Mahesh Babu : మహేశ్ బాబు న్యూ లుక్‌ చూశారా.. రాజమౌళి ఇలా ప్లాన్ చేస్తున్నాడా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mahesh Babu : మహేశ్ బాబు న్యూ లుక్‌ చూశారా.. రాజమౌళి ఇలా ప్లాన్ చేస్తున్నాడా..!

Mahesh Babu : దేశ వ్యాప్తంగా మోస్ట్ వెయిటెడ్ మూవీ ఏదైనా ఉందా అంటే అది కచ్చితంగా రాజమౌళి-మహేశ్ బాబు మూవీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే రాజమౌళి క్రేజ్ ఇప్పుడు అలా ఉంది మరి. ఆయన తీసిన బాహుబలి సిరీస్ తర్వాత త్రిబుల్ ఆర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. దాంతో రాజమౌళి పేరు నేషనల్ వైడ్ గానే కాకుండా అటు ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా మార్మోగిపోతోంది. దీంతో ఆయన నెక్ట్స్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 April 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Mahesh Babu : మహేశ్ బాబు న్యూ లుక్‌ చూశారా.. రాజమౌళి ఇలా ప్లాన్ చేస్తున్నాడా..!

Mahesh Babu : దేశ వ్యాప్తంగా మోస్ట్ వెయిటెడ్ మూవీ ఏదైనా ఉందా అంటే అది కచ్చితంగా రాజమౌళి-మహేశ్ బాబు మూవీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే రాజమౌళి క్రేజ్ ఇప్పుడు అలా ఉంది మరి. ఆయన తీసిన బాహుబలి సిరీస్ తర్వాత త్రిబుల్ ఆర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. దాంతో రాజమౌళి పేరు నేషనల్ వైడ్ గానే కాకుండా అటు ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా మార్మోగిపోతోంది. దీంతో ఆయన నెక్ట్స్ మూవీ ఎవరితో తీస్తారా అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన మహేశ్ బాబుతో మూవీ తీస్తున్నట్టు ప్రకటించాడు.

Mahesh Babu : గుంటూరు కారం ప్లాప్..

ఇక రీసెంట్ గానే మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాతో పెద్ద ప్లాప్ ను మూటగట్టుకున్నాడు. దాంతో ఇప్పుడు రాజమౌళి సినిమాతో తన మార్కెట్ ను ఇమేజ్ ను పెంచుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. పూర్తిగా అడ్వెంచర్ నేపథ్యంలో ఉంటున్న ఈ మూవీ గురించి ఇప్పటికే చాలానే అంచనాలు ఉన్నాయి. కాగా ఇందులో మహేశ్ బాబు ఎలా ఉంటాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా మహేశ్ బాబుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది.

Mahesh Babu మహేశ్ బాబు న్యూ లుక్‌ చూశారా రాజమౌళి ఇలా ప్లాన్ చేస్తున్నాడా

Mahesh Babu : మహేశ్ బాబు న్యూ లుక్‌ చూశారా.. రాజమౌళి ఇలా ప్లాన్ చేస్తున్నాడా..!

ఓ పెళ్లి వేడుకకు మహేశ్ బాబు వెళ్లాడు. కాగా అక్కడకు ఆయన అక్క మంజుల కూడా వచ్చింది. ఇక మంజుల మహేశ్ బాబునుచూసి ఆయన దగ్గరకు వచ్చింది. ప్రేమతో మహేశ్ బాబు జుట్టును నిమిరింది. ఇద్దరూ నవ్వుకుంటూ ఏదో మాట్లాడుకున్నారు. ఇందులో మహేశ్ బాబు గడ్డంతో పాటు జుంపాలు పెంచుకున్నాడు. ఇందులో చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. మహేశ్ బాబు అంటే మనకు గడ్డం లేకుండా నీటిగా ఉండే విధంగా కనిపిస్తాడు. కానీ ఇప్పుడు మాత్రం మహేశ్ బాబు ఇందులో లాంగ్ హెయిర్ తో కాస్త స్టైలిష్ గానే కనిపిస్తున్నాడు.దీంతో రాజమౌళి మూవీ కోసం ఇలాంటి లుక్ ను మహేశ్ బాబు ట్రై చేస్తున్నాడా అని అందరూ షాక్ అవుతున్నారు. ఎంతైనా రాజమౌళి సినిమాలో హీరోల గెటప్స్ కొంచెం డిఫరెంట్ గానే ఉంటాయి. ఇప్పుడు మహేశ్ బాబు కూడా ఎన్నడూ ట్రై చేయనిన్యూ లుక్ ను ఇందులో ట్రై చేస్తున్నాడు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది