
Hansika about to get married, will soon get engaged to businessman
Hansika : పాలబుగ్గల సుందరీ హన్సిక త్వరలోనే పెళ్లిపీటలెక్కేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. ఒకప్పుడు మూడు భాషల్లో వరుసగా సినిమాలు చేసిన హన్సిక ఈ మధ్యకాలంలో అస్సలు కనిపించడం లేదు. సినిమాలు తగ్గిపోవడంతో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యినట్టు తెలుస్తోంది. దేశముదురు చిత్రంతో పదహారేళ్ళ వయసులోనే గ్లామరస్ హీరోయిన్‌గా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది హన్సిక. బొంబాయికి చెందిన హన్సిక అతి తక్కువ సమయంలోనే గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఈ బ్యూటీ ఎక్కువగా పెద్ద మూవీ అవకాశాలు అందుకోలేకపోయింది. ఎప్పటికప్పుడు మిగతా హీరోయిన్స్ కూడా పోటీ ఇవ్వలేకపోవడంతో చాలా ఆఫర్స్ చేతులరా మిస్ చేసుకోవాల్సి వచ్చింది.
చిన్నతనం నుండే హన్సికా మోత్వాని ముంబైలో సెటిల్ అయిన ఒక సింధీ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ప్రదీప్ మోత్వాని ఒక ప్రముఖ బుసినెస్ మ్యాన్. ఇక హన్సికా చిన్నతనం నుంచే యాక్టింగ్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ పెంచుకుంది. చైల్డ్ యాక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. ‘షకలక బూమ్ బూమ్’అనే టెలివిజన్ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ఆమె కొన్ని హిందీ చిత్రాల్లో చిన్న పాత్రల్లోనూ నటించింది.ఆ తర్వాత తమిళ్, తెలుగు, మలయాళం అని తేడా లేకుండా దాదాపు అన్ని భాషల్లోనూ నటించిన హన్సిక.. తెలుగులో మస్కా, కందిరీగ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది.
Hansika about to get married, will soon get engaged to businessman
ఇక తమిళంలో సూర్య, విజయ్ వంటి టాప్ హీరోలతో కూడా ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంది. చివరగా తెలుగులో తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ చిత్రంలో నటించిన ఈ అమ్మడు.. మహా అనే పాన్ ఇండియా మూవీ చేసింది. కానీ ఆ మూవీ హిట్ కాకపోవడంతో ఇక సినిమాల్లో కనిపించడం ఆపేసింది. ఈ క్రమంలోనే దక్షిణాదికి చెందిన ఓ బడా పోలిటీషియన్ కొడుకుతో ఏడడుగులు వేసేందుకు హన్సిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.అయితే, అదంతా వాస్తవం కాదని భర్త వ్యాపార రంగంలో స్థిరపడ్డాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇరు కుటుంబాలు కలిసి చర్చించుకున్నట్టు సమాచారం. త్వరలోనే నిశ్చితార్థానికి తేదీ కూడా ఫిక్స్ చేయనున్నారని టాక్. ఇందులో ఎంతమేర వాస్తవం ఉందనే దానిపై త్వరలోనే తెలియనుంది.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.