
guppedantha manasu 11 august 2022 full episode
Guppedantha Manasu 11 Aug Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 ఆగస్టు 2022, గురువారం ఎపిసోడ్ 526 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు.. రిషి వసుధరను కాదని సాక్షిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని మహీంద్రా జగతితో అంటాడు. కానీ.. తనకు రిషిపై నమ్మకం ఉందని అంటుంది జగతి. మరోవైపు రిషిని కలుస్తుంది సాక్షి. పిలవగానే వచ్చినందుకు థాంక్స్ అంటుంది సాక్షి. దీంతో నువ్వు పిలిచినందుకు రాలేదు. నాకు రావాలనిపించి వచ్చాను అంటాడు రిషి. దీంతో రెండింటికీ పెద్ద తేడా ఏముంది అని అంటుంది సాక్షి. నువ్వు వసుధర విషయంలో అసలు ఇన్వాల్వ్ కాకూడదు. వసుధర మీదికి నీ దృష్టి అస్సలు మరల్చకూడదు. ఈ విషయం చెప్పడానికే వచ్చాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో సాక్షి షాక్ అవుతుంది. ఇది చెప్పడానికే వచ్చాడా. ఈ విషయం ఫోన్ లో కూడా చెప్పొచ్చు కదా. మా గురించి మాట్లాడుతాడనుకుంటే ఆ వసు గురించి మాట్లాడుతున్నాడేంటి అని అనుకుంటుంది సాక్షి.
guppedantha manasu 11 august 2022 full episode
మరోవైపు దేవయాని జగతి గురించి మాట్లాడుకుంటుంది. రిషి నేను చెప్పినట్టు వింటున్నాడు. నేను చెప్పిన సాక్షినే పెళ్లి చేసుకుంటున్నాడు. ఆలస్యం అయినా కూడా దేవయాని విజయం సాధించింది. శుభం గంట మోగింది.. అని అనుకొని సాక్షి ఫోన్ ను ఎత్తుతుంది. నీకు వందేళ్లు. ఇప్పుడే నీ గురించి అనుకున్నాను అంటుంది దేవయాని. అసలు ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. అసలు రిషి ప్రవర్తన ఏంటో నాకు అర్థం కావడం లేదు అంటుంది సాక్షి. ఏది ఏమైతే నీకెందుకు.. రిషి నీకు తాళి కడితే చాలు కదా అంటుంది దేవయాని. తను నా దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడుతాడు అని అనుకున్నా కానీ.. వసుధర గురించి మాట్లాడుతున్నాడు. అసలు నాకు ఈ వసుధర టార్చర్ ఏంటి అని అంటుంది సాక్షి. మనిద్దరం ఇప్పుడు బాగా నటిస్తున్నాం కదా. కొన్ని రోజులు ఓపిక పట్టుకో అంటుంది దేవయాని. ఇంతలో జగతి వచ్చి తన ఫోన్ ను లాక్కుంటుంది జగతి. దీంతో ఏంటి జగతి మాట్లాడుతుంటే నా ఫోన్ లాక్కుంటున్నావు అంటుంది. దీంతో నేను సాక్షితో ఒక మాట మాట్లాడాలి అని అనుకుంటున్నా అని సాక్షితో మాట్లాడుతుంది జగతి.
నువ్వు అనుకొన్నవి ఏవీ జరగవు అని అంటుంది జగతి. దీంతో ఇక మీరు ఏం చేయలేరు ఆంటి. మీరు వచ్చి అక్షింతలు వేయడం తప్ప అంటుంది సాక్షి. సరే అదీ చూద్దాం అని చెప్పి ఫోన్ కట్ చేసి.. నా కొడుకును నేను ఎలాగైనా సాక్షి బారి నుంచి కాపాడుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జగతి.
తన దగ్గర ఉన్న రిషి షీల్డ్ ను చూస్తూ గత మెమోరీస్ ను గుర్తు చేసుకుంటూ ఉంటుంది వసుధర. ఇంతలో తనకు గౌతమ్ ఫోన్ చేస్తాడు. హలో వసుధర.. నాకు తెలుసు నువ్వు వింటున్నావని. ప్లీజ్ కాల్ కట్ చేయొద్దు. రిషి లగ్నపత్రిక రాయించమంటున్నాడు అని చెబుతాడు గౌతమ్.
