Home » Entertainment » Intinti Gruhalakshmi 8 September 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 8 Sep Today Episode : సామ్రాట్ విషయంతో తులసినే తప్పుపట్టిన పరందామయ్య.. దీంతో తులసి షాకింగ్ నిర్ణయం

Authored By
Varun G
The Telugu News | Updated on: September 8, 2022, 9:11 am
Advertisement

Intinti Gruhalakshmi 8 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 సెప్టెంబర్ 2022, గురువారం ఎపిసోడ్ 732 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సామ్రాట్.. తులసి ఇంటికి వెళ్లి తులసి మీద సీరియస్ అవుతాడు. నా కంపెనీ రెప్యుటేషన్ పాడు చేయడం ఎందుకు. ఈ పేపర్ స్టేట్ మెంట్ ఎందుకు అని అడుగుతాడు సామ్రాట్. దీంతో ఆ పేపర్ స్టేట్ మెంట్ చూసిన ప్రేమ్.. ఈ పేపర్ స్టేట్ మెంట్ తో మా అమ్మకు ఎలాంటి సంబంధం లేదు అంటాడు ప్రేమ్. అవును.. నేను చూశా.. వచ్చేటప్పుడు ప్రెస్ వాళ్లు ఎందుకు వచ్చారు. నువ్వు చేసింది నమ్మకుండా కాదు మోసం చేశావు. జీవితంలో ఇంకెవ్వరినీ నమ్మకుండా చేశావు. థాంక్స్ అంటూ కోపంతో సామ్రాట్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత నేరుగా ఇంటికి వస్తాడు సామ్రాట్.

Advertisement

intinti gruhalakshmi 8 september 2022 full episode

ఇంకా తులసి విషయం గురించే ఆలోచిస్తూ ఉంటాడు సామ్రాట్. ఇంతలో బాబాయి వస్తాయి. పార్టనర్ షిప్ నుంచి మెసేజ్ పెట్టడమే తప్పు అని నువ్వు అనుకుంటున్నావా అని అడుగుతాడు బాబాయి. దీంతో తను తప్పుకున్నానని పేపర్ వాళ్లతో చెప్పి నా కెరీర్ కే మచ్చను తీసుకొచ్చింది. అంత అన్యాయం నేను ఏం చేశాను బాబాయి. తను ఎందుకు ఇలా చేసింది అంటాడు సామ్రాట్. దీంతో తులసిది అలా చేసే వ్యక్తిత్వం కాదురా అంటాడు బాబాయి. దీంతో నేను కూడా అలాగే అనుకున్నాను అంటాడు సామ్రాట్. నువ్వు ఒక్క నిమిషం ఆగు నేను తులసితో ఒకసారి మాట్లాడుతాను.. అని ఫోన్ చేయబోతుండగా తన ఫోన్ ను విసిరేస్తాడు సామ్రాట్. ఇప్పుడు నేను తులసి ఇంటికే వెళ్లి వస్తున్నాను అంటాడు సామ్రాట్.

Advertisement

నీలాంటి మొండి వాడికి సమాధానం చెప్పడం ఎందుకు అని తులసి ఏం మాట్లాడుకుండా ఉండి ఉంటుంది అంటాడు బాబాయి. ఈరోజు నుంచి తులసి డిస్కషన్ మన మధ్య రాకూడదు. అర్థం అయిందా అంటాడు సామ్రాట్. ఇంతలో హనీ అక్కడికి వస్తుంది. నాన్నా తులసి ఆంటి 2 రోజుల నుంచి కనిపించడం లేదు.. ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు.. ఎందుకలా అని అడుగుతుంది హనీ.

Intinti Gruhalakshmi 8 Sep Today Episode : బాబాయిపై సామ్రాట్ సీరియస్

ఒకసారి ఫోన్ చేయవా.. బెంగ పెట్టుకుంటుందేమో.. ఫోన్ చేసి రమ్మను.. అంటుంది హనీ. దీంతో సామ్రాట్ కు కోపం వస్తుంది. హనీపై అరుస్తాడు సామ్రాట్. దీంతో తాతయ్య అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తుంది. దీంతో ఒరేయ్ చిన్నపిల్లరా ఎలా ఏడుస్తుందో చూడు అంటాడు.

Advertisement

ఇంకోసారి తులసి గురించి మాట్లాడితే బాగుండదు. లోపలికి వెళ్లు అని హనీని బెదిరిస్తాడు సామ్రాట్. దీంతో ఇక నువ్వు పెళ్లి చేసుకోకురా.. వచ్చేదాని జీవితాన్ని కూడా నాశనం చేయకు అని చెప్పి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు బాబాయి.

నా మీదికైతే కొట్టడానికి ఆవేశంగా దూసుకొచ్చావు కదా. సామ్రాట్ గారి ముందు వానపాములా ముడుచుకొని కూర్చున్నావు. ఏమైంది ఆ పౌరుషం అంటూ అభి, ప్రేమ్ ను నిలదీస్తాడు. దీంతో ఏం సమాధానం చెప్పమంటావమ్మా వాడికి. ఎందుకు నా చేతులు కట్టేశావు అని అంటాడు ప్రేమ్.

పరందామయ్య కూడా తులసినే తప్పు పడతాడు. కుటుంబ సభ్యులు అందరూ తులసినే తప్పు పడతారు. దీంతో ఆయన ఆవేశంలో ఉన్నారు. మన మాట వినరు. అందుకే ఆయనకు ఏం సమాధానం చెప్పలేదు అంటుంది తులసి.

ఆయనకు జరిగిన నష్టం గురించి నేను బాధపడుతున్నా అంటుంది తులసి. మరోవైపు లాస్య, నందు చాలా సంతోషంలో ఉంటారు. నా ముందు తల ఎగరేసిన తులసి.. ఇక తల ఎత్తుకోలేదు అంటాడు నందు.

Advertisement

రేపే వినాయకచవితి.. ప్రశాంతంగా పూజ చేసుకుందాం అంటుంది లాస్య. సామ్రాట్ కోపం చల్లారాక హనీ దగ్గరికి వెళ్తాడు. బతిమిలాడుతాడు. కానీ.. హనీ భయపడుతుంది. తన దగ్గరికి రావద్దు అంటుంది హనీ.

ఆ తర్వాత మెల్లగా హనీ దగ్గరికి వెళ్లి తనను ఓదార్చుతాడు సామ్రాట్. ఇంతలో బాబాయి వస్తాడు. హనీకి తులసి విషయంలో అబద్ధం చెబుతాడు. దీంతో హనీ థాంక్యూ నాన్న అంటుంది. వెళ్లి తులసికి ఫోన్ చేస్తుంది హనీ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి