Guppedantha Manasu 20 Jan Today Episode : రిషి ఎక్కడున్నాడో కనిపెట్టేసిన వసుధార.. అక్కడికి వెళ్లి వసు షాక్.. రిషి ఏం చేస్తున్నాడు అక్కడ

Advertisement
Published by
Advertisement

Guppedantha Manasu 20 Jan Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 20 జనవరి 2023, శుక్రవారం ఎపిసోడ్ 665 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చక్రపాణి.. వసుధారకు ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మా అని అడుగుతాడు. రిషిని కలిశావా అంటాడు. నేను బాగానే ఉన్నాను కానీ.. ఆ రాజీవ్ తో జాగ్రత్తగా ఉండండి అంటుంది వసుధార. దీంతో వాడిని అస్సలు వదిలిపెట్టను అంటాడు చక్రపాణి. మేము కూడా అక్కడికే వచ్చేస్తాం. నీతోనే ఉంటాం అంటాడు చక్రపాణి. దీంతో మీరు ఇక్కడికి రావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను అంటుంది వసుధార. దీంతో సరే అమ్మ అంటాడు. ఇక నుంచి మనకు అంతా మంచే జరుగుతుంది సుమిత్ర అంటాడు చక్రపాణి. మనమంతా ఒకదగ్గరే ఉందాం. కలిసే ఉందాం అని సుమిత్రతో చెబుతాడు.

Advertisement

guppedantha manasu 20 january 2023 friday full episode

మరోవైపు రిషి.. సోఫాలో పడుకొని వసుధార గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంత పని చేశావేంటి.. నా జీవితంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పావు. చివరకు నువ్వే పెద్ద ప్రశ్నగా మిగిలిపోయావు అని అంటాడు. దేవుడి దగ్గర పెట్టిన పూలను తనతో పాటే తీసుకెళ్లడం చూస్తాడు రిషి. అసలు వసుధార ఎందుకు పూలు తీసుకుంది. ఒకరికి భార్యగా ఉన్న వ్యక్తి నాతో ఎందుకు మాట్లాడాలని అనుకుంటోంది. అది తప్పు కదా అని అనుకుంటాడు రిషి. మరోవైపు రిషి సార్ కు జరిగిన విషయాలు అన్నీ ఎప్పుడు చెప్పాలి. వెళ్లిన వ్యక్తి మళ్లీ ఎందుకు వచ్చారు. మళ్లీ వచ్చారంటే నా మీద ప్రేమ ఉన్నట్టే కదా అని అనుకొని.. పూల ఫోటో తీసి మాట్లాడాలి సార్ అంటూ వాట్సప్ మెసేజ్ పెడుతుంది రిషికి.

Advertisement

దీంతో రిషికి ఏ రిప్లయి ఇవ్వాలో అర్థం కాదు. ఇద్దరూ బయట ఉన్న చందమామను చూస్తూ మాట్లాడుకుంటారు. అసలు దూరం ఎందుకు అయ్యాం. వసుధార ఎందుకు ఇలా చేస్తోందో అర్థం కావడం లేదు అని అనుకుంటుంది.

ఇంతలో తన పూలు కింద పడబోతుంటే.. జీవితంలో నేను ఏదీ చేజారనివ్వను సార్. బంధమైనా.. ఏదైనా ఖచ్చితంగా చేజార్చుకోను అని అనుకుంటుంది. వసుధార నువ్వు ఎప్పటికీ అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోతావా అనుకుంటాడు.

రిషి సార్ మీరు ఎక్కడున్నారు సార్ అని అనుకుంటుంది. నేను ఎక్కడున్నానో ఏమైపోతున్నానో నాకే అర్థం కావడం లేదు అని అనుకుంటాడు రిషి. వసుధార పంపించిన ఫోటో చూస్తాడు రిషి. కట్ చేస్తే తెల్లవారుతుంది. కాలేజీకి వస్తుంది వసుధార. రిషి సార్ ఎక్కడున్నారు అని అంతా వెతుకుతుంది.

