రెడ్ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల మూందుకు వచ్చిన సంగతి రెలిసిందే. రెడ్ సినిమాలో ఎనర్జిటిక్ హీరో రాం పోతినేని డ్యూయల్ రోల్ లో నటించాడు. కంప్లీట్ మాస్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన రెడ్ సినిమాలో మాళవిక శర్మ, నివేతా పేతురాజ్, అమృత అయ్యర్ హీరోయిన్స్ గా నటించగా హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్ ల్లో అందాలను ఆరబోసింది. ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ కమర్షియల్ హిట్ తర్వాత వచ్చిన రెడ్ సినిమా మీద ప్రేక్షకుల్లో .. ఇండస్ట్రీ వర్గాలలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
రాం కూడా ఈ సినిమా మీద చాలా అంచనాలు పెట్టుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ హిట్ మళ్ళీ రిపీటవుతుందని ఎంతో నమ్మకంగా ఉన్నాడు. అందుకే ప్రముఖ ఓటీటీ ల నుంచి మంచి ఫ్యాన్సీ ఆఫర్ వచ్చినా ససేమిరా అని రెడ్ సినిమాని థియేటర్స్ వరకు తీసుకు వచ్చాడు. కాని రాం కి రెడ్ సినిమా షాకిచ్చిందని చెప్పుకుంటున్నారు. సంక్రాంతి బరిలో భారీ అంచనాల మధ్య రిలీజైన రెడ్ సినిమాకి ఫస్ట్ షో నుంచే డివైడ్ టాక్ వచ్చింది. మొత్తానికి డే వన్ అయ్యేసరికి రెడ్ సినిమా మీద కాస్త నెగిటివ్ టాక్ కొనసాగింది.
కాని ఇక్కడ సంతోషపడాల్సిన విషయం ఏమిటంటే రెడ్ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికి వసూళ్ళు బావున్నాయట. 50 పర్సెంట్ ఆక్యూపెనీ లో కూడా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టిందని చెప్పుకుంటున్నారు. వీకెండ్ కాబట్టి ఈ రెండు రోజులు కూడా రాం రెడ్ సినిమాకి మచి వసూళ్ళు దక్కుతాయని ట్రెడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. మరీ డిజాస్టర్ అన్న టాక్ లేకపోవడం రెడ్ సినిమాకి బాగా కలిసొచ్చే అంశం. చూడాలి మరి లాంగ్ రన్ ఈ సినిమా వసూళ్ళు ఏవిధంగా ఉంటాయో. ఇక ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా తమిళ హిట్ సినిమా తడం కి అఫీషియల్ రీమేక్ గా స్రవంతి రవికిషొర్ నిర్మించాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.