Bheemla Nayak : అల్లు అరవింద్ పై కోపంతో భీమ్లా నాయక్ రిలీజ్.. బుద్ది ఏమైన గడ్డి తిన్నదా?
Bheemla Nayak : పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఎన్నో ఊహాగానాల నడుమ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఈనెల 25 వ తారీకున విడుదలకు సిద్దం అయ్యింది. ఈ విషయమై చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరి 25 వ తారీఖున భీమ్లా నాయక్ ని విడుదల చేసే అవకాశం లేదని గని మరియు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ చివరి నిమిషంలో భీమ్లా నాయక్ రంగంలోకి దిగబోతున్న నేపథ్యంలో వరుణ్ తేజ్ సినిమా మరియు శర్వానంద్ సినిమాలు వాయిదా వేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.
ఈ సమయంలోనే కొందరు మీడియా వర్గాల వారు పుకార్లు పుట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా గని సినిమా పై పోటీ మరియు కోపం తోనే భీమ్లా నాయక్ ను పవన్ కళ్యాణ్ విడుదల చేస్తున్నాడు అంటూ పిచ్చి పుకార్లు పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. గని సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు కనుక పవన్ కళ్యాణ్ ఆయనకు పోటీగా తన భీమ్లా నాయక్ సినిమా విడుదల చేయబోతున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. బుద్ది గడ్డి తిన్నట్లుగా వారు చేస్తున్న ఈ వ్యాఖ్యలను మెగా అభిమానులు ఖండిస్తున్నారు. ఈ పుకార్లు కామెంట్స్ మరీ పిచ్చిగా, అర్థ రహితంగా ఉన్నాయని.. ఇలాంటి పుకార్లు పుట్టించే వాళ్ళ బుద్ధి గడ్డి తిన్నదా అంటూ మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. గని సినిమాలో నటించింది వరుణ్ తేజ్. పవన్ కళ్యాణ్ కి అత్యంత ఇష్టమైన వరుణ్ తేజ్ కు పోటీగా ఎలా వస్తాడు అంటూ మెగా అభిమానులు ఆ వ్యాఖ్యలు చేస్తున్న వారిని ప్రశ్నిస్తున్నారు.
భీమ్లా నాయక్ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది కనుక గని సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ తేదీకి ఇప్పుడు భీమ్లా నాయక్ తీసుకు రావాలని నిర్మాతలు భావించారు. అందులో పవన్ బాధ్యత ఏమీ లేదు. విడుదల విషయంలో పూర్తి నిర్ణయాధికారం నిర్మాతల కి పవన్ కళ్యాణ్ అప్పగిస్తాడు. కనుక గని సినిమాకు పోటీగా అల్లు అరవింద్ కు పోటీగా భీమ్లా నాయక్ అనేది పిచ్చి పుకారు అనడంలో సందేహం లేదు. బుద్ది లేని అడ్డ గాడిదలు మాత్రమే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ సినీ జనాలు మరియు మెగా అభిమానులు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరియు అల్లుఅరవింద్ మధ్య ఏదో తేడా ఉంది అని చూపించేందుకు కొందరు వైఎస్ వర్గీయులు ఇలా చేస్తున్నారని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.