Hari Hara Veera Mallu Collections : ప్రీమియర్ షోస్ కలెక్షన్లను తిరగరాసిన హరిహర వీరమల్లు..!
ప్రధానాంశాలు:
హరి హర వీరమల్లు అసలైన ప్రీమియర్ కలెక్షన్స్ ఇవే
హరి హర వీరమల్లు ప్రీమియర్ కలెక్షన్స్ రిపోర్ట్
Hari Hara Veera Mallu Collections : ప్రీమియర్ షోస్ కలెక్షన్లను తిరగరాసిన హరిహర వీరమల్లు..!
Hari Hara Veera Mallu Collections : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు సినిమా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన చిత్రం. భారీ అంచనాల నడుమ, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి టికెట్ ధరల పెంపు, అలాగే ప్రీమియర్ షోలకు ప్రత్యేక అనుమతులు తీసుకుని, భారీ ఎత్తున ప్రీమియర్లతో థియేటర్లలో అడుగుపెట్టింది. ఏపీలో ప్రీమియర్లకు ముందు రోజే అనుమతులు రావడంతో అక్కడ హౌస్‌ఫుల్ షోలతో సినిమాకు బ్రహ్మరథం పట్టారు. నైజాంలో పర్మిషన్ వచ్చినా, డిస్ట్రిబ్యూటర్ – ఎగ్జిబిటర్ల మధ్య ఏర్పడిన సమస్యల కారణంగా కేవలం షోకు 5 గంటల ముందు మాత్రమే బుకింగ్స్ ఓపెన్ అయినా, ప్రేక్షకుల స్పందన అపూర్వంగా సాగింది.

Hari Hara Veera Mallu Collections : ప్రీమియర్ షోస్ కలెక్షన్లను తిరగరాసిన హరిహర వీరమల్లు..!
Hari Hara Veera Mallu Collections : నైజాం లో ప్రీమియర్ షోస్ తోనే సరికొత్త రికార్డు నెలకొల్పిన వీరమల్లు
ప్రీమియర్స్ తో పవన్ కళ్యాణ్ అదరగొట్టాడు. ముఖ్యంగా నైజాంలో రూ. 5.08 కోట్లు గ్రాస్ రాబట్టి ఆల్ టైమ్ ప్రీమియర్ రికార్డు సృష్టించింది. తూర్పు గోదావరిలో రూ. 1.53 కోట్ల షేర్, వెస్ట్ గోదావరిలో రూ. 1.42 కోట్ల షేర్, కృష్ణా జిల్లాలో రూ. 81 లక్షల షేర్ వసూలు చేసింది. ఉత్తరాంధ్రలో రూ. 2.32 కోట్ల గ్రాస్ నమోదు చేసింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ద్వారా సుమారు రూ. 18 కోట్లకు పైగా వసూళ్లు నమోదు కాగా, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కలిపి మరో రూ. 2 కోట్ల వసూళ్లు వచ్చాయి.
ప్రీమియర్స్‌కు ముందు పెద్దగా బజ్ లేకపోయినా, పవన్ కళ్యాణ్ స్టార్ డమ్‌ను అర్థం చేసుకునేలా కలెక్షన్లు రావడం విశేషం. ఏపీ లోని కొన్ని ప్రాంతాల్లో నిర్మాత ఏఎం రత్నం స్వయంగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం షోలు కూడా తెలుగు రాష్ట్రాల్లో హౌస్‌ఫుల్ గా నడుస్తున్న నేపథ్యంలో, ప్రీమియర్ షోలు + డే 1 కలిపి రూ. 50 కోట్ల షేర్ దాటి పోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.