Actress Bhavana : రెండు గంట‌లు నరకం చూసా.. హీరోయిన్ భావ‌న‌ ఆవేదన

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: August 3, 2022, 12:20 pm

Actress Bhavana : మ‌హాత్మ సినిమాతో శ్రీ‌కాంత్ స‌ర‌స‌న ఆక‌ట్టుకున్న హీరోయిన్ భావన తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచిత‌మే. తెలుగుతో పాటు క‌న్న‌డ, త‌మిళ‌, మ‌ల‌యాళ సినిమాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో గోపిచంద్ తో ఒంటిరి సినిమాలో మెరిసింది. ఇక ఆ త‌ర్వాత సౌత్ లోని ఇత‌ర భాష‌ల‌లో హీరోయిన్ గా ప‌లు సినిమాలు చేసి త‌న‌కుంటూ ప్ర‌తేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే అప్ప‌ట్లో ఈమెకు జ‌రిగిన సంచ‌ల‌న ఘ‌ట‌న ఒక్క‌సారిగా అంద‌రినీ కుదిపేసింది. 2017 లో కొచ్చిలో ఒక లొకేషన్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని తన స్నేహితుడు, యాక్టర్, డైరెక్టర్ లాల్ ఇంటికి వెళ్లడానికి బయలుదేరింది.

అయితే అదే రోజు భావ‌న‌పై కారులో లైంగిక దాడి జరగడం ఓ సంచ‌ల‌నంగా మారింది. ఇక ఈ వ్య‌వ‌హారంలో ఓ సెల‌బ్రెటీ కూడా ఉండ‌టంతో మ‌రింత సంచ‌ల‌నంగా మారింది.ఇక లైంగిక దాడి జరగడానికి తన కార్ డ్రైవర్ ప్రమేయం కూడా ఉండడంతో ముందుగానే ఓ పథకం ప్రకారం దాడి చేసిన‌ట్లు పోలీసులు తేల్చారు. కారులోకి ప్రవేశించిన దుండ‌గులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ బట్టలు చించేసారు. ఇలా దాదాపు రెండు గంటల పాటు లైంగికంగా చిత్ర‌హింస‌లు పెట్టి తర్వాత‌ తనని ఫ్రెండ్ ఇంటి ముందు వదిలిపెట్టారు. ఇక వారి నుంచి తప్పించుకున్న భావ‌న ఒంటిని క‌వ‌ర్ చేసుకుంటూ తన ఫ్రెండ్ ఇంటిలోకి వెళ్లింది. ఇక ఫ్రెండ్ లాల్ సహాయంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది.

Heroine bhavana emotional about her incident

Heroine bhavana emotional about her incident

Actress Bhavana : సోష‌ల్ మాడియాలో లో మ‌ద్ద‌తుగా…

సాధారణంగా లైంగిక దాడి జరిగినప్పుడు వారి పేరు వివ‌రాలు గోప్యంగా ఉంచుతారు.. కానీ పోలీసుల ద్వారా ఈ విషయం మీడియాకు తెలియడంతో రెండు గంటల పాటు కారులో లైంగిక వేధింపులకు గురైన నటి భావన అంటూ హెడ్ లైన్స్ వేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. అయితే ప్లాన్ ప్రకారమే తనపై లైంగిక దాడి జరిగిందన్న భావన ఏకంగా స్టార్ నటుడు దిలీప్ పేరు ఇన్వాల్వ్ అయ్యాడన‌డంతో హాట్ టాపిక్ గా మారింది. అయితే నటుడు దిలీప్ పై ఆరోపణలు చేయడంతో మొద‌ట్లో మద్దతు ఇవ్వ‌లేదు. అయితే సోషల్ మీడియా వేదికగా తనకు మద్దతు లభించడంతో ఇక నటీనటులు కూడా ఒక్కొక్క‌రిగా మద్దతు ప్ర‌క‌టించారు. ఇక దాడి జరిగినట్లు సాక్షాధారాలు ఉండ‌టంతో దిలీప్ మూడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు.

అయితే ఈ ఇష్యూ త‌ర్వాత భావ‌న తేరుకుని ఘటన జరిగిన ఐదు ఏళ్లకు మీడియా ముందుకు వచ్చి త‌న ఆవేద‌న వ్య‌క్తం చేసింది. తాను ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఒక సాధారణ మహిళలన‌ని.. తాను కూడా ఒక చిన్న కుటుంబం నుంచే పరిశ్రమలోకి వచ్చానని గుర్తుచేసుకున్నారు. అయితే నిందితులపై కేసు పెట్టిన‌ప్ప‌టికీ తనపై జరిగిన లైంగిక దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వారి దగ్గర ఉన్నాయని.. అయితే ఆ వీడియోల‌ను ఎప్పుడైనా బ‌య‌ట‌పెట్టోచ్చ‌ని బాధ‌ప‌డింది. ఆ ఫోటోలు వీడియోలు బయటకు వచ్చిన రోజు సోషల్ మీడియాలో.. తాను నవ్వుతూ ఉండే ఫోటోలు కాకుండా.. దాడి చేసిన వారి ఫోటోలు అలాగే తన వీడియోలు మాత్రమే కనపడతాయని త‌న ఆవేద‌న‌ను చెప్పుకొచ్చింది.

Also read

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "AP BC Politics : లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ ఓట్లపై రసవత్తర పోరు.. టీడీపీ, వైసీపీ మధ్య మొదలైన అసలైన మైండ్‌గేమ్!"

  2. "Chandrababu : జగనన్న కాలనీలపై కూటమి సర్కార్ సంచలన అడుగు.. 45 రోజుల డెడ్‌లైన్‌తో మంత్రుల కమిటీ ఏర్పాటు!"

  3. "Chinna Srinu : చిన్న శ్రీను లేకుండా విజయనగరంలో వైసీపీ నిలబడగలదా? బొత్స ఫ్యామిలీకి జీవన్మరణ సమస్యేనా..?"

  4. "AP Local Body Elections : ఈవీఎంలు లేవు.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు! ఏపీ ఎస్ఈసీ ప్రకటనతో పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు..!"

  5. "Telangana Current Bills : తెలంగాణ ప్రజలకు కరెంట్ ఛార్జీల షాక్ ? ట్రూ-అప్ భారంపై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్..!"

  6. "Dasara Special Buses : దసరా ప్రయాణికులకు ఆర్టీసీ భారీ గుడ్‌న్యూస్.. ఏకంగా 5,261 స్పెషల్ బస్సులు, ఛార్జీల పెంపు ఉందా..?"

  7. "Jabardasth Nookaraju : స్కిట్‌కి రూ.5 వేలు ఇస్తే ఈఎంఐలే దిక్కు.. జబర్దస్త్ నూకరాజు షాకింగ్ కామెంట్స్"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp