Samantha : అర్ధరాత్రి కారులో ఆ పని చేస్తూ సమంత చేతికి దొరికిన స్టార్ డాటర్…!

Authored By Sam C | The Telugu News | Updated on : 9 October 2022, 2:30 pm

Samantha : ఈ రోజుల్లో డబ్బులున్న వాళ్ల పిల్లలు ఎలా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లకు అరచేతిలో ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. ఏం చేసినా తమ పేరెంట్స్ చూసుకుంటారు అని ధైర్యం వాళ్ళ కళ్ళలో కనిపిస్తుంది. ఎంత పెద్ద వాళ్ళనైనా ఎదిరించే దమ్ము డబ్బులో ఉంది.. ఇంకా చెప్పాలంటే చేతిలో డబ్బుంటే ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదని ఈ జనరేషన్ పిల్లలు అనుకుంటున్నారు. అందులోను సినిమా ఇండస్ట్రీ వాళ్ళ కొడుకులు, కూతుళ్లు అయితే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మాదిరి తగ్గేదే లే అంటున్నారు.. ఎవడొస్తాడు రానీ.. మా ఎంజాయ్ ఏం చేస్తామంటూ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అయితే ఒక స్టార్ డాటర్ ఇలాగే కారులో అర్ధరాత్రి ఒక అడ్డమైన పని చేస్తూ సమంత చేతికి చిక్కింది అని వార్తలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇండస్ట్రీ పిల్లలు అంటే పార్టీలు చాలా కామన్. అందులోనూ అర్ధరాత్రి పార్టీలు ఇంకా కామన్. ఆ మధ్య ముంబైలో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ కాని చేసిన రచ్చ అంత ఇంత కాదు. డ్రగ్స్ విషయంలో ఆయన దొరికిపోయి.. కొన్ని రోజులు జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. ఆ తర్వాత క్లీన్ చీట్ వచ్చింది.. కానీ దాన్ని ఎవరు నమ్మడం లేదు. పెద్దోళ్ల వారసులు అంటే కచ్చితంగా డ్రగ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ కామన్ అని అందరూ ఫిక్స్ అయిపోతున్నారు. దీనికి ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిస్థితులు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఇలాంటి సంఘటన ఇండస్ట్రీలో ఇంతకుముందు కూడా ఒకటి జరిగిందని తెలుస్తోంది. తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో ఇండస్ట్రీలో పేరు మోసిన ఒక స్టార్ హీరో కూతురు నానా రచ్చ చేసిందని ఒక న్యూస్ వైరల్ అవుతుంది.

hero daughter booked by samantha

hero daughter booked by samantha

Samantha : ఆ రోజు ఏమైందంటే..

ఆ పార్టీలో సమంత కూడా ఉందని.. అయితే కారులో ఒక చెత్త పని చేస్తూ సమంత దొరికిపోవడంతో బయటకి పిలిచి అనే క్లాస్ కూడా పీకిందని ప్రచారం జరుగుతుంది. “స్మోకింగ్ హెల్త్ కి మంచిది కాదు. మీ డాడీకి మంచి పేరుంది ఉంది. ఆ పేరు నువ్వు చెడగొట్టద్దు.. ఎంజాయ్ చేయాలి బట్ మన లిమిట్స్ లో ఉండాలి” అంటూ పెద్ద క్లాసే పీకిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ స్టార్ డాటర్ కూడా పాజిటివ్ గానే స్పందించింది.. ”క్షమించండి.. నెక్స్ట్ టైం ఇలా చేయను” అంటూ సమంతకు చెప్పిందని.. సీన్ కట్ చేస్తే విడాకులు తీసుకున్న తర్వాత అదే స్టార్ డాక్టర్ సమంతాను ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో విమర్శించిందని తెలుస్తోంది. నీతులు చెప్పిన ఈ హీరోయిన్ ఇప్పుడు చేసిన పని ఏంటో అంటూ నానా రచ్చ చేసింది. మొత్తానికి స్టార్ డాటర్, సమంత మధ్య జరిగిన ఇష్యూ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది.

Advertisement

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి