
hamida Revel with shriram in Bigg boss 5 telugu
Hamida : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ ప్రస్తుతం నడుస్తున్నది. ఈ సీజన్ గత సీజన్స్ కంటే చాలా భిన్నంగా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ‘బిగ్ బాస్’లో 19 మంది పార్టిసిపెంట్స్ ఉండగా ఒక్కొక్క వారం ఒకరు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు. ఐదో వారం హమీదా హౌజ్ నుంచి బయటకు వచ్చేయగా, ప్రజెంట్ హౌజ్‌లో 14 మంది ఉన్నారు.ఇకపోతే ‘బిగ్ బాస్’ హౌజ్ నుంచి బయటకు వచ్చిన వారిలో ఎవరో ఇద్దరు ప్రేమలో పడిపోతుండటం మనం చూడొచ్చు. కాగా తాజాగా మరో ప్రేమ జంట విషయం బయటకు వచ్చింది.
హౌజ్‌లో ఉన్న ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్రతో తనకున్న రిలేషన్ గురించి ఓపెన్ అయింది హమీదా..హౌజ్‌లోనూ వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడవడం మనం చూడొచ్చు. ఈ లవ్ ట్రాక్ గురించి అప్పుడప్పుడు వ్యాఖ్యాతగా ఉన్న టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రమోట్ కూడా చేశాడు. ఈ క్రమంలోనే ‘బిగ్ బాస్’ ఇంటి నుంచి బయటకు వచ్చేసిన హమీదా.. తన హౌజ్ జర్నీ గురించి వివరించడంతో పాటు హౌజ్‌లో జరిగిన రచ్చ, ఇతర విషయాలను పలు ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ క్రమంలోనే శ్రీరామ్‌తో తనకున్న సంబంధం వివరించింది.
hamida Revel with shriram in Bigg boss 5 telugu
హౌజ్ నుంచి బయటకు రావడం కంటే కూడా శ్రీరామ్‌ను వదిలి బయటకు రావడం తనను బాధించిందని తెలిపింది.ఈ క్రమంలోనే ఇంకో అడుగు ముందుకేసి మాట్లాడింది హమీదా.. శ్రీరామ్‌తో తన రిలేషన్ హౌజ్ వరకే పరిమితం కాదని, బయటకు వచ్చిన తర్వాత కూడా కొనసాగుతుందని చెప్పింది. మొత్తానికి అసలు విషయం అలా ఓపెన్ గానే బయటకు చెప్పింది. శ్రీరామ్‌తో తాను హృదయం నుంచి కనెక్ట్ అయ్యానని, ఈ రిలేషన్‌ను ఒకవేళ అందరు ప్రేమ అనుకుంటే కనుక అది ప్రేమే అని పేర్కొంది హమీదా.
hamida Revel with shriram in Bigg boss 5 telugu
తమ రిలేషన్ ముందుకు కొనసాగే విషయమై శ్రీరామ్ హౌజ్ నుంచి బయటకు వచ్చాక నిర్ణయించుకుంటామని చెప్పింది. తాను హౌజ్‌లో కెప్టెన్ అవ్వాలనుకున్నానని, కాని మధ్యలోనే బయటకు వచ్చేశానని కన్నీటి పర్యంతమైంది హమీదా. ఇకపోతే హౌజ్‌లో తనకు ఇండియన్ ఐడల్ శ్రీరామ్ తర్వాత బాగా నచ్చింది యాంకర్ రవి అని చెప్పింది. యాంకర్ రవిని తాను అన్నయ్య అని పిలుస్తానని అంది. తనకు, శ్రీరామ్‌కు మధ్య మాటలు ఉండబోవని, కంటి చూపుతోనే తాము ఒకరినొకరు అర్థం చేసుకుంటామని, మాట్లాడుకుంటామని హమీదా వివరించింది.
సినిమా రంగంలో పాత సూపర్ హిట్ చిత్రాల టైటిళ్లను మళ్ళీ వాడుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ఒక సినిమా…
Chiranjeevi Davos : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) సదస్సు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర…
Kisan Vikas Patra 2026 : డబ్బు పొదుపు చేయడం చాలామందికి సాధ్యమే. కానీ ఆ పొదుపును ఎలాంటి రిస్క్…
Gold Price on Jan 21 : అంతర్జాతీయ అనిశ్చితి - సురక్షిత పెట్టుబడిగా బంగారం ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న…
Karthika Deepam 2 Today Episode : కార్తీక దీపం 2 టుడే జనవరి 21 ఎపిసోడ్ నవ్వులు, భయాలు,…
Box Office 2026 : జనవరి 2026 సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసింది. కేవలం…
Home Remedies: చాలా మంది ఇళ్లలో బొద్దింకలు, దోమలు, ఈగలు, చీమలు వంటి కీటకాలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా…
Blue Berries : మార్కెట్లో మనకు అనేక రకాల పండ్లు సులభంగా దొరుకుతుంటాయి. అయితే వాటిలో కొన్ని పండ్లను మాత్రమే…
This website uses cookies.