Mahesh Babu : మహేశ్ బాబు న్యూ లుక్ చూశారా.. రాజమౌళి ఇలా ప్లాన్ చేస్తున్నాడా..!
Mahesh Babu : దేశ వ్యాప్తంగా మోస్ట్ వెయిటెడ్ మూవీ ఏదైనా ఉందా అంటే అది కచ్చితంగా రాజమౌళి-మహేశ్ బాబు మూవీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే రాజమౌళి క్రేజ్ ఇప్పుడు అలా ఉంది మరి. ఆయన తీసిన బాహుబలి సిరీస్ తర్వాత త్రిబుల్ ఆర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. దాంతో రాజమౌళి పేరు నేషనల్ వైడ్ గానే కాకుండా అటు ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా మార్మోగిపోతోంది. దీంతో ఆయన నెక్ట్స్ మూవీ ఎవరితో తీస్తారా అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన మహేశ్ బాబుతో మూవీ తీస్తున్నట్టు ప్రకటించాడు.
ఇక రీసెంట్ గానే మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాతో పెద్ద ప్లాప్ ను మూటగట్టుకున్నాడు. దాంతో ఇప్పుడు రాజమౌళి సినిమాతో తన మార్కెట్ ను ఇమేజ్ ను పెంచుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. పూర్తిగా అడ్వెంచర్ నేపథ్యంలో ఉంటున్న ఈ మూవీ గురించి ఇప్పటికే చాలానే అంచనాలు ఉన్నాయి. కాగా ఇందులో మహేశ్ బాబు ఎలా ఉంటాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా మహేశ్ బాబుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది.
Mahesh Babu : మహేశ్ బాబు న్యూ లుక్ చూశారా.. రాజమౌళి ఇలా ప్లాన్ చేస్తున్నాడా..!
ఓ పెళ్లి వేడుకకు మహేశ్ బాబు వెళ్లాడు. కాగా అక్కడకు ఆయన అక్క మంజుల కూడా వచ్చింది. ఇక మంజుల మహేశ్ బాబునుచూసి ఆయన దగ్గరకు వచ్చింది. ప్రేమతో మహేశ్ బాబు జుట్టును నిమిరింది. ఇద్దరూ నవ్వుకుంటూ ఏదో మాట్లాడుకున్నారు. ఇందులో మహేశ్ బాబు గడ్డంతో పాటు జుంపాలు పెంచుకున్నాడు. ఇందులో చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. మహేశ్ బాబు అంటే మనకు గడ్డం లేకుండా నీటిగా ఉండే విధంగా కనిపిస్తాడు. కానీ ఇప్పుడు మాత్రం మహేశ్ బాబు ఇందులో లాంగ్ హెయిర్ తో కాస్త స్టైలిష్ గానే కనిపిస్తున్నాడు.దీంతో రాజమౌళి మూవీ కోసం ఇలాంటి లుక్ ను మహేశ్ బాబు ట్రై చేస్తున్నాడా అని అందరూ షాక్ అవుతున్నారు. ఎంతైనా రాజమౌళి సినిమాలో హీరోల గెటప్స్ కొంచెం డిఫరెంట్ గానే ఉంటాయి. ఇప్పుడు మహేశ్ బాబు కూడా ఎన్నడూ ట్రై చేయనిన్యూ లుక్ ను ఇందులో ట్రై చేస్తున్నాడు.
GPO Posts : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ఉంది. గతంలో…
Janhvi Kapoor : టాలీవుడ్లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన…
Fathers Death : ఏ తండ్రికైనా తన కొడుకును పెళ్లి మండపంలో చూడాలని, మనవాళ్ళు , మానవరాళ్లతో ఆటలు ఆడుకోవాలని…
Chennai Super Kings : ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఆ జట్టు…
Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నుంచి ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒక్కడే…
Google Pay Phonepe : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏ పేమెంట్ చేయాలన్నా దాదాపు యూపీఐ పేమెంట్స్…
Alcohol :ప్రస్తుత కాలంలో మద్యానికి బానిసైన వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి మద్యాన్ని తాగడానికి అలవాటు పడితే జీవితంలో దాన్ని…
Chanakyaniti : చానిక్యుడు తన నీతి కథలలో మనవాలి జీవితాన్ని గురించి అనేక విషయాలను అందించాడు, కౌటిల్యు నీ పేరుతో…
This website uses cookies.