Bigg Boss OTT : హీట‌కెక్కిపోతున్న బిగ్ బాస్.. త‌న్నుకున్న యాంకర్ శివ, నటరాజ్ మాస్టర్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss OTT : హీట‌కెక్కిపోతున్న బిగ్ బాస్.. త‌న్నుకున్న యాంకర్ శివ, నటరాజ్ మాస్టర్ !

Bigg Boss OTT : బిగ్ బాస్ ఓటీటీ షో మ‌రింత హీటెక్కిస్తుంది. ఈ షోలో ప‌చ్చి బూతులు ఒక‌రిపై ఒక‌రు అరుచుకోవ‌డాలు మాములుగా లేవు. ఇక ఇప్పుడు త‌న్నుకోవ‌డాలు కూడా జ‌రుగుతున్నాయి. తొలివారం కెప్టెన్ పోటీదారుల మధ్య టాస్క్ ఘర్షణలకు దారితీసింది. వారియర్స్, ఛాలెంజర్స్ అంటూ బిగ్ బాస్ హౌస్‌ను రెండు గ్రూపులుగా విడగొట్టారు. అయితే తొలివారం కెప్టెన్ పోటీదారుల టాస్క్‌లో భాగంగా జరిగిన స్టిక్కర్స్ టాస్క్‌లో వారియర్స్ టీంకి ముమైత్ ఖాన్ సంచాలకురాలుగా ఉంటే.. […]

 Authored By sandeep | The Telugu News | Updated on :3 March 2022,7:40 am

Bigg Boss OTT : బిగ్ బాస్ ఓటీటీ షో మ‌రింత హీటెక్కిస్తుంది. ఈ షోలో ప‌చ్చి బూతులు ఒక‌రిపై ఒక‌రు అరుచుకోవ‌డాలు మాములుగా లేవు. ఇక ఇప్పుడు త‌న్నుకోవ‌డాలు కూడా జ‌రుగుతున్నాయి. తొలివారం కెప్టెన్ పోటీదారుల మధ్య టాస్క్ ఘర్షణలకు దారితీసింది. వారియర్స్, ఛాలెంజర్స్ అంటూ బిగ్ బాస్ హౌస్‌ను రెండు గ్రూపులుగా విడగొట్టారు. అయితే తొలివారం కెప్టెన్ పోటీదారుల టాస్క్‌లో భాగంగా జరిగిన స్టిక్కర్స్ టాస్క్‌లో వారియర్స్ టీంకి ముమైత్ ఖాన్ సంచాలకురాలుగా ఉంటే.. వారియర్స్ టీంకి యాంకర్ శివని సంచాలకులుగా పెట్టారు.

వారియర్స్ టీంలో ఉన్న నటరాజ్ మాస్టర్‌ స్టిక్కర్స్ తనకి అంటించకుండా తప్పించుకునే ప్రయత్నంలో బిందు మాధవి, శ్రీరాపాకలపై ఫిజికల్ ఎటాక్ చేయడం గొడవకు దారితీసింది. ఇక కెప్టెన్సీ టాస్క్‌లో అఖిల్‌, బిందు మాధవికి మధ్య పెద్ద ఫైటే జరిగింది. తాను ఫిజికల్‌ అయితే మామూలుగా ఉండదంటూ హీరోయిన్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు అఖిల్‌. మరో పక్క నటరాజ్‌ మాస్టర్‌, యాంకర్‌ శివ దాదాపు కొట్టుకున్నంత పని చేశారు. రా అన్నావంటే తోలు తీస్తా, ఏం పీకుతావో చూస్తా అంటూ యాంకర్‌ శివ పైపైకి వెళ్లాడు మాస్టర్‌. దీంతో మిగతా హౌస్‌మేట్స్‌ వారిని కూల్‌ చేసేందుకు చాలానే ప్రయత్నించారు. ఫైనల్‌గా మహేశ్‌, తేజస్వి, నటరాజ్‌, సరయు మొదటి వారం కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు.

full fire on bigg boss ott

full fire on bigg boss ott

మ‌రోవైపు నో ఫిల్టర్’ హమీదా లవ్ ట్రాక్ గురించి ప్రశ్నలు రావడంతో ఆమె దీనిపై తొలిసారి స్పందించింది. ఈ మేరకు ‘నేను లవ్ ట్రాక్ నడుపుతున్నానో లేదో తెలీదు. కానీ, కనెక్షన్ అయితే ఒకరితో ఉంది. అది ఎవరో మీ అందరికీ తెలుసు. మా వరకూ అయితే ఇద్దరం ఫ్రెండ్స్‌గా ఉంటున్నాము. అంతకు మించి ఏమీ లేదని చెప్పగలను’ అంటూ ఈ బ్యూటీ క్లారిటీ ఇచ్చేసింది. తాను కనెక్షన్‌ అయిన పర్సన్ ఎవరో అందరికీ తెలుసు అని హమీదా అన్న తర్వాత.. సరయు రాయ్ సహా పలువురు ఆ వ్యక్తి ఎవరో చెప్పాలంటూ గొడవ చేశారు. కానీ, ఆమె మాత్రం పేరు చెప్పడానికి నిరాకరించింది. ఆ తర్వాత పేరు చెప్పమని అనడంతో సరయుపై ఆమె ఫైర్ అయింది. క్లోజ్ ఫ్రెండ్ అయి ఉండి ఇలా అందరి ముందు అడగడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది