Jr NTR : నందమూరి కళ్యాణ్ రామ్ – Kalyan Ram హీరోగా నటించిన బింబిసార సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ను 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించినా కూడా కేవలం 13 కోట్ల రూపాయలకు మాత్రమే అమ్మాల్సి వచ్చింది. సినిమా ను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్క బయ్యర్ కూడా ముందుకు రాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఆ మొత్తంకు అమ్మేయాల్సి వచ్చింది. ఇప్పుడు సినిమా కేవలం మూడు రోజుల్లోనే ఆ మొత్తంను రాబట్టి లాభాల బాట పట్టింది.
సినిమాకు వచ్చిన బజ్ నేపథ్యంలో భారీ ఎత్తున ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమాకు పాజిటివ్ టాక్ దక్కిన కారణంగా లాంగ్ రన్ లో కూడా ఈ సినిమా భారీగా వసూళ్లు నమోదు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంతో బింబిసార సినిమా ఈ ఏడాదిలోనే మేటి సినిమాల జాబితాలో నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరో వైపు బింబిసార సినిమా యొక్క లాభాల వాటా గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్టీఆర్ కి వాటా ఉంది అనేది గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చ. ఎన్టీఆర్ ఆర్ట్స్ లో వాటా ఉన్న కారణంగానే తన ప్రతి సినిమాలో కూడా ఆ బ్యానర్ ను నిర్మాణ భాగస్వామిగా ఎన్టీఆర్ చేస్తున్నాడని సమాచారం అందుతోంది.
ఎన్టీఆర్ ఆర్ట్స్ లో ఉన్న వాటా కారణంగానే ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమంలో తనవంతు పాల్గొన్నాడు. అందుకే ఇప్పుడు బింబిసార సినిమా లాభాల్లో కచ్చితంగా ఎన్టీఆర్ కి వాటా ఉండి ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో మరియు సినీ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మేము అంతా ఒక కుటుంబం. మా మధ్య లెక్కలు ఉండవు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. మరి ఎన్టీఆర్ కి కళ్యాణ్ రామ్ బింబిసార లాభాల్లో వాటా ఇస్తాడా… కచ్చితంగా 10 నుండి 15 కోట్ల వరకు కళ్యాణ్ రామ్ లాభం గా దక్కించుకుంటాడు. మరి అందులో ఎన్టీఆర్ కి ఎన్ని కోట్లు ఇస్తాడు అనేది నందమూరి ఫ్యాన్స్ లో మెదులుతున్న ప్రశ్నలు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.