Guppedantha Manasu 1 Dec Today Episode : జగతిని తల్లిగా ఇంకా చూడని రిషి.. మహీంద్రా మీద ఉన్న ప్రేమ తప్పితే జగతి మీద ప్రేమ లేదా? ఈ విషయం వసుధారకు తెలుస్తుందా?

Guppedantha Manasu 1 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 01 డిసెంబర్ 2022, గురువారం ఎపిసోడ్ 622 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డాడ్ ఆనందం కోసమే మిమ్మల్ని ఇంటికి రమ్మని రిక్వెస్ట్ చేశాను అంటాడు రిషి. డాడ్ కోసం నేను ఏది చేయడానికైనా సిద్ధమే మేడమ్ అంటాడు. నేను ఏం చేసినా డాడ్ కళ్లలో సంతోషాన్నే చూడాలనుకుంటాను అంటాడు. అంతే కానీ ఇంకొకరి కోసమో ఇంకో బంధాన్ని కలుపుకోవడానికి మాత్రం కాదు. డాడ్ మీద ఉన్న నా ప్రేమను మీరు అర్థం చేసుకోండి. కొత్త అర్థాలు వెతుక్కోకండి అంటాడు. మీరంటే నాకు గౌరవం ఉంది. గౌరవమే ఉంది అంటాడు రిషి. రిషి.. నేనెప్పుడో ఈ ఇంటికి దూరం అయ్యాను. ఇంటికి మాత్రమే దూరం అయ్యాను. బంధాలకు కాదుగా అంటుంది జగతి. సంవత్సరాల కొద్దీ మహీంద్రాకు దూరం అయినా మా బంధం అలాగే ఉంది అంటుంది. దీంతో అందుకే కదా మిమ్మల్ని ఇంటికి రమ్మని కోరింది అంటాడు.

guppedantha manasu 01 december 2022 full episode

డాడ్ ముఖంలో కరువైన ఆ చిరునవ్వు మీరు వచ్చాక వచ్చింది. డాడ్ నా కళ్ల ముందు సంతోషంగా ఉండాలి. ఇంతకు మించి నేను ఏం కోరుకోవడం లేదు అంటాడు రిషి. దీంతో నేను కూడా జీవితంలో నువ్వు, వసుధార ఇద్దరూ సంతోషంగా అని చెప్పబోతుండగా వసుధార మీ మనిషి అని నేను కోరుకోలేదు. వసుధారను వసుధార గానే ప్రేమించాను అంటాడు రిషి. వసుధారను నువ్వు ప్రేమిస్తున్నావని.. నీకన్నా ముందు నీతో నేనే చెప్పాను రిషి. ఆ మాట గుర్తుందా అంటుంది జగతి. మేడమ్.. వసుధార జీవితాంతం నాకు తోడుగా ఉంటుంది. తను నాతో ప్రయాణం చేస్తుంది. ఇందులో ఎవరు ఏమన్నా.. చివరకు వసుధార ఏమన్నా తిరుగులేదు అంటాడు రిషి. కొందరిలా నేను ఏదీ మధ్యలో వదలను. ఎవ్వరినీ వదలను అంటాడు రిషి.

దీంతో రిషి ఒక్క మాట అడగనా. మహీంద్రా అంటే ప్రేమ అన్నావు. నేనంటే గౌరవం అన్నావు. అంటే.. ఎప్పటికీ జగతి మేడమ్ గానే గౌరవం అందుకోవాలా అని ప్రశ్నిస్తుంది జగతి. జీవితాంతం ఇలా మేడమ్ అన్న పిలుపుతోనే నేను సరిపెట్టుకోవాలా అంటుంది.

నాకు ఎప్పటికీ నీకు తల్లిగా ఉండే అర్హత దొరకదా అంటుంది జగతి. ఆ అర్హత నాకు ఎప్పటికీ రాదా రిషి అంటుంది జగతి. ఈ మేడమ్ మీ మేడమ్ అమ్మగా ఎప్పటికీ మారదా అంటుంది జగతి. దీంతో రిషి దగ్గర ఏ సమాధానం ఉండదు. ఏం మాట్లాడడు రిషి.