ఎప్పుడూ వాళ్లు కూర్చొనే ప్లేస్ కు వచ్చి కూర్చొంటుంది. అన్నీ గుర్తుకు తెచ్చుకుంటుంది. రిషి సార్ మీరు, నేను కలిసి నడిచింది.. మాట్లాడింది.. ప్రతి క్షణం నాకు ఒక మెమోరీగానే గుర్తింది. మీరు నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. అసలు మీరు ఎక్కడికి వెళ్లారు అని అనుకుంటుంది.

Guppedantha Manasu 20 Jan Today Episode : జగతి, మహీంద్రా ఎవ్వరూ లిఫ్ట్ చేయని వసుధార ఫోన్

ఈ వసుధారను ఒంటరిని చేస్తారా అని అనుకుంటుంది వసుధార. వెంటనే ఫోన్ చేస్తుంది రిషికి. కానీ.. రిషి ఫోన్ చూసుకోడు. దీంతో జగతి మేడమ్ కు ఫోన్ చేయనా అనుకుంటుంది. మేడమ్ కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు అనుకుంటుంది.

జగతి కూడా లిఫ్ట్ చేయదు. మహీంద్రాకు చేస్తుంది వసుధార. కానీ.. ఆయన కూడా లిఫ్ట్ చేయరు. రిషి సార్ మీరు లేని వసుధార ఎలా ఉంటుందని అనుకున్నారు. మీరు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లారు సార్. ఏ విషయం తెలియడం లేదు అని అనుకుంటుంది.

నేను మిమ్మల్ని చూడాలి సార్. మీతో మాట్లాడాలి. ధరణి మేడమ్ కు ఫోన్ చేస్తే చెబుతుంది కదా అనుకుంటుంది. వెంటనే ధరణికి ఫోన్ చేస్తుంది. మేడమ్.. నేను వసుధారను మాట్లాడుతున్నాను. రిషి సార్ ఎక్కడున్నారో మీకు తెలుసా? అని అడుగుతుంది.

రిషి ఇంటికి రాలేదు. తను ఎక్కడికి వెళ్లారో ఎవ్వరికీ తెలియదు అంటుంది. అది కాదు వసుధార.. అలా ఎందుకు చేశావు అని అడుగుతుంది. దీంతో ఫోన్ కట్ చేస్తుంది వసుధార. డీబీఎస్టీ కాలేజీలో మొదటి సారి రిషి సార్ ను ఎక్కడ చూశానో అక్కడికే వెళ్లి చూస్తా అని అనుకుంటుంది వసుధార.

కట్ చేస్తే ఆ రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేయబోతుంది. ఇంతలో రిషి కూడా అదే సమయానికి డోర్ ఓపెన్ చేయబోతాడు. ఒక్కసారిగా రిషి డోర్ తీస్తాడు. దీంతో వసుధార వెళ్లి అతడి ఒడిలో పడుతుంది.

మీరు ఇక్కడ ఉన్నారేంటి సార్ అని అడుగుతుంది. దీంతో ఇది కాలేజీ గెస్ట్ హౌస్. ఇక్కడ నీకేం పని అంటాడు. దీంతో నేను కాలేజీ ఎంప్లాయినే కదా అంటుంది. మీరు నాకు మాట్లాడటానికి టైమ్ ఇవ్వడం లేదు అంటుంది.

దీంతో ప్రతిక్షణం నీనుండి నేనే పారిపోతున్నాను అంటాడు రిషి. మాట్లాడటానికి ఏం లేదు వసుధార అంటాడు. ఇక్కడి నుంచి వెళ్లిపో అంటాడు. దీంతో ఈరోజు వెళ్లిపోవచ్చు. రేపు.. లేకపోతే ఎల్లుండి అయినా అంటుంది.

