల్లూరు కవిత” వీరిద్దరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పల్సర్ బైక్ అనే పాట కు మాస్ డాన్స్ చేసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న , యువతను ఒక ఊపు ఉపేసింది గాజువాక కండక్టర్ ఝాన్సీ. టెలివిజన్లో తన మొదటి పెరఫార్మెన్స్ తో అందరిని ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత నెల్లూరు కవిత వెలుగులోకి వచ్చింది. అప్పటివరకు ఝాన్సీ ని మెచ్చుకున్న జనం నెల్లూరు కవిత పర్ఫామెన్స్ కి ఫిదా అయిపోయారు.
రావడం రావడంతోనే అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ తో అదరగొట్టింది నెల్లూరు కవిత.ఇక ఈ మధ్యన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఝాన్సీ కి మరియు నెల్లూరు కవితకు మధ్య డాన్స్ పోటీ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఆ షోలో నెల్లూరు కవిత ఝాన్సీని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేసింది. ఝాన్సీ కంటే మంచి డాన్సర్స్ చాలామంది ఉన్నారని, ఇప్పుడు నా సత్తా ఏంటో చూపించడానికి వచ్చానని , తనకంటే ఇంకా బాగా డాన్స్ చేసి ప్రూవ్ చేస్తానని చాలెంజ్ విసిరింది. దీంతో ఇరువురి మధ్య గొడవ మొదలైందని సోషల్ మీడియా లో ఓ టాక్ నడిచింది.అయితే ఇప్పుడు ఈ గొడవ పైన నెల్లూరు కవిత క్లారిటీ ఇచ్చారు.
Fight between Nellore Kavitha and Conductor Jhansi
ఆ రోజు ఝాన్సీ ని ఉద్దేశించి అలా అనడం, స్టేజ్ పైన చాలెంజ్ చేయడం అనేది, ఆ షోలోని భాగమే అని నెల్లూరు కవిత వెల్లడించారు. అవి అన్ని ప్రోగ్రాంలో భాగంగా చేసిన మాటలే ,కానీ వ్యక్తిగతంగా మా మధ్య ఎలాంటి గొడవలు లేదని స్పష్టం చేశారు. షో అయిపోయిన తర్వాత నుంచి మేము చాలా బాగా ఉంటున్నామని తెలిపారు. అలాగే వైజాగ్ లో 20 ఈవెంట్స్ జరిగితే అందులో కచ్చితంగా 10 ఈవెంట్స్ ఝాన్సీ అక్క నేను కలిసే చేస్తామని కవిత స్పష్టం చేశారు.
