Guppedantha Manasu 28 Dec Today Episode : వసుధారపై చక్రపాణి సీరియస్.. రిషి గురించి తెలిసి వసుధారకు షాకిచ్చిన చక్రపాణి

Advertisement
Advertisement

Guppedantha Manasu 28 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 డిసెంబర్  2022, బుధవారం 645 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు ఒక్కవైపే ఆలోచిస్తున్నారు. అసలు నేను ఏం తప్పు చేశాను అని అడుగుతుంది వసుధార. దీంతో పెళ్లి పీటల మీది నుంచి చెప్పాపెట్టకుండా అలా పారిపోవడం తప్పు కదా. అలా చేస్తే, పరువు పోతే మా నాన్న ఉంటాడో చస్తాడో అని తెలియలేదా? పారిపోయిందో లేక లేచిపోయిందో అని పది మంది పది రకాలుగా మాట్లాడుతుంటే.. నువ్వు ఇప్పుడు వచ్చి నీతులు మాట్లాడుతున్నావా అంటాడు చక్రపాణి. ఇన్నాళ్లకు తిరిగి వచ్చినా తప్పు తప్పే అవుతుంది అంటాడు. దీంతో నేను ఏ తప్పు చేయలేదు. తప్పు మీ ఆలోచనా విధానంలో ఉంది అంటుంది వసుధార. అన్నీ చేసి ఇప్పుడు నా ఆలోచనలో తేడా ఉంది అంటుంది అంటాడు. నువ్వు వెళ్లి అక్కడ ఏం చేశావు.. ఏం చదివావో నాకు తెలుసా? నాకు తెలియదు కానీ.. దారిలో కనపడే ప్రతి వెదవ నీ గురించే అడుగుతున్నాడు. ప్రతి వాడికి సమాధానం చెప్పలేక నేను చస్తున్నాను అంటాడు.

Advertisement

guppedantha manasu 28 december 2022 full episode

అల్లుడు గారు దేవుడు కాబట్టి నన్ను ఆదుకున్నాడు కాబట్టి ఇంకా ఆయన వల్ల మేము ఇంకా ప్రాణాలతో ఉన్నాం అంటాడు చక్రవాణి. నీ గురించి చెప్పలేక అక్కయ్య తీర్థ యాత్రలకు వెళ్లింది. తమ్ముడిని హాస్టల్ లో వేశాం అంటాడు చక్రపాణి. కళ్లతో చూసినవి మాత్రమే నమ్మాలి. ఎవరో చెప్పిన మాటలు మనం అస్సలు వినకూడదు అంటుంది వసుధార. దీంతో నా అల్లుళ్లు దేవుళ్లు. కానీ.. కూతుళ్లే ఇలా చేస్తున్నారు అంటాడు. అల్లుళ్లు మీకు ఎక్కువైపోయారా? కూతుళ్లు ఏం తప్పు చేశారు అని రెండో సంబంధం అని అనబోతుండగా.. నోర్మూయ్ అంటాడు చక్రపాణి. మీ అల్లుళ్ల నిజస్వరూపం మీకు తెలియదు. వాళ్ల గురించి తెలిస్తే మీరే వాళ్లను చెప్పుతో కొడతారు అంటుంది వసుధార. దీంతో వసు మీదికి చేయి లేపుతాడు చక్రపాణి.

Advertisement

అయినా కూడా భయపడదు. కొడతారా కొట్టండి. నీ ఇద్దరు అల్లుళ్లు ఒక్కటే అంటుంది వసుధార. దీంతో నా ఇద్దరు అల్లుళ్లు ఏం చేశారో చెప్పు అంటాడు. ఇంతలో అక్కడికి కారులో రిషి వస్తాడు. హారన్ కొడతాడు. దీంతో నేను వెళ్లాలి అంటూ బయటికి వెళ్లబోతుండగా ఎక్కడికి అంటాడు.

దీంతో అతడు మా సార్ అంటుంది వసుధార. ఆయన్ను ఏమనకు అంటుంది వసుధార. ఆ తర్వాత చక్రపాణి వద్దన్నా కూడా బయటికి వెళ్తుంది వసుధార. దాని సంగతి చెప్తా ఆగు అని కోపంతో అక్కడే కూలబడిపోతాడు చక్రపాణి.

కారు దిగి వసుధారకు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంతలో వసుధార అక్కడికి వస్తుంది. సర్ అంటుంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు అని అడుగుతుంది వసుధార. ఇదేం ప్రశ్న వసుధార ఇక్కడికెందుకు వచ్చావు అని అంటున్నావు అంటాడు.

దీంతో ముందు కారు పోనివ్వండి సార్. అన్నీ తర్వాత చెబుతాను అంటుంది. దీంతో కారులో తనను ఎక్కించుకొని వెళ్తుంటాడు రిషి. కానీ.. తను ఏం మాట్లాడదు. ఏమైంది అంటే ఏం చెప్పదు వసుధార.

Guppedantha Manasu 28 Dec Today Episode : ఇంట్లో గొడవ జరిగిందా అని వసును అడిగిన రిషి

ఇద్దరూ ఓ ప్లేస్ కు వెళ్లి అక్కడ కూర్చొంటారు. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అని అడుగుతాడు రిషి. దీంతో అదేం లేదు సార్ అంటుంది వసుధార. దీంతో తన చేయి తీసుకొని వసుధార నువ్వు నా పక్కన ఉంటే నాకు ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంటుంది తెలుసా?

నువ్వు ఎప్పుడూ నా కళ్ల ముందే ఉండాలి. కానీ… ఇలా మూడీగా కాదు. బోలెడన్ని విషయాలు చెబుతూ ఉండాలి అంటాడు. దీంతో ప్రకృతే ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇక మనం ఎలా ఉంటాం అంటుంది వసుధార.

మీ ఊరు వచ్చాక.. మనిద్దరం చేతులు పట్టుకొని నువ్వు తిరిగిన ప్లేసుల్లో తిరగాలని నేను అనుకున్నాను. నీ ఫ్రెండ్స్ కు పరిచయం చేస్తావని అనుకున్నా కానీ నువ్వు ఏంటి వసుధార. ఏం మాట్లాడవు. ఏమైందో చెప్పొచ్చు కదా అంటే ఏం కాలేదు సార్ అంటుంది వసుధార.

మరి మాట్లాడవేంటి అంటే.. ఏం మాట్లాడాలో.. ఏం చెప్పాలో.. అసలు చెప్పడానికి ఏముందో కూడా నాకు తెలియడం లేదు సార్ అంటుంది వసుధార. ఈ ఊరుకు వచ్చేటప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు. ఎంత బాగా మాట్లాడావు. ఇప్పుడు ఆ సంతోషం ఏమైంది అని అడుగుతాడు రిషి.

దీంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. మిమ్మల్ని నాకు ఇచ్చినందుకు, మీ ప్రేమ పొందినందుకు వస్తున్న ఆనంద బాష్పాలు ఇవి అంటుంది వసుధార. అవును. నేను నీకు అన్నిసార్లు ఫోన్ చేస్తే.. నువ్వేంటి నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది అంటాడు.

దీంతో ఫోన్ పొరపాటున చేయి జారింది సార్ అంటుంది వసుధార. దీంతో సరే నీ ఫోన్ సంగతి వదిలేసేయ్. ఇంకొకటి కొనిస్తాను అంటాడు రిషి. దీంతో నా ప్రతి కష్టంలో మీరు తోడనున్నారు. నేను ఎన్ని కష్టాలు పడ్డానో అన్ని విజయాలు సాధించాను అంటుంది.

ముఖ్యంగా మీరు నా జీవితంలో దొరకడమే గొప్ప విజయం అంటుంది వసుధార. సరే.. పదా వెళ్దాం. నీకు ఒక ఫోన్ కొనిస్తాను అంటూ తనను కారులో తీసుకెళ్తాడు రిషి. మరోవైపు రాజీవ్ కు చక్రపాణి ఫోన్ చేస్తాడు.

ఇంతలో కారులో వసుధారను చూస్తాను రాజీవ్. ఒక్కనిమిషం మామయ్య గారు మళ్లీ చేస్తాను అంటాడు రాజీవ్. నా మరదలు ఏంటి రోడ్డు పక్కన కారులో కూర్చొని ఉంది. అక్కడేమో మామయ్య గారు టెన్షన్ పడుతున్నారు.

నువ్వేమో.. ఇక్కడ రిషి సార్ తో షికారు చేస్తున్నావా మరదలు పిల్ల అని అనుకుంటాడు. ఇంతకీ రిషి సార్ ఎక్కడికి వెళ్లినట్టు అని అనుకుంటాడు. ఇంతలో వచ్చి కారు ఎక్కుతాడు రిషి. అనంతగిరికి వచ్చి ఇక్కడ ప్రేమ పావురాల్లా విహరిస్తున్నారా? అని అనుకుంటాడు.

అయినా ఇంకా మరదలు పిల్ల ఏంటి. త్వరలో నాకు కాబోయే భార్యవు కదా అని అనుకుంటాడు. ఇంతలో రిషి కారు అక్కడి నుంచి వెళ్తుంది. ఇలా పరాయి మగాడితో తిరగడం తప్పు కదా అమ్మా. అయినా మీ బావ గారు.. కాదు కాబోయే మొగుడినే కదా.

సౌండ్ ఇప్పుడు వినడానికి బాగుంది. కాబోయే మొగుడిగానే ఈసారి క్షమిస్తున్నాను. మళ్లీ మళ్లీ తిరిగే అవకాశం మీకు ఉండదు. నేను ఇవ్వను అని అనుకుంటాడు రాజీవ్. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

మరోవైపు వసుధార, రిషి నుంచి ఎలాంటి ఫోన్ రావడం లేదు ఏంటి అని మహీంద్రాతో అంటుంది జగతి. దీంతో నువ్వేం టెన్షన్ పడకు అంటాడు మహీంద్రా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

T20 World Cup 2026: కివీస్ కోట బద్దలు.. న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం!

T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…

5 hours ago

Telangana : తెలంగాణా హంగ్ మున్సిపాలిటీల్లో అధికారం ఎవరిది..?

Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…

6 hours ago

Rashmi Gautam : బంగారం లాంటి వాడు దొరికాడు .. యాంకర్ రష్మీ పెళ్లి కి అంతా రెడీ !

Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…

7 hours ago

Shivajyothi : బిడ్డని కన్న ఆనందం కూడా లేకుండా శివజ్యోతి కి బిగ్ బ్యాడ్ న్యూస్..!

Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…

8 hours ago

Womens : ఏపీ లో మహిళల కు బంపర్ గుడ్ న్యూస్..!

Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government  2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…

10 hours ago

Nara Lokesh : బిగ్ బ్రేకింగ్ : నారా లోకేష్ పటాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ ..!

Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…

11 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్..మరో మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో భరోసా డబ్బు జమ !!

Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…

14 hours ago