Hari Hara Veera Mallu : వీరమల్లు టికెట్ ధరల ఇష్యూ… అంబటి vs రత్నం..!
Hari Hara Veera Mallu : ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల పెంపు చుట్టూ రాజకీయ వాదనలు వేడెక్కుతున్నాయి. ఇటీవల విడుదలైన హరిహర వీరమల్లు చిత్రానికి భారీగా టికెట్ ధరలు పెంచడం పై వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేస్తూ “టికెట్ ధరలు పెంచి వారి జేబులు నింపుకుంటున్నారు. ఇది ప్రజలపై ఆర్థిక భారం” అని వ్యాఖ్యానించారు. ఆయనతో పాటు మరో వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా “కూటమి సర్కార్ సామాన్యులను ఆదుకునే బదులు భారం వేస్తోంది” అంటూ మండిపడ్డారు.
Hari Hara Veera Mallu : వీరమల్లు టికెట్ ధరల ఇష్యూ… అంబటి vs రత్నం..!
Hari Hara Veera Mallu : రాంబాబు సినిమా నిర్మించడం అంటే రోడ్ల పై డాన్సులు వేసినట్లు కాదు – ఏ ఎం రత్నం కౌంటర్
వైసీపీ నేతల విమర్శలపై హరిహర వీరమల్లు నిర్మాత ఏ.ఎం.రత్నం తీవ్రంగా స్పందించారు. “రోడ్డు మీద డాన్స్ చేయడం కాదు… ఒక గొప్ప సినిమా తీయాలంటే ఎంత కష్టం అవుతుందో..ఓ సినిమా చేస్తే తెలుస్తుంది ” అని అంబటి రాంబాబుకు సూటిగా కౌంటర్ ఇచ్చారు. సినిమాను నిర్మించడం, ప్రచారం చేయడం, విడుదల చేయడం ఇలా అన్ని వ్యయాలనీ, వాటిని తిరిగి పొందడం కోసం ప్రభుత్వం ప్రత్యేక టికెట్ ధరల అనుమతి ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు.
ఈ వివాదం నేపథ్యంలో సినిమా వ్యాపారంలో ప్రభుత్వ పాత్రపై పెద్ద చర్చ ప్రారంభమైంది. టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండాలి అనే వాదన ఒక వైపు ఉంటే, ఖరీదైన బడ్జెట్ సినిమాలకు ఖర్చును తిరిగి రాబట్టాలంటే అధిక ధరల అనుమతి అవసరం అనే వాదన మరోవైపు వినిపిస్తోంది. అయితే దీనిపై స్పష్టమైన విధానం లేకపోవడం వల్ల ప్రజలతో పాటు రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరుతోంది.
