Sudigali Sudheer : జ‌బ‌ర్ధ‌స్త్‌లోకి మ‌ళ్లీ వ‌చ్చిన గెట‌ప్ శీను.. సుడిగాలి సుధీర్ కూడా రాబోతున్నాడా?

Authored By Sam C | The Telugu News | Published on: July 24, 2022, 8:30 pm

Sudigali Sudheer : గ‌త కొద్ది రోజులుగా జ‌బ‌ర్ధ‌స్త్ షోకి ఒక్కొక్క‌రు దూరం అవుతున్న సంగ‌తి తెలిసిందే. సుడిగాలి సుధీర్, గెట‌ప్ శీను, అన‌సూయ‌, చ‌మ్మ‌క్ చంద్ర ఇలా చాలా మంది షోకి గుడ్ బై చెప్పారు. ఒక్కొక్క‌రు జ‌బ‌ర్ధ‌స్త్ వీడుతున్న స‌మయంలో షోపై, మల్లెమాల సంస్థపై కమెడియన్ కిర్రాక్ ఆర్పీ చేసిన సంచలన కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. అయితే కిరాక్ ఆర్పీ ఆరోపణలను హైపర్ ఆది , రామ్ ప్రసాద్, షేకింగ్ శేషు ఖండించారు. ఆర్పీ చేసిన విమర్శల్లో నిజం లేదన్నారు. జబర్దస్త్ మాజీ మేనేజర్ ఏడుకొండలు అయితే తీవ్ర స్థాయిలో ఆర్పీపై విరుచుకుపడ్డాడు.

అన్నం పెట్టిన సంస్థను ఉద్దేశిస్తూ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆర్పీ ఒకప్పుడు నాతో మాట్లాడాలన్నా భయపడేవాడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డిని విమర్శించే స్థాయి వాడికి లేదన్నాడు. డైరెక్టర్ గా మారి నిర్మాతలను ఇబ్బందిపెట్టాడని, ఆ సినిమాకు నేనే మేనేజర్ అని ఏడుకొండలు వెల్లడించారు. ప‌నిలో ప‌నిగా సుడిగాలి సుధీర్, గెట‌ప్ శీనుల‌పై కూడా విమ‌ర్శ‌లు చేసాడు. సుడిగాలి సుధీర్ కి లైఫ్ ఇస్తే ఇప్పుడు కనీసం నా ఫోన్ ఎత్తడు అన్నాడు. అలాగే గెటప్ శ్రీను కారు కావాలంటే నా కారు ఇచ్చాను. గెటప్ శ్రీను, సుధీర్ వేరే ఛానల్ లో షో చేయలేరు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. సమయం వస్తే బయటపెడతా అంటూ ఏడుకొండ‌లు సంచల‌న కామెంట్స్ చేశారు.

Getup Srinu Re Entry To Sudheer Sudheer also coming Jabardasth

Getup Srinu Re Entry To Sudheer Sudheer also coming Jabardasth

Sudigali Sudheer : శీను సంద‌డి..

ఈ క్ర‌మంలో జులై 29న ప్రసారమయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో విడుదల కాగా గెటప్ శ్రీను షోలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. రామ్ ప్రసాద్ స్కిట్ జరుగుతుండగా గెటప్ శ్రీను సడన్ ఎంట్రీ ఇచ్చాడు. అతన్ని వేదికపై చూసిన కంటెస్టెంట్స్, జడ్జెజ్ ఆశ్చర్యానికి గురయ్యారు. శీను వ‌చ్చాడు కాబ‌ట్టి కొత్త స్కిట్ చేస్తానని రామ్ ప్రసాద్ అన్నాడు. జడ్జి ఇంద్రజ సైతం అర్జెంట్ గా గెటప్ శ్రీనుతో స్కిట్ సిద్ధం చేయమని రామ్ ప్రసాద్ ని కోరింది. అయితే గెట‌ప్ శీను ఎంట్రీ కేవ‌లం ఒక్క స్కిట్ కోస‌మేనా లేదంటే మిగ‌తా స్కిట్స్ లోను ఉంటాడా అన్న‌ది ప్ర‌స్తుతానికి సస్పెన్స్.ఇక త్వ‌ర‌లో సుడిగాలి సుధీర్ కూడా జ‌బ‌ర్ధ‌స్త్‌లోకి రాబోతున్న‌ట్టు ప్రచారం జ‌రుగుతుంది. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp