Hero Ram : త్వరలో పెళ్లికి రెడీ కాబోతున్న హీరో రామ్… పెళ్లి కూతురు ఎవరో తెలుసా..??

Authored By Breaking News | The Telugu News | Published on: June 15, 2023, 7:00 pm

Hero Ram : తెలుగు చలనచిత్ర రంగంలో ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్రవంతి మూవీ బ్యానర్స్ అధినేత స్రవంతి రవి కిషోర్ కుమారుడుగా స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రామ్ మొదటి సినిమా “దేవదాస్”తో తిరుగులేని విజయాన్ని అందుకోవటం జరిగింది. డాన్స్ మరియు ఫైట్స్ ఇంక నటనపరంగా అన్ని రకాలుగా ప్రేక్షకులను అల్లరిస్తూ మొదట లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న రామ్ చాలామంది అమ్మాయిల.. కలల రాకుమారుడు. ఆ తరువాత మాస్ ఇమేజ్ సొంతం చేసుకోవటానికి చాలా వైవిధ్యమైన సినిమాలు చేసి అనేక పరాజయాలు మూటగట్టుకున్నాడు.

ఒకానొక దశలో రామ్ కెరియర్ ముగిసిపోయింది అని అందరూ అనుకుంటున్నారు తరుణంలో.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “ఇస్మార్ట్ శంకర్” సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్నారు. ఈ సినిమాలో మాస్.. యాక్షన్ తో రామ్ మంచి ఇమేజ్ సొంతం చేసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలామంది హీరోలు పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అనే పేరొందిన చాలామంది హీరోలు పెళ్లిళ్లు చేసుకుని జంటలుగా ఒకటై పోతున్నారు. ఇప్పుడు ఇదే బాటలో రామ్ పోతినేని కూడా జాయిన్ అయిపోతున్నట్లు సమాచారం. హైదరాబాద్ కి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కూతురిని రామ్ పెళ్లి చేసుకోబోతున్నారట.

hero ram get married soon

hero ram get married soon

అంతేకాదు ఆమె కూడా మంచి బిజినెస్ ఉమెన్ అని… కుర్ర వయసులోనే వ్యాపార రంగంలో విజయవంతంగా రాణించిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది పెద్దలకుదురుచిన వివాహమే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు వీళ్ళ పెళ్లి ఈ ఏడాది ఆఖరిలోనే ఉండబోతుంది అని.. బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కంప్లీట్ అయిన వెంటనే.. రామ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.

Also read

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp