Hasthinapuram Movie : లాంఛనంగా ప్రారంభమైన యంగ్ హీరో కార్తీక్ రాజు సినిమా ‘హస్తినాపురం’

Hasthinapuram Movie : యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అథర్వ రిలీజ్‌కు సిద్దంగా ఉండగానే.. మరో చిత్రాన్ని పట్టాలెక్కించారు. అథర్వ ప్రమోషన్స్ చేస్తూ కొత్త ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు. కాసు క్రియేషన్స్ బ్యానర్ మీద కాసు రమేష్ నిర్మిస్తున్న ‘హస్తినాపురం’ అనే చిత్రంలో కార్తీక్ రాజు నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాజా గండ్రోతు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ తాజాగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో ఈ మూవీని ప్రారంభించారు. తొలి సన్నివేశానికి భీమనేని శ్రీనివాసరావు క్లాప్ కొట్టగా.. ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ దర్శకుడు వి.ఎన్.ఆదిత్య స్క్రిప్ట్ అందజేశారు. ఈ మూవీ ప్రారంభోత్సవంలో దర్శక నిర్మాతలు హీరో మాట్లాడారు. తమ ఆనందాన్ని పంచుకున్నారు.

నిర్మాత కాసు రమేష్ మాట్లాడుతూ.. ‘కార్తీక్ రాజు వద్ద మేకప్ మెన్, మేనేజర్‌గా ఉండేవాడ్ని. ఆయన నన్ను నిర్మాతను చేశారు. మా డైరెక్టర్ రాజా వివి వినాయక్ వద్ద అసిస్టెంట్‌గా పని చేశారు. కథలో దమ్ముంది కాబట్టే నిర్మిస్తున్నాం. మా చిత్రాన్ని ఆదిరించండి’ అని అన్నారు.దర్శకుడు భీమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘కార్తీక్ రాజు, నిషా హీరో హీరోయిన్లు. రాజా అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. వి వి వినాయక్ వద్ద రాజా అసిస్టెంట్‌గా పని చేశారు. మా కౌసల్యా కృష్ణమూర్తితో కార్తీక్ రాజుకు మంచి పేరు వచ్చింది. అథర్వ కూడా చాలా బాగుంటుంది. నేను చూశాను. ఈ చిత్రం కూడా పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.వి.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ.. ‘కౌసల్యా కృష్ణమూర్తి చూసి కార్తీక్ రాజుతో ఓ లవ్ స్టోరీని చేశాను. అది నెక్ట్స్ వాలెంటైన్స్ డేకి రాబోతోంది. అథర్వతో కార్తీక్ రాజు ఇమేజ్ మారబోతోంది. ఈ మూవీ కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ.. ‘హస్తినాపురం కొత్త పాయింట్‌తో రాబోతోంది. రెగ్యులర్ చిత్రంలా ఉండదు. మా డైరెక్టర్ అద్భుతంగా కథ రాసుకున్నారు. మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ ఆల్రెడీ హనుమాన్ సాంగ్‌తో ట్రెండింగ్‌లో ఉన్నారు. మా చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. ‘రాజా గారు ఓ మంచి కథతో రాబోతున్నారు. కార్తీక్ రాజుతో నాకు ఇది రెండో చిత్రం. ఈ చిత్రానికి పని చేయడం ఆనందంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.రాజా గండ్రోతు మాట్లాడుతూ.. ‘హస్తినాపురం అనే టైటిల్ వినగానే ఎంత పాజిటివిటీ ఉందో.. సినిమా కూడా అంతే ఉంటుంది. నా గురువు వినాయక్ గారి దగ్గర పని చేశాను. మంచి కథ, మంచి టీంతో రాబోతున్నాం. మా అందరినీ ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాను. నా మీద నమ్మకంతో నన్ను పిలిచి అవకాశం ఇచ్చిన మా రాజు గారికి, మా హీరో కార్తీక్ గారికి థాంక్స్ నిర్మాత రమేష్ గారికి థాంక్స్’ అని అన్నారు.హీరోయిన్ నిషా మాట్లాడుతూ.. ‘తెలుగులో మళ్లీ సినిమాను చేస్తుండటం ఆనందంగా ఉంది. ఇలాంటి డిఫరెంట్ మూవీలో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

Recent Posts

Mahaabhaaratam : మహాభారతంలో 3 కథలు చాలా ఆసక్తికరమైనవి… దీని గురించి మీకు తెలుసా…?

Mahaabhaaratam : మహాభారతం Mahaabhaaratam అంటే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుని లీలలు. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పే మంచి మాటలే మహాభారతం.…

51 minutes ago

New Villain : టాలీవుడ్‌కి కొత్త విల‌న్.. ఎవ‌రు ఈ ర‌ఘువ‌రన్..!

New Villain : ఈ మ‌ధ్య సినీ పరిశ్ర‌మ‌కి కొత్త న‌టీన‌టులు ప‌రిచ‌యం అవుతున్నారు. కుబేర‌ లో న‌టించిన విల‌న్…

10 hours ago

Surveyor Tejeshwar : వీడి మోజులో పడే కట్టుకున్న బంగారం లాంటి భర్తను చంపిన ఐశ్వర్య..!

Surveyor Tejeshwar : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న గంటా తేజేశ్వర్ హత్య కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…

11 hours ago

Neelima : “నిత్య పెళ్లికూతురు” ప్రచారంలో అసలు నిజమే లేదు.. 12 పెళ్లిళ్ల పై నీలిమ క్లారిటీ ..! వీడియో

Neelima  : అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ పై సోషల్ మీడియాలో “…

12 hours ago

Neelima : రెండేళ్లలో 12 పెళ్లిళ్లు చేసుకున్న నీలిమ.. విడాకులు తీసుకున్న వారే టార్గెట్..!

Neelima : రామచంద్రపురం పట్టణంలో ఒక మహిళ 12 పెళ్లిళ్లు చేసిన వార్త స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. నీలిమ…

12 hours ago

8 Vasantalu Movie : ప‌విత్ర కాశీలో క‌బేళాలా.. ఆ కులం వాళ్ల‌తోనే ఎందుకు రేప్ చేయించారు ? వీడియో

8 Vasantalu Movie : తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 8 వ‌సంతాలు. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి…

14 hours ago

Farmer : రైతులకు గుడ్‌న్యూస్‌.. అకౌంట్‌లో 90,000..!

Farmer : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అనేక రకాలుగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా…

15 hours ago

Daughter : చాకలి ఐలమ్మ మునిమనవరాలు.. లవర్ కోసం కన్న తల్లిని అతి కిరాతకంగా చంపేసింది..!

Daughter  : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…

16 hours ago