Home » Entertainment » Galata Geetu In Jain For Bigg Boss 6 Telugu First Week
Entertainment

Bigg Boss 6 Telugu : గలాట గీతూకి తగిన శాస్తి జరిగింది.. జైల్లో పడ్డ ‘అతి బిడ్డ’

Authored By
aruna
The Telugu News | Published on: September 9, 2022, 6:30 pm
Advertisement

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ ఇంట్లో గత మూడు నాలుగు రోజులుగా ఓ కంటెస్టెంట్ తెగ అతి, హడావిడి చేస్తోంది. ఆమె నోటికి అదుపు లేకుండా పోతోంది. ఎంతొస్తే అంత మాట్లాడేస్తుంది. పనులు మాత్రం ఏమీ చేసినట్టుగా కూడా కనిపించడం లేదు. పెత్తనం చెలాయించడానికి మాత్రం ముందుకు వస్తోంది. ఆమె మరెవరో కాదు గలాట గీతూ. బిగ్ బాస్ షో అంటే.. మాటలు చెప్పినట్టుగా, రివ్యూలు ఇచ్చినంత ఈజీగా అనుకుందేమో. కానీ ఇప్పుడు గీతూకి దారుణమైన ఇమేజ్ వచ్చింది. గలాట గీతూ బిగ్ బాస్ రివ్యూలు చెబుతూ ఫేమస్ అయింది.

Advertisement

తన చిత్తూర స్లాంగ్, యాసలో మాట్లాడుతూ అంతో ఇంతో ఫేమస్ అయింది. బుల్లితెరపై జబర్దస్త్ వేదిక మీద కూడా కొన్ని స్కిట్లలో కనిపించింది. కానీ ఎప్పుడూ ఒకే స్లాంగ్‌తో మాట్లాడుతాను అంటూ కుదరదు కదా. అందుకే ఆమెను అక్కడ ఎక్కువ రోజులు ఉంచుకోలేదు. మొత్తానికి బిగ్ బాస్ ఇంట్లోకి గలాట గీతూ వచ్చేసింది. వచ్చిన క్షణం నుంచి గీతూ నానా హంగామా చేసింది. అతికి అంబాసిడర్ అయిపోయింది. తనకు తానే అతి బిడ్డ అని కూడా చెప్పేసుకుంది. ఈ అతి బిడ్డ అతిని చూడలేక జనాలు చస్తున్నారు. ఇంట్లో కంటెస్టెంట్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Galata Geetu in Jain For Bigg Boss 6 Telugu First Week

Advertisement

గీతూ అతికి అందరూ ఇబ్బంది పడుతున్నారు. అన్నింట్లోకి దూరిపోవాలని బాగానే ట్రై చేస్తోంది. అన్ని కెమెరాల్లోనూ తానే కనిపించాని ఆరాట పడుతోంది. వరెస్ట్ కంటెస్టెంట్‌ను జైల్లోకి పంపించడం ఆనవాయితే. ఈ సారి మొదటి కెప్టెన్‌గా బాలాదిత్య గెలిచాడట. గీతూని అందరూ వరస్ట్ కంటెస్టెంట్ అని చెప్పి జైల్లో పడేశాడట. మొత్తానికి ఓ పీడ పోయిందని జనాలు కూడా అనుకుంటున్నారు. ఆమెను ఇంట్లోంచి ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ చేసేద్దామా? అని జనాలు రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి