Guppedantha Manasu 8 Sep Today Episode : గౌతమ్ ప్లాన్ అదుర్స్.. ఒక్కటైన రిషి, వసు.. ఇక పెళ్లి బాజాలు మోగాల్సిందే

Guppedantha Manasu 8 Sep Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 సెప్టెంబర్ 2022, గురువారం ఎపిసోడ్ 550 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మహీంద్రా, జగతి పెళ్లి రోజు ఇంట్లోనే జరగాలి. దానికి నువ్వు రిషిని ఒప్పించాలి అని దేవయాని.. వసుధరను కోరుతుంది. దీంతో మీరే ఈ విషయం రిషి సార్ కు చెప్పొచ్చు కదా అని అడుగుతుంది వసు. దీంతో కరెక్టే కానీ… సాక్షి విషయం జరిగినప్పటి నుంచి రిషి కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేకపోతున్నాను అంటుంది దేవయాని. నువ్వు వసుధరకు అత్యంత ఆప్తురాలివి. అందుకే నువ్వు రిషిని ఒప్పించాలి అంటుంది దేవయాని. మరోవైపు కారులో వెళ్తున్న రిషి.. వసుకు ఫోన్ చేస్తాడు. దీంతో ఫోన్ ఎత్తదు. దీంతో డైరెక్ట్ గా రెస్టారెంట్ కు వెళ్దామని అనుకుంటాడు. వసుధర నువ్వు నా వలలో పడ్డావు. జగతి సంతోషం కోసం నువ్వు ఏదైనా చేస్తావు. ఈ విషయం రిషికి నచ్చక నిన్ను దూరం పెడతాడు.. అని అనుకుంటుంది దేవయాని.

guppedantha manasu 8 september 2022 full episode

మేడమ్ నేను రిషి సార్ ను ఒప్పిస్తాను అంటుంది వసుధర. దీంతో థాంక్స్ వసుధర.. నువ్వు కాదనవని తెలుసు అంటుంది. ఇంతలో అక్కడికి రిషి వస్తాడు. పెద్దమ్మ మీరేంటి ఇక్కడ.. ఇక్కడికి వచ్చారేంటి అని అడుగుతాడు. దీంతో చిన్న పని ఉండి వసుధరను కలుద్దామని వచ్చాను. తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నా. ఇంతలో నువ్వు వచ్చావు అంటుంది దేవయాని. చూశావా వసుధర.. పెద్దమ్మ అందరి గురించి ఆలోచిస్తారు అంటాడు రిషి. ఇంకా కాఫీ తాగలేదు కదా. వసుధర.. నాకు, పెద్దమ్మకు రెండు కాఫీలు తీసుకొస్తావా అంటాడు రిషి.

మరోవైపు రాత్రి అవుతుంది. రెడీ అయి వసుధర.. ఒక చోటుకు వస్తుంది. రిషి సార్ రమ్మన్నారని గౌతమ్ సార్ చెప్పారు. కానీ.. ఇక్కడ ఎవరూ లేరేంటి అని అనుకుంటుంది. ఇంతలో అక్కడికి రిషి కారులో వస్తాడు.

తనను చూసి కారు ఆపుతాడు. ఏమైంది వసుధర.. ఇక్కడున్నావు అని అడుగుతాడు రిషి. దీంతో అదేంటి మీరే నన్ను రమ్మన్నారని గౌతమ్ సార్ చెప్పాడు అంటుంది వసు. దీంతో నువ్వు రమ్మన్నావని గౌతమ్ చెప్పాడు అంటాడు రిషి.

Guppedantha Manasu 8 Sep Today Episode : గౌతమ్ కు ఫోన్ చేసినా రెస్పాండ్ కాడు

గౌతమ్ కు ఫోన్ చేస్తాడు రిషి. దీంతో ఫోన్ ఎత్తకుండా.. మీకోసం అరేంజ్ మెంట్స్ చేశా అని మెసేజ్ పెడతాడు గౌతమ్. దీంతో రిషికి అంతా అర్థం అవుతుంది. పదా అక్కడ కూర్చుందాం అని వసుధరను తీసుకెళ్తాడు రిషి.

ఇద్దరూ అక్కడ కాసేపు కూర్చొని మనసు విప్పి మాట్లాడుకుంటారు. నువ్వు రోజురోజుకూ మరింత అందంగా కనిపిస్తున్నావు అంటాడు రిషి. దీంతో వసుధర చాలా సంతోషిస్తుంది. ముసి ముసి నవ్వులు నవ్వుతుంది. అక్కడ ఫుడ్ కూడా ఉండటంతో ఫుడ్ తింటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు వసు, రిషి.

తర్వాత వసుధరకు బిర్యాని పెడతాడు. ఈరోజు నువ్వు ఏం చెప్పినా నేను వినను. నేను చెప్పిందే నువ్వు వినాలి అని తనకు ఎక్కువ బిర్యానీ పెడతాడు రిషి. తను తిన్న ప్లేట్ కూడా రిషినే తీస్తాడు. ఆ తర్వాత తనకు కాఫీ కలిపి ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Atukulu : సాయంత్రం స్నాక్స్… వీటిని చీప్ గా చూడకండి… దీని ప్రయోజనాలు తెలిస్తే షాకే…?

Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…

31 minutes ago

KAntara 3 : కాంతార 3కి ప్లాన్.. ప్ర‌ధాన పాత్ర‌లో టాలీవుడ్ స్టార్ హీరో..!

KAntara 3 : సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…

2 hours ago

Women : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. ఫ్రీగా 7000 మీకే.. ఎలా అంటే..?

Women  : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…

3 hours ago

Komati Reddy Rajagopala Reddy : సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతుగా కోమటిరెడ్డి .. కుటిల ప‌న్నాగాల‌ను స‌మాజం స‌హించ‌దు. రాజగోపాల్ రెడ్డి !

Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…

4 hours ago

Pawan kalyan : పవన్ కళ్యాణ్‌ పై టాలీవుడ్ కార్మికుల ఆగ్రహం.. !

Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…

5 hours ago

Kiwi Fruit : మీరు రాత్రి నిద్రించే ముందు ఒక కివి పండుని తిని చూడండి… మీ కళ్ళు చెదిరే అద్భుతం చూస్తారు…?

Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…

6 hours ago

Costor Oil : ఆముదం 5 రకాల అద్భుతాలను చేస్తుంది.. అదేమిటో తెలుసా…?

Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…

7 hours ago

Rakhi Festival : రాఖీ పౌర్ణమి నుంచి…ఈ రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం…?

Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…

8 hours ago