full fire on bigg boss ott
Bigg Boss OTT : బిగ్ బాస్ ఓటీటీ షో మరింత హీటెక్కిస్తుంది. ఈ షోలో పచ్చి బూతులు ఒకరిపై ఒకరు అరుచుకోవడాలు మాములుగా లేవు. ఇక ఇప్పుడు తన్నుకోవడాలు కూడా జరుగుతున్నాయి. తొలివారం కెప్టెన్ పోటీదారుల మధ్య టాస్క్ ఘర్షణలకు దారితీసింది. వారియర్స్, ఛాలెంజర్స్ అంటూ బిగ్ బాస్ హౌస్‌ను రెండు గ్రూపులుగా విడగొట్టారు. అయితే తొలివారం కెప్టెన్ పోటీదారుల టాస్క్‌లో భాగంగా జరిగిన స్టిక్కర్స్ టాస్క్‌లో వారియర్స్ టీంకి ముమైత్ ఖాన్ సంచాలకురాలుగా ఉంటే.. వారియర్స్ టీంకి యాంకర్ శివని సంచాలకులుగా పెట్టారు.
వారియర్స్ టీంలో ఉన్న నటరాజ్ మాస్టర్ స్టిక్కర్స్ తనకి అంటించకుండా తప్పించుకునే ప్రయత్నంలో బిందు మాధవి, శ్రీరాపాకలపై ఫిజికల్ ఎటాక్ చేయడం గొడవకు దారితీసింది. ఇక కెప్టెన్సీ టాస్క్‌లో అఖిల్, బిందు మాధవికి మధ్య పెద్ద ఫైటే జరిగింది. తాను ఫిజికల్ అయితే మామూలుగా ఉండదంటూ హీరోయిన్‌కు వార్నింగ్ ఇచ్చాడు అఖిల్. మరో పక్క నటరాజ్ మాస్టర్, యాంకర్ శివ దాదాపు కొట్టుకున్నంత పని చేశారు. రా అన్నావంటే తోలు తీస్తా, ఏం పీకుతావో చూస్తా అంటూ యాంకర్ శివ పైపైకి వెళ్లాడు మాస్టర్. దీంతో మిగతా హౌస్‌మేట్స్ వారిని కూల్ చేసేందుకు చాలానే ప్రయత్నించారు. ఫైనల్‌గా మహేశ్, తేజస్వి, నటరాజ్, సరయు మొదటి వారం కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు.
full fire on bigg boss ott
మరోవైపు నో ఫిల్టర్’ హమీదా లవ్ ట్రాక్ గురించి ప్రశ్నలు రావడంతో ఆమె దీనిపై తొలిసారి స్పందించింది. ఈ మేరకు ‘నేను లవ్ ట్రాక్ నడుపుతున్నానో లేదో తెలీదు. కానీ, కనెక్షన్ అయితే ఒకరితో ఉంది. అది ఎవరో మీ అందరికీ తెలుసు. మా వరకూ అయితే ఇద్దరం ఫ్రెండ్స్‌గా ఉంటున్నాము. అంతకు మించి ఏమీ లేదని చెప్పగలను’ అంటూ ఈ బ్యూటీ క్లారిటీ ఇచ్చేసింది. తాను కనెక్షన్ అయిన పర్సన్ ఎవరో అందరికీ తెలుసు అని హమీదా అన్న తర్వాత.. సరయు రాయ్ సహా పలువురు ఆ వ్యక్తి ఎవరో చెప్పాలంటూ గొడవ చేశారు. కానీ, ఆమె మాత్రం పేరు చెప్పడానికి నిరాకరించింది. ఆ తర్వాత పేరు చెప్పమని అనడంతో సరయుపై ఆమె ఫైర్ అయింది. క్లోజ్ ఫ్రెండ్ అయి ఉండి ఇలా అందరి ముందు అడగడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
This website uses cookies.