దీంతో నా చేతుల్లో ఏం లేదు గౌతమ్ సార్. రిషి సార్ తో ఏం మాట్లాడాలి. నేను చెబితే వింటారా అని ఫోన్ కట్ చేస్తుంది. రిషి సార్ లగ్నపత్రిక రాయమన్నారంటే నేను ఏం చేయలేనా? నేను ఏం చేయాలి అని అనుకుంటుంది వసుధర. మరోవైపు రిషి.. వసుధర గురించే ఆలోచిస్తూ ఉంటాడు.
ఇంతలో ధరణి అక్కడికి వచ్చి రిషి నాకు డొంగతిరుగుడుగా మాట్లాడటం రాదు. సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వు సాక్షిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అడుగుతుంది ధరణి. అంతేనా వదిన.. ఇంకేమైనా ఉందా మాట్లాడాల్సి ఉందా అని అంటాడు రిషి.
వసుధర అంటే నీకు ఇష్టం కదా. మరి సాక్షిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటుంది ధరణి. దీంతో వదిన ఈరోజు ఏం కూర చేశారు అని అడుగుతాడు రిషి. దీంత బీరకాయ అంటుంది. నీకు నచ్చిన కూర ఏంటి అని అడుగుతాడు. దీంతో వంకాయ అంటుంది.
మరి.. మీకు ఇష్టమైన వంకాయ కూర వండకుండా, బీరకాయ ఎందుకు వండారు అని అడుగుతాడు రిషి. దీంతో రోజూ ఇష్టమైన కూర వండలేం కదా అంటుంది ధరణి. దీంతో ఏ విషయం అయినా అంతే. మనం కోరుకున్నవి అన్నింటినీ చేరుకోలేం. కొందరు కారు కొనుక్కోవాలని అనుకుంటారు కానీ.. బైక్ తోనే అడ్జస్ట్ అవుతారు.
జీవితంలో ఆశలు ఉండటం కరెక్టే కానీ.. అన్నీ నెరవేరవు కదా అంటాడు రిషి. వదిన మీరు ఎక్కువగా ఆలోచించకండి.. ప్రశాంతంగా ఉండండి. జరిగేది ఏదో జరుగుతుంది అంటాడు రిషి. దీంతో రిషి సమాధానం చెప్పడని అక్కడి నుంచి వెళ్లిపోతుంది ధరణి.
ఇంతలో వసుధర రిషికి మెసేజ్ పెడుతుంది. సర్.. ఒకే ఒక్కసారి ఆఖరిగా మిమ్మల్ని చూడాలని ఉంది రా గలరా? అని మెసేజ్ పెడుతుంది. వసుధర ఏంటి ఇలా మెసేజ్ పెట్టింది అని టెన్షన్ పడి తనకు ఫోన్ చేస్తాడు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. దీంతో తన దగ్గరికి వెళ్లేందుకు కారులో బయలుదేరుతాడు.
అసలు తను ఏమనుకుంటోంది. ఏంటా మెసేజ్. ఆఖరి సారిగా చూడాలనుకోవడం ఏంటి. వసుధర ఏమనుకుంటోంది. ఏం చేసుకుందామనుకుంటోంది అని అనుకొని తన రూమ్ కు వెళ్తాడు. అక్కడ వసుధర కనిపించదు. కానీ.. గోఠీలు ఉంటాయి. తను ఎక్కడుందని వెతుకుతుంటాడు రిషి.
మరోవైపు చందమామను చూస్తూ ఓ బేంచ్ మీద కూర్చొంటుంది వసుధర. ఎవరిని చూసినా రిషి సారే గుర్తొస్తారు అని అనుకుంటుంది వసుధర. చివరకు తనను వెతుక్కుంటూ తను ఉన్న చోటుకు వెళ్తాడు రిషి. తనను చూసి షాక్ అవుతాడు. ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు.
నేను చెబితే మీరు వినరు కదా. అందుకే విశాలమైన ఆకాశానికి చెబుతున్నాను అని అంటుంది. ఆ మెసేజ్ ఏంటి.. ఆఖరి సారిగా చూడాలి అంటే నేను ఎంత భయపడ్డానో తెలుసా అని అంటాడు. దీంతో భయం ఎందుకు సార్.. నేను చనిపోతా అనుకున్నారా అని అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.