
actress
ఒకప్పటి నటి హేమమాలిని గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అప్పట్లో సినిమాలో హేమమాలిని చూడడానికి కుర్రాళ్ళు ఎగబడేవారు. మరీ ముఖ్యంగా హేమమాలిని ఐటెం గర్ల్ గా చాలా సినిమాలలో చేశారు. దీంతో ఆమెకు అప్పట్లో బాగా క్రేజ్ ఉండేది. తన అందం, నటనతో ప్రేక్షకులను అలరించిన హేమమాలిని ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఈమె సీనియర్ నటుడు ధర్మేంద్రను ప్రేమించి వివాహం చేసుకున్నారు. 1980లో వీరికి పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇక ధర్మేంద్రకీ ఇది రెండవ వివాహం. మొదటి భార్య ప్రకాష్ కౌర్ కి ఐదుగురు సంతానం.
అందులో సన్నీ డియోల్, బాబి డియో హీరోలు అయ్యారు. మిగతా ముగ్గురు అమ్మాయిలు. ఇక హేమమాలినికి ఇద్దరు ఆడపిల్లలు. అయితే చాలా కాలంగా హేమమాలిని భర్తకు దూరంగా ఉంటుంది. ఈ విషయంపై హేమమాలిని తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. మీరు ఫెమినిస్ట్ ఐకాన్ కదా భర్తకు దూరంగా జీవించడానికి ఇది కూడా కారణమా అని అడిగారు. దానికి బదులుగా ఆమె నవ్వుతూ భర్తకు దూరంగా ఉండాలని ఎవరూ కోరుకోరు. ప్రతి భార్య భర్త, పిల్లలతో కలిసి జీవించాలనుకుంటుంది. కానీ జీవితం ఏది ఇస్తుందో దానిని స్వీకరించాలి. మనం కలిసి బ్రతకాలని జీవించాలని అనుకున్నప్పటికీ కొన్నిసార్లు లెక్కలు తప్పుతాయి. ఎవరు జీవితాన్ని ఒంటరిగా జీవించాలని కోరుకోరు అని అన్నారు.
actress
భర్తకు దూరంగా ఉన్నందుకు నేను ఏమీ బాధపడటం లేదు. నేను నాతో ఆనందంగా జీవిస్తున్నాను నాకు ఇద్దరు కూతుర్లు. వాళ్లను నేను చాలా గొప్పగా పెంచాను. ధర్మేంద్ర మాత్రం ఎక్కువగా అక్కడే ఉండేవారు. అయితే పిల్లల పెళ్ళిళ్లు జరగాలని ఆశపడేవాడు. ఎప్పుడు దాని గురించే ప్రస్తావించేవాడు. నేను అవి జరగాల్సినప్పుడు జరుగుతాయి అని చెబుతూ ఉండేదాన్ని. దేవుడి దయవల్ల మా అమ్మాయిలకు పెళ్లిళ్లు అయ్యాయి. మేము అనుకున్నది ప్రతీది జరిగింది అని హేమమాలిని అన్నారు. ఇటీవల ధర్మేంద్ర మనవడి వివాహం జరిగింది. దానికి హేమమాలిని, ఆమె కూతుర్లు హాజరు కాలేదు. దీంతో ధర్మేంద్ర సోషల్ మీడియాలో కాస్త ఎమోషనల్ అయ్యారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.