Harish Shankar : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హరీష్ శంకర్,చోటా కే నాయుడు మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ‘రామయ్య వస్తావయ్యా’ చిత్రం విషయంలో డైరెక్టర్ హరీశ్ శంకర్‌పై సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు ఇటీవలే కొన్ని కామెంట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. 11 ఏళ్ల క్రితం ఆ మూవీ షూటింగ్‍లో జరిగిన విషయాలను చోటా చెప్పుకొచ్చారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తన పనికి హరీశ్ శంకర్ తరచూ అడ్డుపడే వారని చోటా చెప్పడంతో హరీష్ శంకర్ ఈ విషయంలో ఏకంగా నోట్ విడుదల చేస్తూ సినిమాటోగ్రాఫర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మేటర్‌లోకి వెళితే ఓ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ చేసే అతను అడగకపోయినా చోటా కే నాయుడు హరీష్ శంకర్ ప్రస్తావన తీసుకొచ్చి.. హరీష్ శంకర్ తన మాట వినలేదని, ఏదేదో చెప్పేవాడిని.. ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో.. కోపం వచ్చినా సరే.. ఒక్క నిమిషం పాటు ఆలోచించి.. తను చెప్పిందే చేశానని అన్నాడు.
అయితే చోటా కే నాయుడు కామెంట్స్‌పై హరీష్ శంకర్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశాడు. అందులో హరీష్ శంకర్… చోటా కే నాయుడు గారికి నమస్కరిస్తూ అంటూ మొదలు పెట్టారు. రామయ్య వస్తావయ్య సినిమాలో మధ్యలోనే తాను చోటా కే నాయుడును తీసేయాలని అనుకున్నానని, కానీ నిర్మాత దిల్‍రాజు చెప్పడం సహా అందరూ ఏమనుకుంటారోనని అలా చేయలేదని డైరెక్టర్ హరీశ్ శంకర్ తన నోట్‍లో వెల్లడించారు. “ఓ సందర్భంలో మిమ్మల్ని (చోటా కే నాయుడు) తీసేసి వేరే కెమెరామెన్‍తో షూటింగ్ చేద్దామనే ప్రస్తావన వచ్చింది. అయితే, గబ్బర్ సింగ్ అవకాశం వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామెన్‍ను తీసేస్తున్నాడని పది మంది పది రకాలుగా అనుకుంటారనో.. రాజుగారు (దిల్‍రాజ్) చెప్పడం వల్లనో మీతోనే సినిమా పూర్తి చేశా” అని హరీశ్ శంకర్ పేర్కొన్నారు.
పదేళ్లలో చోటా కే నాయుడు ఉదాహరణకు ఓ 10 ఇంటర్వ్యూలు ఇస్తే.. తను 100 ఇచ్చి ఉంటానని హరీశ్ శంకర్ తెలిపారు. కానీ ఆయనపై తాను ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని హరీశ్ చెప్పారు. “నేను ఎప్పుడూ.. ఎక్కడా మీ గురించి తప్పుగా మాట్లాడలేదు. కానీ మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానకరంగా మాట్లాడారు. ఇప్పుడు ఇంటర్య్వూ చేసిన వ్యక్తి అడగకపోయినా.. నా ప్రస్తావన రాకున్నా.. నాకు సంబంధం లేకున్నా.. నా గురించి అవమానకరంగా మాట్లాడారు” అని హరీశ్ శంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.చోటా కే నాయుడు తన గురించి చాలాసార్లు మాట్లాడినా.. తాను మౌనంగానే ఉన్నానని హరీశ్ శంకర్ తన నోట్‍లో తెలిపారు. అయితే తన స్నేహితులు, తనను అభిమానించే వారు ప్రశ్నిస్తుండటంతో ఇప్పుడు ఇది రాయాల్సి వస్తుందని పేర్కొన్నారు. చోటాతో పని చేయడం తనను బాధపెట్టినా.. ఆయన అనుభవం నుంచి కాస్త నేర్చుకున్నానని, దయచేసి గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటూ ఫైర్ అయ్యారు డైరెక్టర్ హరీశ్ శంకర్.ఈ విషయాన్ని చోటా కే నాయుడు ఇక్కడితో వదిలేయాలని, అలా కాదని మళ్లీ మాట్లాడతానంటే ఏ రోజైనా.. ఎక్కడైనా.. తాను వేచి చూస్తుంటానని హరీశ్ శంకర్ ఘాటుగా హెచ్చరించారు
Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…
CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 98 పోస్టుల…
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్‌సి అన్నారు.…
Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే…
Hyderabad Air Quality : ఇన్నాళ్లు ఢిల్లీలో వాయి కాలుష్యం ఎక్కువ అని వినేవాళ్లం. కాని ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా…
Devi Sri Prasad : పుష్ప2 మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్‌కి నిర్మాతలకి గొడవలు జరిగినట్టు అనేక వార్తలు…
Groom Chase : అచ్చం సినిమాలో జరిగిన చేజ్ సీన్ విధంగా బయట ఓ సంఘటన జరిగింది. విలన్ పారిపోతుంటే…
This website uses cookies.