Chiranjeevi : గరికపాటి Vs చిరంజీవి గొడవలు ఎగురుతున్న ప్రతి చిరంజీవి ఫ్యాన్ కు ఝలక్.. ఇక నోరెత్తరు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : గరికపాటి Vs చిరంజీవి గొడవలు ఎగురుతున్న ప్రతి చిరంజీవి ఫ్యాన్ కు ఝలక్.. ఇక నోరెత్తరు

 Authored By sandeep | The Telugu News | Updated on :9 October 2022,8:00 pm

Chiranjeevi : చిరంజీవి, గరికపాటి నరసింహారావు మధ్య జరిగిన వివాదం జరిగి రెండు రోజులవుతుంది.. ఇప్పటికీ సోషల్ మీడియాలో దీని గురించి చర్చ జరుగుతూనే ఉంది. అసలు దీని నుంచి ఏం నేర్చుకోవాలి.. ఇద్దరు పెద్ద మనుషుల మధ్య ఏదైనా ఒక వివాదం చెలరేగినప్పుడు దాన్ని ఎలా సద్దుమణిగేలా చేయాలి.. అసలు ఇక్కడ తప్పు ఎవరు చేశారు.. చిరంజీవి ఫ్యాన్స్ కు క్లాస్ తీసుకున్నది ఎవరు? ఇలాంటి విషయాల మీద సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతుంది ఇప్పుడు. దసరా పండుగ తర్వాత రోజు బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలాయ్ బలాయ్ కార్యక్రమంలో ఎంతో మంది వీఐపీలు, వీవీఐపీలు, సినీ ప్రముఖులు వచ్చారు. అందులోనే చిరంజీవి, గరికపాటి నరసింహా రావు కూడా ఉన్నారు.

తనను చూడడానికి వచ్చిన అభిమానులతో ఫోటోలు దిగుతున్న మెగాస్టార్ ను చూసి.. గరికపాటి నోరు పారేసుకున్నారు. ఆయన స్టేజి మీదకి వెంటనే వస్తే తప్ప.. నేను మాట్లాడను లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ గరికపాటి చేసిన వ్యాఖ్యలు చూసి అందరూ షాక్ అయ్యారు. తర్వాత దీని గురించి సోషల్ మీడియాలో కూడా చర్చ బాగానే జరిగింది. ఇందులో ఎవరిది తప్పు ఉంది అనే విషయంపై కూడా చాలామంది విశ్లేషించారు. అక్కడ జరిగిన పరిస్థితిని బట్టి చాలామంది గరికపాటి తప్పు చేశాడు అనే విషయం స్పష్టంగా చెప్పారు. అయితే చిరంజీవి మాత్రం గరికపాటికి స్టేజి మీద క్షమాపణ చెప్పి తన హుందా తనం చూపించుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారంలో ఇద్దరు పెద్ద మనుషుల మధ్య ఏదైనా విషయం చెలరేగినప్పుడు..

Garikapati Chiranjeevi issue topic now

Garikapati Chiranjeevi issue topic now

Chiranjeevi : అలాయ్ బలాయ్ అన్నింటికీ కారణం..

దాన్ని ఎలా సద్దుమనిగేలా చేయాలి అనేది చాలామందికి అర్థమైంది. ఎందుకంటే గరికపాటి కూడా చిరంజీవికి క్షమాపణ చెప్పినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇటు చిరంజీవి.. అటు గరికపాటి ఇద్దరూ ఎవరి రంగాల్లో వాళ్ళు నిష్ణాతులు. కాకపోతే చిరంజీవికి కాస్త ఎక్కువ క్రేజ్ ఉన్న మాట మాత్రం వాస్తవం. ఎంతైనా గరికపాటి కూడా మనిషి కాబట్టి ఏదో ఒక సమయంలో అసూయ కలగడం కామన్. మొన్న కూడా ఇదే జరిగింది. ఒక బ్యాడ్ మూడ్ లో ఉన్నప్పుడు ఆయన ఆవేశంలో ఒక మాట అన్నాడు. దాని మెగా ఫాన్స్ అంత పెద్ద విషయం చేయకపోయి ఉంటే అది అక్కడితోనే సద్దుమణిగేది అని కొందరు రివర్స్ లో మెగా ఫాన్స్ పైనే కౌంటర్స్ వేస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది