
Health Benefits In monsoon season to cure cold fever follow these food items
వర్షాకాలం మొదలైందంటే వివిధ రకాల వ్యాధులు మన శరీరాన్ని చుట్టుముడతాయి. ఈ వాతావరణం మార్పు వలన చాలామంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఈ కాలంలో చాలామందికి జలుబు పెద్ద సమస్యగా మారుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీని వలన జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు వెంటనే వస్తాయి. అందుకనే ఈ కాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. వర్షాకాలంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. బయట ఫుడ్స్ ని అసలు తినకూడదు. రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను తీసుకుంటే దగ్గు, జలుబు, జ్వరం నుండి విముక్తి పొందవచ్చు. అయితే ఏ ఏ ఆహార పదార్థాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1) వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లిలో మంచి ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి కూరల్లో రుచినివ్వడమే కాదు కొన్ని అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. వెల్లుల్లి తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లి కూరల్లో వేసుకుని తింటే రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు జలుబు,ప్లూ వంటి సమస్యలు రావు.
Health Benefits In monsoon season to cure cold fever follow these food items
2) వానాకాలంలో తప్పక తీసుకోవాల్సిన ఆహార పదార్థాలలో ఒకటి అల్లం. అల్లం తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే జలుబు నుండి ఉపశమనం దొరుకుతుంది. అల్లం టీ తాగినా మంచి ఫలితం ఉంటుంది. కూరల్లో వేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది.
3) అలాగే కొబ్బరి నీళ్లు కూడా శరీరానికి చాలా మంచివి. ఎండాకాలంలోనే కాదు వానాకాలంలో కూడా శరీరం డిహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. ఎందుకంటే వానాకాలంలో దాహం వేయదు. దీనివలన చాలామంది తక్కువగా నీళ్లు త్రాగుతారు. ఇలా తక్కువగా త్రాగితే బాడీ డిహైడ్రేషన్ బారిన పడుతుంది. అందుకనే కొబ్బరి నీళ్లను త్రాగాలి. ఇందులోని ఎలెక్ట్రోలైట్స్ అన్ని రకాలుగా మంచివి.
4) వర్షాకాలంలో వేడి వేడి సూప్ తాగితే చాలా బాగుంటుంది. గోరువెచ్చని సూప్ తాగడం వలన గొంతు నొప్పి, ముక్కుదిబ్బడ లాంటి సమస్యలు దూరం అవుతాయి. వెజ్ సూప్స్, చికెన్ సూప్స్, గార్లిక్ సూప్స్ ఇలా పలు రకాల సూప్స్ ను ట్రై చేయవచ్చు. ఇందులో కొద్దిగా మిరియాల పొడిని వేసుకొని త్రాగితే ముక్కుదిబ్బడ నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
5) వానాకాలంలో ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ ని తినాలి. సాల్మాన్ చేపలు, గుడ్లు, చికెన్, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇది శరీరం జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరిచి ఇమ్యూనిటీని పెంచుతాయి. అలాగే వేడి వేడి ఆహారాన్ని తీసుకోవాలి. చలిగా ఉంటుంది కాబట్టి వేడి భోజనం చేస్తే బాడీ రిలీఫ్ గా ఉంటుంది. అలాగే జలుబు చేస్తే తరచూ ఆవిరి పట్టుకోవాలి.
Super Foods : ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన డైట్లు విదేశీ సూపర్ ఫుడ్స్ తప్పనిసరి అనే భావన ఇప్పుడు మారుతోంది.…
Ratha Saptami 2026: సనాతన ధర్మంలో సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తారు. సమస్త లోకాలకు వెలుగును శక్తిని అందించే…
Chicken with skin vs without skin: చాలామందికి చికెన్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. కొందరైతే ప్రతిరోజూ తినమన్నా…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Vijayasai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ కీలక నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన…
School Holidays : సంక్రాంతి పండుగతో ముగిసిన సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న వేళ, ఈ నెలాఖరులో విద్యార్థులకు…
Renu Desai Mahesh Babu : రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బద్రి సినిమాతో హీరోయిన్గా…
Mana Shankara Vara Prasad Garu Hook Step: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘…
This website uses cookies.