naga chaitanya samantha divorce
Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోతున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి అందరికీ విదితమే. కాగా వారి విడాకులపై బోలెడన్ని వార్తలొచ్చాయి. కొందరు సమంత నిర్ణయాన్ని తప్పుబడుతూ నెగెటివ్ కామెంట్స్ కూడా చేశారు. కాగా, తాజాగా నాగచైతన్య ఎక్కడుంటున్నాడు? ఆయన నివాసం ఏది ? అనే విషయమై నెట్టింట న్యూస్ వైరల్ అవుతున్నాయి.నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ముంబై వెళ్లిపోతున్నదనే వార్తలు ప్రచారమయ్యాయి. కానీ, తాను హైదరాబాద్‌లోనే ఉంటానని సమంత చెప్పింది. కాగా నాగచైతన్య ఎలాగూ హైదరాబాద్‌లోనే ఉంటారు.
naga chaitanya Divorce after Key decision
కానీ ఆయన ఎక్కడుంటారు? అనేది చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజులుగా నాగచైతన్య అక్కినేని ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారని, గచ్చిబౌలిలోని ఓ ఫ్లాట్‌లో ఉంటున్నారని, అక్కడి నుంచే శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ‘లవ్ స్టోరి’ ఫిల్మ్ షూటింగ్‌కు వచ్చారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలో నిజమేంత అనేది తెలియాల్సి ఉంది. కాగా గతేడాది నాగచైతన్య, సమంత వారి కోసం జూబ్లీహిల్స్‌లో విలాసవంతమైన భవనం కొనుగోలు చేశారని తెలుస్తోంది. ప్రజెంట్ ఆ ఇంటికి సంబంధించిన పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
naga chaitanya Divorce after Key decision
ఇంటీరియర్ వర్క్స్‌తో పాటు రూమ్స్ కన్‌స్ట్రక్షన్, గార్డెన్ ఇతర పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తి కావడానికి ఇంకా ఏడాది టైం పడుతుందట. ఈ నేపథ్యంలోనే అదే అపార్ట్‌మెంట్‌లో నాగచైతన్య మరో ఇల్లు కొనుగోలు చేశారట. అందులోనే ఉంటూ కొత్త ఇల్లుకు సంబంధించిన పనులు దగ్గరుండి చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వార్తలు నెట్టింట సందడి చేస్తున్నాయి. అయితే, ఈ వార్తల్లో నిజమెంత అనేది అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తే కాని తెలియదు. ఇకపోతే నాగచైతన్య ప్రజెంట్ ‘లవ్ స్టోరి’ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలో తండ్రి నాగార్జునతో కలిసి చేయబోయే ‘బంగార్రాజు’ సినిమ షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. ఇకపోతే సమంత సైతం పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’, వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతితో కలిసి నటిస్తున్న ‘కాతు వాకులా రెండు కాదల్’ చిత్రాలను పూర్తి చేసింది.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.