
Karthika Deepam 11 August 2022 Full Episode
Karthika Deepam 11 August 2022 Episode : కార్తిక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. 11 గురువారం ఎపిసోడ్ 1428 హైలెట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.. స్వప్న తన తప్పు తెలుసుకుని సత్యంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. సత్యం కూడా జరిగిన పొరపాట్లని తనకు చెప్తాడు. కట్ చేస్తే సౌర్య నిరూపం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అంతలో అక్కడికి నిరూపం వచ్చి సౌర్య కళ్ళు మూస్తాడు. అప్పుడు సౌర్య డాక్టర్ సాబ్ అని అంటుంది. అప్పుడు నిరూపం అంత ఈజీగా ఎలా తెలుసుకున్నావు శౌర్య. అని అంటాడు. అలా తెలిసిపోద్దిలే డాక్టర్ సాబ్ అని అంటుంది. శోభాని అంత సింపుల్ గా పట్టిస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు శౌర్య. ఎవరు చేయలేని పని నువ్వు చేసావ్ థాంక్స్ అని చేతులు పట్టుకుంటాడు. అప్పుడు శౌర్య మీకెలా ఉందో గానీ చెప్పడానికి నాకు మాత్రం పుండు మీద కారం చల్లినట్లుగా ఉంది. మీకు సంతోషమే కదా సంతోషంగా పెళ్లి చేసుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శౌర్య.
కట్ చేస్తే ప్రేమ్, హిమ లు పెళ్లి ఆపాలి అని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కట్ చేస్తే సౌర్య. సింగిల్ గా కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు స్వప్న అక్కడికి వచ్చి నేను నీకు గోరింటాకు పెడతా అని చేయి తీసుకొని పెట్టబోతోంది. కానీ నాకు ఏమి వద్దు నీ కోడలికి వెళ్లి పెట్టుకో అని అంటుంది. అప్పుడు స్వప్న నువ్వు కూడా నా కోడలు వి కదా అని అంటుంది. ఇప్పుడు నువ్వు మారిపోయి కొత్తగా మాట్లాడుతున్నావా.. అని అంటుంది. బంధాలను మనుషుల్ని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అని స్వప్న అంటుంది. ఈ మనుషులు ఈ ప్రేమలు అన్ని అబద్ధాలే. ఇంతలో అక్కడికి నిరూపం, హిమ వస్తారు. స్వప్న, సౌర్యను చూసి సంతోష పడిపోతారు. అప్పుడు స్వప్న మెహందీ పెడతా అంటే పెట్టించుకోవట్లేదు చూడు హిమ అని అంటుంది. అప్పుడు నిరుపం మెహిందీ కదా పెట్టించుకోవచ్చు కదా శౌర్య. ఈ గోరింటాకు కి మొగుడికి ఏదో సంబంధం ఉంది అని అంటారు కదా.. నాకు ఈ మెహందీలు వద్దు ఏమీ వద్దు మొగుడంట మొగుడు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
Karthika Deepam 11 August 2022 Full Episode
అప్పుడు స్వప్న, నిరూపం పాపం మన ప్రేమని అర్థం చేసుకోలేక పోతుంది అని శౌర్యాని అంటారు. ఆనందరావు అక్కడికి వస్తాడు. నా మనవరాలు ఎప్పుడు మారుతుందో ఏమిటో అని అంటాడు. కట్ చేస్తే శోభ ఇంటిని, హాస్పిటల్ ని అంత జప్తు చేస్తారు ఆఫీసర్స్. దాంతో సౌర్య పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కట్ చేస్తే సౌర్య నిరూపం గురించి ఆలోచిస్తూ కూర్చుంటుంది. ఇంతలో అక్కడికి సౌందర్య వచ్చి ఏంటి సౌర్య నువ్వు ఒక్కదానివే ఇక్కడ కూర్చున్నావు అని అంటుంది. అప్పుడు సౌర్య ఒక సామెత ఉంది కదా. అందరిదీ ఒక దారైతే చీపిరి కట్టడి ఒకదారని.. నాది కూడా అలాగే అంటుంది శౌర్య. అప్పుడుసౌందర్య నువ్వెందుకు అలా అనుకుంటావు ఇప్పుడు నీకు అందరూ ఉన్నారు కదా. మీరందరూ ఉన్న నేనెప్పుడూ ఒంటరిదాన్ని నేను ఎప్పుడూ వంటలక్క కూతుర్నే అని అంటుంది. అప్పుడు సౌందర్య మేము ఏది చెప్పినా నువ్వు నీ మనసుకు తీసుకోవు అని అంటుంది.
నాకు మనసు అంటూ ఉంటే కదా నాయనమ్మ అది ఎప్పుడు విరిగిపోయింది. ఎందుకంటే నేను చిన్నప్పుడు పారిపోయినప్పుడు మీరు నన్ను వెతికారా.. వెతకలేదు నేను మీకోసం వెతికాను మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని చెప్పారు. అప్పుడే నా మనసు విరిగిపోయింది. నాయనమ్మ అని అంటుంది శౌర్య. ఎందుకే నీకు ఇష్టం వచ్చినట్లు అనుకుంటావు. నువ్వు చిన్నప్పుడు ఒక దగ్గర కనిపిస్తే నేను నీ దగ్గరికి వచ్చి బ్రతు మీలాడాను. ఎంతో ఏడ్చాను నువ్వు రా అమ్మ మన ఇంటికి అని అడిగాను నువ్వు నేను రానంటే రాను నేను ఇక్కడే ఉంటాను. నువ్వు ఇక్కడనుంచి వెళ్లకపోతే నా మీద ఒట్టు. ఇంకొకసారి నాకు మీరు కనిపిస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. కనీసం డబ్బులు అయినాన తీసుకోవే అన్న కానీ మీ ప్రేమ లో, వద్దు మీ డబ్బు వద్దు, మీరు వద్దు అన్నావు. ఆ కలంతా సౌర్యకు చెప్తుంది సౌందర్య. తరువాత ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడవలసిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.