దీంతో మహీంద్రా సార్ కు మెసేజ్ చేస్తుంది. వాట్సప్ లో వాయిస్ మెసేజ్ చేస్తుంది. రిషి సార్ కాలేజీ గెస్ట్ హౌస్ లో ఉన్నారు. వచ్చి తీసుకెళ్లండి అని మెసేజ్ చేస్తుంది. దీంతో కోపంతో ఏం చేస్తున్నావు. నువ్వు వెళ్తావా.. లేక నేను వెళ్లనా అంటాడు.

దీంతో ఏం చేయాలో వసుధారకు అర్థం కాదు. బయటికి వచ్చేస్తుంది. ఇంతలో చక్రపాణి ఫోన్ చేస్తాడు. మీ అక్కడ మాధురి ఫోన్ చేసింది. ఆరోగ్యం బాగోలేదట. మీ అమ్మ తన దగ్గరికి వెళ్దాం అంటోంది అని చెబుతాడు.

అమ్మను మాధవి దగ్గరికి పంపించి నేను నీ దగ్గరికి వస్తానమ్మా. ఎందుకో నీ దగ్గరికి రావాలని ఉంది అంటాడు. దీంతో వసుధార ఏం మాట్లాడదు. మీరు వచ్చేయండి. నాకేం ఇబ్బంది లేదు అంటుంది వసుధార.

సరే ఉంటానమ్మా అంటాడు చక్రపాణి. రిషి కాలేజీలో ఉన్నాడని దేవయానికి చెబుతాడు మహీంద్రా. అక్కడికి వసుధార ఎందుకు వచ్చింది. అసలు ఏం జరిగింది అని అడుగుతుంది దేవయాని.

వసుధార వస్తే రిషి ఏం బాగుంటాడు అంటుంది దేవయాని. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Bottle Gourd Juice : సొరకాయ జ్యూస్‌తో నిజంగానే పొట్ట కొవ్వు తగ్గుతుందా..? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే!

Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…

1 day ago

Petrol : భారత్‌లో అత్యధికంగా పెట్రోల్ వాడేది ఏ రాష్ట్రం..? షాకింగ్ గణాంకాలు వైరల్!

Petrol  : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…

2 days ago

PM Modi : ఖర్చు ఆపమని కాదు.. తెలివిగా ఖర్చు చేయమన్న మోదీ.. కేంద్రం క్లారిటీ!

PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…

2 days ago

Farmers Good News : రైతులకు గుడ్ న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. !

Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…

2 days ago

Donald Trump : చైనాలో ట్రంప్ కి అవ‌మానం.. ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చ!

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…

3 days ago

Heart Health : హార్ట్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇవి చేయండి.. గుండె ఆరోగ్యానికి సింపుల్ ఫిట్‌నెస్ టిప్స్!

Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…

3 days ago

Working Hours : ఎక్కువసేపు కూర్చునే పని చేస్తున్నారా..? అయితే మీరు డేంజ‌ర్‌లో ప‌డ్డ‌ట్టే..?

Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…

3 days ago

AP Rajya Sabha : ఏపీ రాజ్యసభ రేసులో కొత్త ట్విస్ట్.. టీడీపీ-జనసేన అభ్యర్థులపై కీలక నిర్ణయం!

AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…

3 days ago

Anushka Shetty : ఫస్ట్ లవ్‌పై మనసు విప్పిన అనుష్క.. అత‌ని గురించి చెప్పిన మాటలు వైరల్

Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…

3 days ago

Vijay and Trisha Marriage : ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్.. విజయ్-త్రిష పెళ్లి గాసిప్స్‌కు ఫుల్ స్టాప్ పడిందా..?

Vijay and Trisha Marriage  : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…

3 days ago

Hair : జుట్టు పెరగడం లేదా..? రోజూ ఈ జ్యూసులు తాగితే అద్భుత ఫలితాలు!

Hair  : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…

3 days ago

Rice Water : హెయిర్ గ్రోత్‌కు బియ్యం నీటితో అద్భుత ప్రయోజనాలు.. మీరు ట్రై చేండి..!

Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…

3 days ago