చెప్పు రిషి.. నేను ఆ పిలుపుకు నోచుకోలేనా అని అడుగుతుంది. ఇంతలో జ్యూస్ తీసుకొని వసుధార వస్తుంది. ఏంటి.. ఇద్దరూ సైలెంట్ గా ఉన్నారు అని అనుకుంటుంది వసుధార. తీసుకోండి మేడమ్ అంటుంది వసుధార. దీతో ఆ జ్యూస్ ను అక్కడ పెడుతుంది జగతి.

Guppedantha Manasu 1 Dec Today Episode : రిషి గురించి భయపడ్డ గౌతమ్

మేడమ్.. మీరిద్దరూ ఏంటి మౌనంగా ఉన్నారు అని అడుగుతుంది వసుధార. దీంతో మాటల కన్నా గొప్పగా ఒక్కోసారి మౌనమే మాట్లాడుతుంది వసు అంటుంది జగతి. వసుధార మేడమ్ గారికి ఏం కావాలో జాగ్రత్తగా చూసుకో అని చెప్పి రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

మరోవైపు అంకుల్ వాళ్లు తన దగ్గర ఉన్నారని రిషికి తెలిస్తే రిషి ఊరుకోడు అని అనుకుంటాడు గౌతమ్. ఎలాగైనా అంకుల్ వాళ్ల సామాన్లు ఇంటికి చేర్చాలి అని అనుకుంటాడు. ఇంతలో మహీంద్రా కాల్ చేస్తాడు. గౌతమ్.. నీకు థాంక్స్ చెబుదామని కాల్ చేశాను అంటాడు మహీంద్రా.

మీరు ఇక్కడున్నారన్న విషయం రిషికి తెలిస్తే నేను ఏమైపోతాను అంకుల్ అంటాడు మహీంద్రా. ఒక మంచి ఉద్దేశంతో మా ఇద్దరికీ ఆశ్రయం ఇచ్చావు. ఏ లోటు లేకుండా మమ్మల్ని చూసుకున్నావు. మీ రుణాన్ని నేను తీర్చుకోలేను అంటాడు మహీంద్రా.

అదేంటి అంకుల్ అలా అంటారు అంటాడు. మీ వస్తువులు కొన్ని ఇక్కడే ఉండిపోయాయి అంటాడు గౌతమ్. రిషికి తెలియకుండా మీ వస్తువులు మీకు ఇచ్చేస్తే నాకు సగం టెన్షన్ పోతుంది అంటాడు గౌతమ్. ఒక మంచి పని కోసమే రిషి దగ్గర నువ్వు నిజం దాచావు అంతే తప్ప ఇంకేం లేదు కదా అంటాడు.

ఎలాగూ రిషికి తెలిసే అవకాశం లేదు. నువ్వు టెన్షన్ పడకు అంటాడు మహీంద్రా. వాడికి నిజం తెలిస్తే నేను ఊహించిన దాని కంటే వంద రెట్లు పైర్ అవుతాడు అని భయపడతాడు గౌతమ్. మరోవైపు రాత్రి భోజనం తినేందుకు మహీంద్రా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు.

వసుధార నువ్వు కూడా కూర్చో అమ్మ అంటాడు ఫణీంద్రా. దీంతో నేను జగతి మేడమ్ కు భోజనం తీసుకెళ్తా అంటుంది. ఈ వసుధార ప్రతి విషయంలో మార్కులు కొట్టేయాలని చూస్తుంది అని అనుకుంటుంది దేవయాని. వసుధార.. జగతి కోసం ఫుడ్ తీసుకెళ్తుంది.

ఇంతలో వసుధార అందరి కోసం ఆలోచిస్తోంది అన్నయ్య అంటాడు మహీంద్రా. దీంతో అవును.. వసుధార మంచి అమ్మాయి అంటాడు ఫణీంద్రా. ఆ తర్వాత అందరూ భోజనం చేస్తుంటారు. వదిన నాకు ఇప్పుడేం వద్దు అంటాడు రిషి. ఏం రిషి అంటాడు ఫణీంద్రా.

