Game Changer AP Ticket Rates : గేమ్ ఛేంజర్ మూవీ టిక్కెట్ రేట్లు పెంపు..పుష్ప2 కన్నా తక్కువేగా..!
ప్రధానాంశాలు:
Game Changer : గేమ్ ఛేంజర్ మూవీ టిక్కెట్ రేట్లు పెంపు..పుష్ప2 కన్నా తక్కువేగా..!
Game Changer AP Ticket Rates : ఏపీలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ Game Changer Review చిత్రంకి గుడ్ న్యూస్ అందింది. బెనిఫిట్ షోకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లను పెంపుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర హోంశాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం రాత్రి ఒంటిగంట బెనిఫిట్ షో టికెట్ ధర 600 రూపాయలుగా నిర్ణయించారు. జనవరి 10 నుంచి జనవరి 23 వరకు రోజుకు ఐదు షోల చొప్పున వేసుకునేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఆ మేరకు వీటి టికెట్ రేట్లను కూడా ఖరారు చేసింది.
తక్కువ రేట్లతో..
రిలీజ్ రోజు జనవరి 10న ఆరు షోలకు అనుమతి ఇచ్చారు. అదే రోజు ఉదయం 4 గంటలకు ప్రత్యేక షో నిర్వహించేందుకు కూడా అనుమతి ఇచ్చారు. జనవరి 10వ తేదీ నుంచి 23 తేదీ వరకు మల్టిప్లెక్స్ లలో అదనంగా 175 రూపాయలు, సింగిల్ థియేటర్లలో 135 రూపాయలు పెంచుకునేలా, అలాగే ఈ రెండు వారాలు అయిదు షోలకు కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ లెక్కన జనవరి 10న ఉదయం 1 గంట షోకు 600 రూపాయలు టికెట్ ధర, రెండు వారాల పాటు మల్టీ ఫ్లెక్స్ లో 352 రూపాయలు, సింగిల్ థియేటర్స్ లో 282 రూపాయలు ఉండనుంది టికెట్ ధర. ఆ తర్వాత మళ్ళీ మాములు రేట్లే ఉండనున్నవి.అయితే అల్లు అర్జున్ పుష్ప సినిమా కంటే తక్కువే పెంచారు. అల్లు అర్జున్ పుష్ప సినిమాకు బెనిఫిట్ షోకు 800 వరకు పెంచుకునేలా, సింగిల్ స్క్రీన్స్ లో 150, మల్టిప్లెక్స్ లో 200 రూపాయలు పెంచుకునేలా అనుమతులిచ్చారు.