దీంతో లేదు పెద్దమ్మ. మీరు తినండి అంటాడు రిషి. నేను తర్వాత తింటాను అంటాడు. దీంతో తర్వాత తినడం ఏంటి రిషి అంటుంది దేవయాని. వదిన మీరు కూర్చోండి నేను వడ్డిస్తాను అంటాడు రిషి. దీంతో దేవయాని వైపు చూస్తుంది. దీంతో నన్ను చూస్తున్నావేంటి కూర్చో. రిషి కూర్చోమన్నాడు కదా అంటుంది దేవయాని.

ఆ తర్వాత అందరికీ వడ్డిస్తాడు రిషి. నువ్వు కూడా తినవచ్చు కదా అంటే వసుధార, నేను కలిసి తింటాం అంటాడు రిషి. మరోవైపు జగతికి భోజనం తినిపిస్తుంది వసుధార. డాడ్.. మీకు ఏం వేయమంటారు. ఈ కర్రీని వదిన బాగా చేస్తారు. తినండి అంటాడు రిషి.

మహీంద్రా.. మనం ఇలా కలిసి భోం చేసి చాలా రోజులు అయింది కదా అంటాడు ఫణీంద్రా. మీకు వడ్డిస్తుంటే నా కడుపు నిండిపోతుంది డాడ్. ఎప్పుడూ మీరు ఇంట్లోనే ఉండాలి. నన్ను వదిలి వెళ్లొద్దు డాడ్ అని అనుకుంటాడు రిషి. వసుధార నిద్రపోయి ఉంటుందా అని అనుకుంటాడు ఆ తర్వాత రిషి.

కానీ.. తను జగతి రూమ్ లో బుక్ చదువుతూ ఉంటుంది. ఇంతలో రిషి మెసేజ్ చేస్తాడు. వసుధార ఒక్కసారి బయటికి రాగలవా అని మెసేజ్ పెడతాడు. దీంతో మీరు జెంటిన్ మెన్ సార్.. బయటికి రావచ్చు కదా అని అడగొచ్చు కదా.. కానీ.. బయటికి రాగలవా అని పెట్టాడు అని అనుకొని వస్తాను సార్ అని మెసేజ్ పెడుతుంది.

జగతి పడుకుందా అని చూసి బయటికి వెళ్తుంది వసుధార. డోర్ బయటే ఉంటాడు రిషి. మనం బయటికి వెళ్దాం అంటాడు. నేను అలసటతో పాటు ఆనందంగా కూడా ఉన్నాను. దాన్ని నీతో పంచుకోవాలి అంటాడు. దీంతో ఇద్దరూ కలిసి కారులో సరదాగా బయటికి వెళ్తారు.

Recent Posts

Rice | నెల రోజులు అన్నం మానేస్తే శరీరంలో ఏమవుతుంది? .. వైద్య నిపుణుల హెచ్చరికలు

Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…

12 hours ago

Montha Effect | ఆంధ్రప్రదేశ్‌పై మొంథా తుఫాన్ ఆగ్రహం .. నేడు కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం

Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…

14 hours ago

Harish Rao | హరీశ్ రావు ఇంట్లో విషాదం ..బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారానికి విరామం

Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…

16 hours ago

Brown Rice | తెల్ల బియ్యంకంటే బ్రౌన్ రైస్‌ ఆరోగ్యానికి మేలు.. నిపుణుల సూచనలు

Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…

16 hours ago

Health Tips | మారుతున్న వాతావరణంతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి.. ఈ నారింజ రసం చిట్కా గురించి తెలుసా?

Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…

19 hours ago

Chanakya Niti | చాణక్య సూత్రాలు: ఈ మూడు ఆర్థిక నియమాలు పాటిస్తే జీవితంలో డబ్బు కొరత ఉండదు!

Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…

22 hours ago

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

1 day ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

2 days ago